Suryaa.co.in

Telangana

టీఆర్‌ఎస్ ఆందోళనకు అనుమతి లేదన్న సర్కార్

– అనుమతి ఉండాల్సిందేనన్న హైకోర్టు

హైదరాబాద్‌: తెరాస రాస్తారోకో, ధర్నాలపై కాకతీయ లారీ అసోసియేషన్‌ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అనుమతి లేని ఆందోళనలతో ప్రజా రవాణాకు ఆటంకం కలుగుతోందని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీంతో తెరాస ఆందోళనకు అసలు అనుమతి ఉందా?అని హైకోర్టు ప్రశ్నించగా.. రాస్తారోకోలకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం తెలిపింది. తమ దృష్టికి వచ్చిన వాటిపై చర్యలు తీసుకుంటామని హోంశాఖ వెల్లడించింది. అయితే, ఏం చర్యలు తీసుకున్నారో అఫిడవిట్‌ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో ఆందోళనలకు అనుమతి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

LEAVE A RESPONSE