Suryaa.co.in

Andhra Pradesh

గుడివాడ గుర్నాథరావు చెత్త పుత్రుడు అనాల్సి ఉంటుంది

• జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సత్య బొలిశెట్టి

‘కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నించింది మీ అమ్మగారు నాగమణి కాదా? మీరు కాదా? మీకు మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు, బంధాలు గట్టిగా ఉన్నాయి. మంత్రిగా ప్రస్థానం మొదలుపెట్టిన వెంటనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నావు’ అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సత్య బొలిశెట్టి మంత్రి గుడివాడ అమర్నాథ్ తీరును తప్పుబట్టారు.

సత్య బొలిశెట్టి మాట్లాడుతూ “మంత్రి పదవి వచ్చిన రెండో రోజే అమర్నాథ్ తన శాఖ గురించి మర్చిపోయి ఇష్టానుసారం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తున్నారు. లేనిపోనివి ఆపాదిస్తూ మాట్లాడటం అత్యంత దుర్మార్గం. అమర్నాథ్ అమ్మగారు నాగమణి తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేసింది అప్పుడే మర్చిపోయినట్లున్నారు. జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి 2018లోనే తెగతెంపులు అయ్యాయి. పార్టీ ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ చర్యలను ఎండగట్టారు. తెలుగుదేశం పార్టీ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళింది మీ కుటుంబం. సంబంధాలు, బంధాలు అన్నీ మీకే తెలుస్తాయి. కుల మీటింగుల్లో గంటలు గంటలు స్పీచ్ ఇవ్వడం.. కుల ఆత్మగౌరవాన్ని ఒకరి కాళ్ల వద్ద తాకట్టు పెట్టి మంత్రి పదవులు పొందడం మీకే చెల్లింది. దానిని మొదట గుర్తించండి. కులానికి మీరు ఏదో చేసిన గొప్ప మహానుభావుళ్లలాగా మాట్లాడకండి. మిమ్మల్ని గుడివాడ గుర్నాథరావు చెత్తపుత్రుడు అని పిలవాల్సి వస్తుంది.

• అప్పుడు మీ నాయకుడు ఏం చేస్తున్నాడు??
గత తెలుగుదేశం పార్టీ హయాంలో 87 వేల మంది రైతుల రుణాలను ఎగ్గొట్టారు అని మీరు చెబుతున్నారు. అప్పుడు మీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు కదా..? మరి అప్పుడు చేసిందేమిటి..? రైతులకు తెలుగుదేశం పార్టీ హయాంలో నష్టం జరిగితే మీరు చేసిన పోరాటం ఎంటో ప్రజలకు చెప్పండి. మీ నాయకుడి చరిత్ర అంతా నేరపూరితం. వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఆయన కొడుకు జగన్ చంపాడు అని నిండుసభలో చెప్పిన బొత్స సత్యనారాయణను మంత్రిని చేసి పక్కన కూర్చోబెట్టుకున్నారు. సొంత బాబాయ్ బాత్రూంలో హత్యకు గురైతే ఇప్పటివరకు దానిమీద నిజం బయటకు రాలేదు. హత్యా రాజకీయాలు, రక్తపూరిత రాజకీయాలు మీకు తెలిసినంతగా మాకు తెలియవు. ప్రజలు కష్టాల్లో ఉంటే స్పందించే గుణం మా అధినేతకు మాత్రమే సొంతం. దానికి మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తే మేము మీ కంటే దారుణంగా మాట్లాడగలం. మీ పార్టీకి నూకలు చెల్లాయి… అది మీరు గుర్తించారు. అందుకే ప్రతి విషయాన్ని వ్యక్తిగత విషయంతో ముడిపెట్టి సమస్యను పక్కదారి పట్టించాలని చూస్తున్నారు” అన్నారు

LEAVE A RESPONSE