Suryaa.co.in

Andhra Pradesh

జిల్లాల విభజనతో ఎక్కువ నష్టపోయేది ఉద్యోగులే: బొప్పరాజు

విజయవాడ : రాష్ట్ర విభజనలోనూ, జిల్లాల విభజనలోనూ ఎక్కువ నష్టపోయేది ఉద్యోగులేనని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల విభజన సమయంలో ఆప్షన్‌ సౌకర్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ఉద్యోగులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటులో ఉద్యోగులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయాల నిర్వహణకు కూడా డబ్బులు వెచ్చించలేని పరిస్థితి ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజనలోనూ, జిల్లాల పునర్వవస్ధీకరణ సమయంలోనూ ఎక్కువగా నష్టపోయేది ఉద్యోగులేనని వ్యాఖ్యానించారు. జిల్లాల పునర్వవస్ధీకరణ జరుగుతున్న సమయంలో ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోవాలన్నారు.

గతంలో పెద్ద జిల్లా, చిన్న జిల్లా అని తేడా లేకుండా సమానంగా ఉద్యోగుల కేటాయింపు జరిగిందని.. ఇప్పుడు ఉద్యోగుల కేటాయింపు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తామంటున్నారని అన్నారు. కొత్త జిల్లా కలెక్టరేట్‌లకు పాత పద్దతిలోనే ఉద్యోగులను కేటాయించాలని కోరారు. ఉద్యోగుల విభజన సమయంలో ఆప్షన్ సౌకర్యాన్ని కల్పించాలి, ఆ తరువాత ఇంకా ఉద్యోగులు కావాలంటే రివర్స్ సీనియారిటీ పద్దతిన బదిలీలు చేపట్టాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE