Suryaa.co.in

Telangana

ఎంఐఎంను చూస్తే టీఆర్ఎస్ నేతలకు లాగులు తడుస్తున్నయ్

-ఇంటికో ఉద్యోగం ఇవ్వని కేసీఆర్… ఊరికి 10 మద్యం షాపులు తెరిచిండు
-బీజేపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఎంత ఖర్చైనా విద్య, వైద్యం ఫ్రీ
-కార్యకర్తలారా… బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా గల్లీగల్లీ తిరగండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్

టీఆర్ఎస్ నేతలకు ఎంఐఎం పేరు వింటేనే లాగులు తడుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఒవైసీ కి భయపడి పాతబస్తీలో సభ పెట్టేందుకు భయపడుతున్నారని విమర్శించారు. ఎంఐఎంకు సవాల్ విసిరి పాతబస్తీకి పోయి సభ పెట్టి గర్జించి, గాండ్రించిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు రాత్రి పొద్దుపోయాక మంతన్ కోడ్ గ్రామంలో భారీ ఎత్తున తరలివచ్చిన జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…

మంతన్ కోడ్ చెరువు నిండాలంటే టీఆర్ఎస్ నేతలను పాతరేయాల్సిందే. ఇంకా టీఆర్ఎసోళ్లను ఎట్లా భరిస్తున్నరు? ఇంటికో ఉద్యోగం ఇవ్వలేని కేసీఆర్… ఊరికి పది మద్యం షాపులు పెడుతున్నడు సిగ్గులేకుండా… కేసీఆర్ మద్యం అంటే ప్రేమ.. రాత్రంత తాగుతడు. పొద్దంతా పడుకుంటడు. రాజకీయాలన్నీ రాత్రిపూట చేస్తడు. ఎవరిని ముంచాలి.. ఎవరిని దెబ్బతీయాలని ఆలోచిస్తడు.

మంతన్ కోడ్ గ్రామం బీజేపీకి కంచుకోట. ఈసారి ఎన్నికలొస్తే.. చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి టీఆర్ఎస్ కు ఓటేయొద్దని, బీజేపీకి ఓటేస్తేనే అభివ్రుద్ధి సాధ్యమని ప్రచారం చేయాలి.కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణకు 1.4 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా నిర్మించడం లేదు. కానీ కేసీఆర్ మాత్రం రూ.వందల కోట్లతో 100 గదులను నిర్మించుకుని ప్రగతి భవన్ కట్టించుకుని రోజుకో గదిలో పడుకుంటున్నడు.

కోవిడ్ మహమ్మారితో పేదలు అనాథలుగా మారితే వారికి ఉచిత బియ్యం అందించడంతోపాటు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలను కాపాడిన ఘనత నరేంద్రమోదీదే.కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుంది. రాత్రింబవళ్లు బీజేపీనే కలవరిస్తున్నడు. దీంతోపాటు కొడుకు పదేపదే సీఎం సీటు అడుగుతున్నడని, మనవడు కూడా తాతా డాడీకి సీఎం సీటివ్వాలని అడుగుతుంటే కోపంతో టీవీలలు పగలకొడుతున్నడు.

నేను లవంగ తింటుంటే… కేటీఆర్ నన్ను తంబాకు తింటున్నవని దుష్ప్రచారం చేస్తుండు. డ్రగ్స్ తింటూ మైండ్ దొబ్బి అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. కేసీఆర్ ది అంతా చాట్ల తవుడు పోసి కుక్కలకు కొట్లాడిన పెట్టే చందం. టీఆర్ఎస్ లో అందరికీ మంత్రి పదవి ఆశ చూపి వారి మధ్య కొట్లాట పెడుతుండు.

పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వరు. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం 100 గదుల్లో ఉంటున్నడు. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వరు… కానీ కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి పదవులిచ్చి రూ.25 లక్షలు జీతం పొందుతున్నరు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ తన ఫాంహౌజ్ కు నీళ్లు తీసుకుపోవడానికే. అందుకోసం రూ.1.4 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? పేదల సమస్యలను ఎందుకు పరిష్కరించడంలేదో కేసీఆర్ ను నిలదీయండి.

పచ్చగున్న పాలమూరులో చిచ్చు పెడుతున్ననని అంటున్నడు కేసీఆర్… మీరే చెప్పండి… పాతబస్తీకి వెళ్లి సభ పెట్టలేని అసమర్థుడు కేసీఆర్. పాతబస్తీ గడ్డమీదకు పోయి జై శ్రీరాం అని గర్జించిన పార్టీ బీజేపీ.ఎంఐఎంను చూస్తే కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలకు లాగులు తడుస్తున్నయ్. అందుకే పాతబస్తీకి వెళ్లి సభ పెట్టలేరు.

చాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అయ్యిండు కాబట్టే పేదల కోసం తపిస్తున్నడు. ప్రతి గ్రామంలో టాయిలెట్లు మొదలు స్మశానవాటిక వరకు మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తున్న నేత నరేంద్ర మోదీ.ఇచ్చేటోడు నరేంద్రమోదీ అయితే.. వడ్డించే స్థానంలో ఉన్న కేసీఆర్ ఆ నిధులను ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తున్నడు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ చూసినా బీజేపీ గెలుస్తుందనే ప్రచారం రావడంతో కేసీఆర్ కు భయం పట్టుకుంది. అందుకే ప్రజా సంగ్రామ యాత్ర ఎక్కడికి వెళ్లినా జనం తరలివస్తున్నరు. తెలంగాణ కోసం పేదలు బలిదానం చేశారు తప్ప కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగమేంది?

తెలంగాణ బిల్లుకు మద్దతివ్వకుంటే రాష్ట్రం వచ్చేదా? కేసీఆర్, ఆయన కుటుంబం పదవులు అనుభవించేవాళ్లా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. నా వల్లే తెలంగాణ వచ్చిందంటూ కోతలు కోసి మోసపు హామీలిచ్చి గద్దెనెక్కిన కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెప్పాలి.

LEAVE A RESPONSE