Suryaa.co.in

Andhra Pradesh

9 గంటల కరంటు సరఫరా కష్టమే

– సాగుకు మూడున్నర గంటలే సరఫరా!
– ఇంధన శాఖ నిర్ణయం : రైతుల్లో ఆగ్రహావేశాలు

అమరావతి : వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీని జగన్‌ సర్కారు తుంగలో తొక్కింది. మూడున్నర- నాలుగున్నర గంటలు మాత్రమే సాగుకు కరెంటు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని డిస్కంల పరిధిలో ఇప్పటికే ఇది అమలవుతోంది. ఈ కారణంగా పంటలకు నీరందక ఎండిపోతాయని అన్నదాతలు కలవరపడుతున్నారు.

సీపీడీసీఎల్‌ పరిధిలో వ్యవసాయ విద్యుత్‌ను నాలుగు గ్రూపులుగా ప్రకటించింది. ఏ గ్రూపులో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడున్నర గంటల వరకూ, బీ గ్రూపులో ఉదయం ఏడున్నర నుంచి 11 గంటల దాకా, గ్రూపు సీలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల దాకా, డీ గ్రూపులో మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఆరుగంటల దాకా విద్యుత్‌ సరఫరా చేస్తోంది.

ఆ తర్వాత ఇవ్వడం లేదు. మరోవైపు.. సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. గృహ విద్యుత్‌ కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయనికి మూడున్నర నుంచి నాలుగు గంటలు మాత్రమే సరఫరా చేస్తుండడంతో రైతుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A RESPONSE