అందర్నీ మారుస్తానని
కొందర్ని కొనసాగిస్తే..
తప్పించినోళ్లు వేస్టా..
కొనసాగించినోళ్ళు బెటరా..
మొత్తం అందరూ
రాజీనామా లెటరా..
151 లో 25 మందే గుడ్డా..
మిగిలినోళ్ళు గాడిద గుడ్డా..
ఇంతకీ ఇది ఎవరి అడ్డా..
మార్చేస్తే అడ్డాపడ్డా..!
నిరసనలు..నీరసమేనా..
రెండ్రోజుల్లో నిమ్మ రసమేనా..
మొత్తానికి తొలిసారిగా
ధిక్కారస్వరం..
కొందరి కొనసాగింపు
పండు మీద కారం..
తీసినోళ్ళకి ఓ బాధ..
మొత్తంగా దక్కనోళ్ళకి
అదో విషాద గాథ..
మొన్నటి వరకు
వస్తుందని ఆశ..
ఇప్పుడు దోశ..అప్పడం..
ఎవరికి ఆ బాధ చెప్పడం..
చెబితే తీరేదా..
చెప్పుకుంటే వినేనా..
అసలుకి ఆ ఛాన్స్ ఇచ్చేనా!
ఎవరి తోటి ఎవరు..
తానేటికి తేనీటి విందు..
మేకతోటి మేకపోతు
గాంభీర్యం..
ఒకరు ఎంత ‘కురస’ల..
అంతే ‘కాకా’ని..
దీనికంతటికీ
ఏది ఆది..మూలం..
ఏమిటో మూల్యం!?
ఈఎస్కే..