– మనం ఆంధ్ర రాష్ట్రం లో ఉన్నామా బీహార్ లో ఉన్నామా ?
– వడ్డేశ్వరం లో లోకేష్
సిఎం కాన్వాయ్ కోసం కారు కావాలంటూ ఒక కుటుంబాన్ని నడి రోడ్డు మీద వదిలేసి కారు పట్టుకుపోయారు. ప్రభుత్వ ఆసుపత్రిలో యువతి పై సామూహిక అత్యాచారం జరిగింది. పరామర్శ కు వెళ్ళిన చంద్రబాబు గారికి నోటీసులు ఇచ్చారు. పిల్లలు ఆడుకుంటూ ఫ్లెక్సీ చింపేతే, పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో పెట్టి వేధించారు.
రుయా ఆసపత్రిలో చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని తరలించడానికి రూ.20 వేలు అడిగింది అంబులెన్స్ మాఫియా. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ రెడ్డి మాఫియా రాజ్ అరాచకాలే. ఇసుక, మద్యం, మైనింగ్ ఇసుక , మద్యం , మైనింగ్ ఇలా అన్నింటిలో మాఫియా రాజ్ కారణంగా ప్రజల పై భారం పెరుగుతుంది.
గ్రామాల్లో తాగునీటి సమస్య నుండి అనేక సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారు మాత్రం మిస్సింగ్.గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించే ఆలోచన ఎమ్మెల్యే గారికి లేదు.ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. మూడేళ్లు అయ్యింది సమస్యలు అలానే ఉన్నాయి కనీసం మా సమస్యలు వినడానికి కూడా
ఆయన ఇష్టపడటం లేదని ప్రజలు అంటున్నారు. గౌతమ బుద్ధా రోడ్డు ముందు ఫోటోలు తప్ప, గ్రామాల్లో సమస్యలు ఎమ్మెల్యే గారికి పట్టవా? వడ్డేశ్వరం గ్రామంలో ఇళ్ల పట్టాల సమస్య, డ్రైనేజ్ సమస్య గురించి ప్రజలు చెప్పారు. పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా. ప్రభుత్వ ఆసుపత్రి లో అత్యాచారానికి గురైన యువతిని, కుటుంబాన్ని పరార్శించడం కూడా నేరమేనా?
మరి జగన్ రెడ్డి గారి పాలన లో 800 అత్యాచారాలు జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు? ప్రభుత్వానికి, జగన్ రెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? రమ్య, అనూష, బేగం బీ లను చంపిన వాళ్ళు రోడ్ల పై విచ్చల విడిగా తిరుగుతున్నారు. హోంమంత్రి గారికి కనీసం ఘటన ఎప్పుడు జరిగిందో తెలియకపోవడం దురదృష్టకరం.
ఎన్నికల ముందు జగన్ రెడ్డి…ఎన్నికల తరువాత జగన్ రెడ్డి ఒక్కరేనా అనే అనుమానం ఉంది.ఎన్నికల ముందు 70 ఎంఎం సినిమా చూపించి ఇప్పుడు జగన్ మోసపు రెడ్డి గా మారిపోయారు.గెలిచిన వారంలో సిపిఎస్ రద్దు అన్నారు. మూడేళ్ల తరువాత హక్కుల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్ట్ చేశారు.
ఉపాధ్యాయుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉపాధ్యాయులను టెర్రరిస్టుల్లా ట్రీట్ చెయ్యడం దారుణం. విద్యుత్ ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చిన జగన్ మోసపు రెడ్డి భారీగా ఛార్జీలు పెంచి దోచుకుంటున్నారు.అరగంట మంత్రి పోయారు గంట మంత్రి వచ్చారు.
గంట మంత్రి అహంకారం నెత్తికెక్కి మీడియా పై చిందులు వేస్తున్నారు. 2021 కి పోలవరం పూర్తి చేస్తామన్నారు. 22 కి అన్నారు. ఇప్పుడు 23 కి పోలవరం పూర్తి అంటున్నారు జగన్ రెడ్డి గారు. డయాఫ్రం వాల్ లోపల ఉంటుందో, బయట ఉంటుందో… ఏ ప్రాజెక్ట్ ఏ నది పై కడతారో తెలియని వ్యక్తి మంత్రి అయ్యారు.రివర్స్ టెండర్ వలన ప్రాజక్ట్ ని ముంచుతున్నారని చంద్రబాబు గారు ముందే హెచ్చరించారు. చెత్త నిర్ణయాల వలనే పోలవరానికి ఈ దుస్థితి వచ్చింది. వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది.
తిరుపతి రుయా హాస్పిటల్ ఘటనపై స్పందించిన నారా లోకేష్
రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ నేత బాధిత కుటుంబాన్ని పరామర్శించి తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో ఫోన్ మాట్లాడించారు. బాధితులు రాజంపేట నియోజకవర్గం పెనగలూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన గిరిజనులు.
రుయా హాస్పిటల్ ఘటన నన్ను ఎంతో బాధకు గురిచేసింది. నాకూ ఏడు సంవత్సరాల బాబు ఉన్నాడు.నా కొడుకు కు జరిగినంత బాధ నాలో కలిగింది.కుటుంబాన్ని పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అన్ని రకాలుగా ఆదుకుంటాం.ధైర్యంగా ఉండాలని భరోసా. మనం ఆంధ్ర రాష్ట్రం లో ఉన్నామా బీహార్ లో ఉన్నామా అనిపిస్తుంది.