Suryaa.co.in

Andhra Pradesh

నిరుపేదలకు ప్రభుత్వ పధకాలు చేరేలా సమాజ సేవకులు సహకరించాలి

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే విభిన్న సంక్షేమ పధకాలు దారిద్రరేఖకు దిగువనున్న వారికి చేరేలా సమాజ సేవకులు తగిన సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అయారంగాలలో ఉన్నత స్దానాలలో ఉన్నవారు నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలన్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాల నుండి పలు రంగాలలో సామాజిక సేవను అందిస్తున్న వ్యక్తుల బృందం గురువారం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి తాము చేపడుతున్న కార్యక్రమాలను గురించి వివరించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ప్రత్యేకించి అవగాహనా లేమితో ప్రభుత్వ పధకాలకు దూరం అవుతున్న వారికి అవగాహన కల్పించి వారు వాటిని పొందగలిగేలా తోడ్పాటును అందించాలన్నారు. గవర్నర్ ను కలిసిన వారిలో పారిశ్రామికవేత్తలు, వైద్యనిపుణులు, భారత స్కౌట్స్ , గైడ్స్ ప్రతినిధులు, పాత్రికేయిలు, ఉపాధ్యాయిలు, కళాకారులు ఉన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE