Suryaa.co.in

Telangana

ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై తలసాని సమీక్ష

పవిత్ర రంజాన్ సందర్భంగా ఈ నెల 29 న సాయంత్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో LB స్టేడియంలో ఇఫ్తార్ విందును నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి LB స్టేడియంలో జరుగుతున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం లు నెలరోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని పండుగలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి.. పండుగలను గొప్పగా జరుపుకోవాలి అనేది ముఖ్యమంత్రి ఉద్దేశం అని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇఫ్తార్ విందుకు వచ్చే ప్రతినిధులకు ప్రత్యేక పాస్ లను జారీ చేయడం జరిగిందని అన్నారు.
పేదలు ముస్లీం లు కూడా రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలి అనే ఆలోచనతో రంజాన్ సందర్భంగా పేద ముస్లీం లకు ప్రభుత్వం తరపున దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 29 వ తేదీన నిర్వహించే ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి KCR హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.వాహనాల పార్కింగ్ కోసం LB స్టేడియం పరిసరాలలో 6 ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మంత్రుల తో పాటు ప్రభుత్వ సలహాదారు AK. ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్, డైరెక్టర్ షహనవాజ్ ఖాసీం, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, IG రంగనాథ్, జాయింట్ పోలీస్ కమిషనర్ DS చౌహన్, BC కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసి యొద్దీన్, సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE