– నిర్వాసితులను ఎప్పటిలోగా ఆదుకుంటావో.. కేంద్రనిబంధనలప్రకారం ప్రాజెక్ట్ పనులు జరిగేలా చూస్తామని చెప్పగలవా?
బహుళార్థసాధకప్రాజెక్ట్ ని బ్యారేజీగా మార్చడానికి సిద్ధమైనందుకు నీ తండ్రివిగ్రహం పెడుతున్నావా?
ప్రాజెక్ట్ నిర్మాణంపై ముఖ్యమంత్రికి ఏమాత్రం బాధ్యత, నిజాయితీ ఉన్నాతక్షణమే పీపీఏ మినిట్స్ సమాచారం మొత్తం బయటపెట్టాలి.
• గోదావరి నీళ్లు 7రాష్ట్రాలకు పంపిస్తామంటున్న మంత్రిని ఎక్కడతెచ్చావు జగన్ రెడ్డీ?
• ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా నిర్వాసితులకు రూ.10లక్షలు.. రూ.20లక్షలిస్తానని జగన్మోహన్ రెడ్డి బీరాలుపలికాడు.
• ఎస్టీనియోజవర్గాలన్నీ తానే గెలిచానన్న అహంకారంతో చివరకు నిర్వాసితుల్ని నట్టేట్లో ముంచేశాడు. వారి ఉసురుతగిలి జగన్ రెడ్డి నాశనంకావడం ఖాయం.
• రివర్స్ టెండరింగ్ తో రూ.800కోట్లు ఆదాచేశామన్న జగన్ రెడ్డి, 11వ పీపీఏ మీటింగ్ లో రూ.263 కోట్లు ఆదా అయ్యాయని చెప్పాడు. • పోలవరం విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుని ఎండగడుతూ, పూర్తివివరాలతో కేంద్రానికి లేఖరాస్తాం.
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
జాతీయ ప్రాజెక్టు, బహుళార్థసాధకప్రాజెక్ట్ , రాష్ట్రానికి లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తిచేయడానికి తెలుగుదేశంప్రభుత్వం శక్తివంచనలేకుండా కృషిచేసిందని, తెలంగాణలోని 7 ముంపుమండలాలను ఏపీలోకలిపితేనే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేస్తాననిపట్టుబట్టి సాధించిమరీ, ప్రాజెక్ట్ ను పూర్తిచేయాలన్న తన సంకల్పాన్ని గతంలోనే చంద్రబాబుగారు చాటుకున్నారని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
టీడీపీహాయాంలో చంద్రబాబునాయుడు ప్రతిసోమవారాన్ని పోలవారంగా మార్చుకొని డ్యామ్ సైట్లో పనులుపరుగులుపెట్టించి 71శాతంవరకు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేశారు. జగన్మోహన్ రెడ్డి తన మిడిమిడిజ్ఞానంతో, చారిత్రాత్మక వైఫల్యంతో పోలవరానికి దుర్గతి పట్టించాడు . తన అసమర్థతను, చేతగానితనాన్నికప్పిపుచ్చుకోవడానికి, చంద్రబాబునాయుడు హయాంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రూ.55,548కోట్ల ప్రాజెక్ట్ అంచనావ్యయాన్ని ఆమోదిం చేయించుకోలేని దుస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడనేది వాస్తవం.
చేతిలో 28మంది ఎంపీల ను ఉంచుకొనికూడా పోలవరంనిర్మాణానికి అవసరమైన నిధుల్ని ప్రధానివద్ద, కేంద్రజలవన రుల మంత్రివద్ద ఆమోదింపచేసుకోలేకపోయాడు. వరదలు వచ్చినప్పుడు నిర్వాసితులను ఆదుకుంటామని… అంతఇస్తాము.. ఇంతఇస్తామని ప్రగల్భాలుపలికిన జగన్ రెడ్డి.. ఆఖరికి వారినిగాలికి వదిలేశాడు. పోలవరం నిర్వాసితులకు జగన్మోహన్ రెడ్డిచేసిన అన్యాయం, ద్రోహం క్షమించరానిది. నిర్వాసితుల ఉసురు ఈ ముఖ్యమంత్రికి కచ్చితంగా తగిలే తీరుతుం ది. ఎస్టీనియోజకవర్గాలన్నింటిలో తనపార్టీనే గెలిచిందన్న అహంకారంతో జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితుల్ని నిట్టనిలువునా నీళ్లలో ముంచేశాడు.
ప్రభుత్వాలను నమ్మి, ప్రాజెక్ట్ ని నమ్మి పోలవరంనిర్మాణంకోసం సర్వస్వంకోల్పోయిన గిరిజనులను ఈ ముఖ్యమంత్రి చెట్లకు ,పుట్లకు, కొండలు, గుట్లకు వదిలేశాడు. వారి ఉసురు తగిలి జగన్మోహన్ రెడ్డి నాశనం కావడంఖాయం. జగన్మోహన్ రెడ్డి అసమర్థత, చేతగానితనం, అవినీతే పోలవరం ప్రాజెక్ట్ ని ప్రశ్నార్థకంగామార్చాయి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా నిర్వాసితులకు పదిలక్షలిస్తాను.. 20లక్షలిస్తానని జగన్మోహన్ రెడ్డి బీరాలుపలికాడు. ఎస్టీనియోజవర్గాలన్నీ తానే గెలిచానన్న అహంకారంతో చివరకు నిర్వాసితుల్ని నట్టేట్లో ముంచేశాడు.
గిరిజనులు ఉసురు కచ్చితంగా జగన్ రెడ్డికి తగులుతుంది. వారి ఉసురుతో, ఏడుపుతో ముఖ్యమంత్రి పతనం కావడం ఖాయం. ప్రాజెక్ట్ కోసం తమసర్వస్వంకోల్పోయిన వారికి న్యాయంచేయలేని ముఖ్యమంత్రి, పోలవరాన్ని నిర్మిస్తాడా? చంద్రబాబుని, తెలుగుదేశాన్ని తిట్టడంతప్ప, ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి పోలవరంలో ఏంచేశాడు? కేంద్రప్రభుత్వం, పోలవరంప్రాజెక్ట్ అథారిటీ తక్షణమే ప్రాజెక్ట్ స్థితిగతులపై జోక్యంచేసుకోవాలి.
పదో పీపీఏ మీటింగ్ మినిట్స్ వివరాలను, 11వ పీపీఏ మీటింగ్ లో ఏపీప్రభుత్వం ఏంచెప్పిందనే వివరాలను ముఖ్యమంత్రి తక్షణమే బహిర్గతంచేయాలి. రివర్స్ టెండరింగ్ తో రూ.800కోట్లు ఆదాచేశామన్న జగన్ రెడ్డి, 11వ పీపీఏ మీటింగ్ లో రూ.263కోట్లే ఆదాఅయ్యాయని చెప్పాడు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ లనిర్మాణం పీపీఏ చెప్పినట్లే జరిగిందితప్ప, ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా, లోప భూయిష్టంగా జరగలేదని జగన్ ప్రభుత్వమే కేంద్రానికిచెప్పింది. జగన్ రెడ్డి ప్రభుత్వ సమాధానాన్నే కేంద్రమంత్రి లోక్ సభలో రాజ్యసభలో చదివి వినిపించారు.
పెంటపాటి పుల్లారావు పిటిషన్ విచారణలో భాగంగా, పోలవరం, పట్టిసీమలో ఎలాంటి అవినీతిలేదని ఢిల్లీహైకోర్ట్ కు కేంద్రం స్పష్టంగా చెప్పింది. గోదావరి నీళ్లు 7రాష్ట్రాలకు పంపిస్తామంటున్న మంత్రిని ఎక్కడ తెచ్చావు జగన్ రెడ్డీ? 35 మీటర్ల మందాలు క్రిటికల్ గా ఉన్నపనులంటా …..ఇలాంటి వారిని జలవనరులు మంత్రులను చేయబట్టే, పోలవరానికి, రాష్ట్రంలోని ఇతర సాగునీటిప్రాజెక్ట్ లకు పట్టరానిదుర్గతిపట్టింది జగన్ రెడ్డి.
చంద్రబాబునాయుడి హయాంలో జరిగిన ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన రూ.4,500కోట్లను కేంద్రప్రభుత్వం విడుదలచేస్తే, వాటిని నిర్వాసితులకు చెల్లించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం ఇతరఅవసరాలకు వాడుకుంది. పీపీఏ (పోలవరంప్రాజెక్ట్ అథారిటీ చెప్పినావినకుండా, రివర్స్ టెండరింగ్ తోరిజర్వ్ టెండరింగ్ జరిపి, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని దుస్థితికివచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాను… పోలవరాన్ని ఎప్పుడు పూర్తిచేస్తాడో సమాధానంచెప్పాలి.
పట్టిసీమ లిఫ్ట్ మాదిరే మరో లిఫ్ట్ కట్టే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? 4ఏళ్లు పోలవరంపనులు ఆపినందుకు ప్రాజెక్ట్ ప్రదేశంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెడుతున్నారా? ప్రాజెక్ట్ లో పడిన గుంతలు పూడ్చటానికి రూ.800కోట్లు, నీళ్లు ఎత్తిపోయడానికి 2వేలకోట్లు అవుతుందా? జగన్మోహన్ రెడ్డి కళ్లల్లో ఒకకంట్లో రూ.800కోట్లు, మరోకంట్లో రూ.2వేలకోట్లు కనిపిస్తున్నాయి. అర్హతనిబంధనలు మార్చేసి అర్హతలేని సింగిల్ కంపెనీకి ప్రాజెక్ట్ టెండర్ కట్టబెట్టడం జగన్ రెడ్డిచేసిన అతిపెద్దతప్పు.
960 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేసిఉంటే, ఇప్పడు ఈ ప్రభుత్వం విద్యుత్ వినియోగానికి రూ.6,800కోట్లు దుర్వినియోగం చేయాల్సినపరిస్థితివచ్చేదికాదు. పట్టిసీమ, పురుషోత్తమపట్నం వంటి లిఫ్ట్ ఇరిగేషన్లకు వినియోగించే విద్యుత్ కూడాఆదాఅయ్యిఉండేది. ప్రాజెక్ట్ నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను ఎత్తిచూపుతూ కేంద్రానికి లేఖరాస్తాం. పోలవరం పూర్తిచేయడానికి కేంద్రప్రభుత్వం టీడీపీప్రభుత్వానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తే, జగన్ రెడ్డి కేంద్రం చెప్పిందివినకుండా.. తనస్వార్థంకోసం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రశ్నార్థకంచేశాడు.
సీబీఐపీ వారు ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి, 2018లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గా పోలవరంజాతీయప్రాజెక్ట్ కి అవార్డ్ ఇస్తే , రాష్ట్రప్రభుత్వం తరుపునతానే స్వయంగా అందుకున్నాను. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో పట్టిసీమ నమోదైతే, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పోలవరం పనులు నిలిచాయి. అదీ చంద్రబాబు హాయాంలో ప్రాజెక్ట్ నిర్మాణపనులుజరిగిన తీరు.
జగన్మోహన్ రెడ్డి తనమూర్ఖత్వంతో, అనుభవరాహిత్యంతో, ధనదాహంతో, కమీషన్ల కక్కుర్తితో జాతీయప్రాజెక్ట్ అయిన పోలవ రాన్ని నాశనంచేసి, చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడ్డాడు… జాతిద్రోహానికి పాల్పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి తప్పిదాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదు..ఆయన ముమ్మాటికీ శిక్షార్హుడే. పోలవరం విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుని వదిలిపెట్టే ప్రసక్తేలేదు. ముఖ్య మంత్రికి ఏమాత్రం బాధ్యతఉన్నా..చిత్తశుద్ధిఉన్నా.. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన పీపీఏ మినిట్స్ అన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.