Suryaa.co.in

Andhra Pradesh

జాబ్ మేళా నిరంతర ప్రక్రియ

– మొదటి రోజు 4,784మందికి ఉద్యోగాలు
– రాష్ట్రంలో నిరుద్యోగం పోయే వరకు కొనసాగింపు
– మేళాను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

తిరుపతిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు మొదటి రోజు శనివారం 4,784మందికి ఉద్యోగాల సాధించినట్టు వైఎస్సార్ సిపి జాతియ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు రాయలసీమ ప్రాంతాల నుంచి 40వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. తొలిరోజు జాబ్ మేళాకు పది, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ తదితర విద్యార్హత కలిగిన అభ్యర్థులు మొత్తం 15,750మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు.

పది, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్హతతో 7,500మంది అభ్యర్థులు హాజరయ్యారని, వారిలో 2,347మంది, డిగ్రీ విద్యారతతో 5,700మందిలో 1,700మంది, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హత కలిగిన అభ్యర్థులు 737మందిలో 410మంది ఐటీ ఉద్యోగాలు,
మొత్తం 4,784మంది అభ్యర్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు.

ఉద్యోగాలు సాధించిన ఉద్యోగుల్లో కొందరికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, తిరుపతి ఎంపి గురుమూర్తి చేతుల మీదుగా ఆఫర్ లెటర్లను అందజేశారు. మరో వారంలోపు ఉద్యోగాలు సాధించిన వారందరికి ఈమెయిల్, పోస్టు ద్వారా ఆఫర్ లెటర్లు అందించనున్నట్లు ఆయన తెలిపారు.

తిరుపతి జాబ్ మేళాకు వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగార్థులందరికీ ఈ సందర్బంగా అభినందనలు తెలిపారు. ఇక్కడ అన్ని రకాల విద్యార్హతలకు తగిన ఉద్యోగావకాశాలు ప్రఖ్యాత కంపెనీల్లో కల్పిస్తున్నాంట్టు చెప్పారు. అవకాశాలను అందుకోవడం ఇక మీ వంతు,యువశక్తి ఉత్పాదక శక్తిగా మారితే తలసరి ఆదాయం, దేశ జీడీపీ కూడా పెరుగుతుందని ఆయన వెల్లడించారు.

ఈ జాబ్ మేళా రాయలసీమ నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన వస్తోందన్న ఆయన ఎల్జీ, హెచ్సీఎల్, అపోలో, కియామోటార్స్ తదితర దాదాపు 147 కంపెనీలు ఈ జాబ్ మేళాలో యువతకు ఉద్యోగాలిస్తున్నాయని ఉద్యోగార్థులందరూ వారి విద్యార్హతకు తగిన మంచి ఉద్యోగాలు పొందాలని మనసారా కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా జాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రూపుమాపే వరకు కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు.

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కల్పించే లక్ష్యంతో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో రెండు రోజుల మెగా జాబ్ మేళాను ఏర్పాటుచ చేసినట్టు చెప్పారు. అంతకు ముందు ఈ జాబ్ మేళాను శనివారం ఉదయం జ్యోతి ప్రజ్మళనతో పాటు దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ఎంపి విజయసాయిరెడ్డి ప్రారంభించారు.

జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ దశబ్దాల పాటు కష్టపడి చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని తెలపారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగానే జాబ్ మేళాను రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి, విశాఖపట్నం, గుంటూరులలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే తొలుత శ్రీవారి పాదాల చెంత ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువత, అంతర్జాతీయ, జాతీయ కంపెనీలను ఒక చోటకి చేర్చి పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కల్పిస్తున్న ముఖ్యమంత్రికి మనందరం ధన్యవాదాలు తెలుపుకోవాలన్నారు.
కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, వాస్తవానికి దూరమైన అసత్య ప్రచారాలు అపోహలను నమ్మొద్దని ఆయన కోరారు. తిరుపతిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు 40 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 10 వేల మందికి ఉద్యోగావకాశం కల్పిస్తామన్నారు. ఉద్యోగం రాని వారు నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించాలన్నారు. అందరికి ఉద్యోగావకాశాలు కల్పించే వరకు జాబ్ మేళా ప్రక్రియ కొనసాగుతుందని, రిజిస్ట్రేషన్ల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక వెబ్ సైట్ లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

 

LEAVE A RESPONSE