Suryaa.co.in

Telangana

రాజధానిలో కొనసాగుతున్న మజ్లిస్ ధిక్కారపర్వం

– మొన్న భోలక్‌పూర్ కార్పొరేటర్.. నిన్న పత్తర్‌గట్టి కార్పొరేటర్ ధంకీ
– యునాని ఆసుపత్రి లో ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్
– పోలీసులకే దిక్కు లేని దుస్థితి

రాజధానిలో ఎంఐఎం అరాచకపర్వం కొనసాగుతూనేవుంది… భోలక్పూర్ ఎం ఐ ఎం కార్పొరేటర్ గౌస్ పోలీసులపై విరుచుకుపడ్డ విషయం మరవకముందే , మరో ఘటన తెరపైకి వచ్చింది , పత్తర్ గట్టి ఎం ఐ ఎం కార్పొరేటర్ సోహెల్ ఖాద్రి మరో వివాదానికి తెర లేపారు, విషయంలోకి వెళితే… బుధవారం రాత్రి చార్మినార్ యునాని ఆసుపత్రిలో ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చెయ్యడం తో ,యునాని ఆసుపత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే చార్మినార్ ఎస్సై ఆసుపత్రికి చేరుకొని పార్కింగ్ చేయనివ్వకుండా గేట్లు మూయించాడు, ఇది తెలుసుకున్న కార్పొరేటర్ ఖాద్రి అక్కడికి చేరుకొని ఎస్సై పై విరుచుకు పడ్డారు. 25 ఏళ్ల నుండి రంజాన్ సమయంలో ఇక్కడే జనాలు పార్కింగ్ చేస్తున్నారు ,ఇప్పుడే మీకు ఇబ్బంది వచ్చిందా అంటూ గదిరించుకుంటు మాట్లాడారు, పైగా ఎస్సై తన విధులను నిర్వహిస్తుండగా ఆటంకపరిచాడు.

LEAVE A RESPONSE