– వేధింపుల రాజకీయం మాని….ప్రజల బాధలను గుర్తించండి: టీడీపీ అధినేత చంద్రబాబు
– పుంగనూరులో పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులను ఖండించిన చంద్రబాబు
అమరావతి:- తెలుగు దేశం కార్యకర్తలు, నాయకుల పై కేసులు పెడితే ప్రజల పై పన్నుల భారం తగ్గదని, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తొలగిపోదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. పన్నుల బాదుడు, చార్జీల మోత, నిత్యావసర ధరలతో జనం తీవ్ర ఆవేదనలో ఉంటే వాటిపై దృష్టిపెట్టాల్సిన ప్రభుత్వం…ప్రశ్నించిన టిడిపి కార్యకర్తలపై కేసులు పెడుతుందని మండి పడ్డారు.
బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రజల కష్టాలపై నిరసలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లపై కేసులు పెడితే ధరల భారం తొలగిపోదని ప్రభుత్వం గుర్తించాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పాలసీలు ఎంత భారంగా మారాయో ప్రభుత్వం తెలుసుకోవాలని సూచించిన చంద్రబాబు…..టిడిపి కార్యకర్తలపై కేసులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపవని అన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కుమ్మరిగుంట గ్రామంలో తెలుగు యువత నాయకులు చిన్న మోహన్ తో పాటు 10 మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో బాదుడే బాదుడు నిరసనలు కార్యక్రమం నిర్వహిస్తున్న టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడి చేసింది కాక….అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. టిడిపి నేతలపై కేసులు అక్రమ కేసులు ఎత్తి వేసి….ప్రజల బాధలపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.