Suryaa.co.in

Andhra Pradesh

ఆర్దిక విస్ఫోటన పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్

– రుణ యజ్ఞాన్ని అడ్డుకునేందుకు చేతనైంది చేస్తా
– దొంగ కేసులు… వేధింపులు తప్పవని నాకు తెలుసు
-అయినా ప్రజల సంక్షేమం కోసమే నా తాపత్రయం
-అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తులు, ఆదాయం తాకట్టు
-ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైకాపా కు 30 నుంచి 40 స్థానాలే
– నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక విస్ఫోటన పరిస్థితుల్లో ఉన్నదని వైకాపా , నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రుణ, ధన యజ్ఞం వల్ల ప్రజల భవిష్యత్తు సర్వనాశనం కానుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసేందుకు ప్రభుత్వ పెద్దలు తిప్పలు పడుతున్నారని రఘు రామ ఎద్దేవా చేశారు. ఒకవేళ ప్రభుత్వానికి అప్పు దొరికినా, ఇప్పుడున్న బాకీలు తీర్చడానికి ఆ మొత్తం సరిపోతుందన్నారు.

ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న ఆయన , ఇక రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఎలా చెల్లిస్తారంటూ ప్రశ్నించారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్వలాభం కోసం చేస్తున్న రుణ యజ్ఞాన్ని అడ్డుకునేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులను, ఆదాయాన్ని తాకట్టు పెట్టి చేసిన అప్పుల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శికి లేఖలు రాసినట్లు వెల్లడించిన రఘు రామ, తనని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏజెన్సీలను డబ్బులతో మేనేజ్ చేసి, దొంగ కేసులు బనాయించి, వేధింపులకు గురి చేస్తారని తనకు తెలుసునని అన్నారు.

అయినా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల రుణ , ధన యజ్ఞాన్ని అడ్డుకునేందుకు చివరి వరకు పోరాడుతానని చెప్పుకొచ్చారు. లక్షా యాభై వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని, కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వకపోగా, వారు ఇచ్చిన సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని కూడా స్వాహా చేశారని రఘు రామ చెప్పుకొచ్చారు. గతంలో చేసిన అప్పుల లెక్కలేవీ చెప్పకుండా, మళ్లీ అప్పుల కోసం తిరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఛీ.. కొడుతున్నాయని అని అన్నారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చి, నేరుగా బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు ప్రయత్నించిందని తెలిపారు. తొలుత ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి, ఆ తర్వాత చట్టసభల్లో ఆమోదించినప్పటికీ చెల్లదని వివరించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు.జగన్ సర్కారు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు గా ఉందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానంటే మీరు దుష్టచతుష్టయం గా పేర్కొంటున్న మీడియా సంస్థలు ఏమైనా అడ్డుకుంటున్నాయా? జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్ర సంస్థలను తీసుకు వస్తుంటే… నువ్వు రైల్వేజోన్ తెస్తానంటే ఈ దుష్టచతుష్టయం ఏమైనా అడ్డుకున్నారా?, జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ నిలదీశారు. ఏటా ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామంటే… పరిశ్రమలకు పెట్టుబడులను తెస్తానంటే, ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్పొరేషన్ల ద్వారా రుణ సహాయం చేసి స్వయం ఉపాధి కల్పిస్తామని అంటే ఈ దుష్ట చతుష్టయం అడ్డుకున్నారా? అంటూ వరుసగా ప్రశ్నాపత్రాలను సంధించారు.

సిపిఎస్ రద్దు చేస్తానంటే, కొడాలి నాని సన్నబియ్యం ఇస్తానంటే, మీరు రోడ్డు బాగు చేస్తానంటే… దుష్టచతుష్టయం, ప్రతిపక్షాలు, తానేమైనా అడ్డుకున్న మా? జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. గుజరాత్ తరహాలో మద్య నిషేధం విధిస్తామని మీరు అంటే… అబ్బే, వద్దు .. వద్దు అంటూ మేము ఏమైనా అడ్డుపడ్డ మా అంటూ విరుచుకుపడ్డారు. ప్రజలకు ఏమీ చేయకుండానే, ఇంకా ఎన్నాళ్లని వారిని మభ్య పెడతారని ప్రశ్నించారు.

గత ప్రభుత్వాలకు భిన్నంగా మనమేదో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్లుగా చెప్పుకోవడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనూ 2000 రూపాయల పెన్షన్ ఇచ్చేవారని, గత రెండున్నరేళ్లుగా 250 రూపాయలు ఇస్తున్నారన్నారు. దానికి అదనంగా ఓ రెండు వందల కోట్లు ఖర్చు అవుతున్నాయన్న రఘు రామ, అమ్మ ఒడి పథకాన్ని ఒక ఏడాది ఇవ్వకుండానే ఎగ్గొట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

కళ్యాణ లక్ష్మి వంటి పథకాన్ని లేకుండా చేశారని, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు, ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు రాయితీ రుణాలు అందకుండా చేశారని విరుచుకుపడ్డారు. బోడి నవరత్నాల ద్వారా విద్యా దీవెన వంటి పథకాల వల్ల ఎస్సీలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలను దూరం చేశారని మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలను గుర్తిస్తే ఉన్నారని ఈ విషయాన్ని ఇటీవల లోక్ సభ మాజీ సభ్యుడుఉండవల్లి అరుణ్ కుమార్ కూడా పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు ప్రస్తావించారు.

గతంలో ప్రజలు మోసపోయారని.. పదే, పదే మోసపోయానని రఘురామ అన్నారు. తాను కాడ పెళ్లి లో ఇల్లు కట్టుకున్ననాని, చంద్రబాబుకు ఇల్లు లేదంటే మోసపోయారన్న ఆయన, ప్రజలు ప్రతిసారి మోసపోయారన్నారు. గతంలో సిపిఎస్ రద్దు చేస్తామంటే, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామంటే, గుజరాత్ లో మద్య నిషేధం అమలు చేస్తుంటే ప్రభుత్వం నడవడం లేదా? పని మీరు ప్రశ్నిస్తే ప్రజలు నమ్మారని కానీ ప్రజలు అమాయకులు కారని ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకొని అర్థం చేసుకుంటున్నారని చెప్పారు.

ప్రజలకు మనం ఎన్నో చెప్పామని కానీ ఇంతవరకూ ఏమి చేశామంటూ పార్టీ సభ్యునిగా ప్రశ్నిస్తున్నారని రఘురామకృష్ణంరాజు సూటిగా జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలకు ఇటీవల మార్గనిర్దేశం చేశారని, తాను కూడా పార్టీ సభ్యుడిగా ప్రజల్లోకి వెళతానని… అయితే, వారు గత రెండున్నర ఏళ్లుగా ఏమి చేశారని అడిగితే… ఏమి సమాధానం చెప్పాలో తెలియజేయండండి అంటూ రఘురామకృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాకానికి, వై ఎస్ ఆర్ సి పి భూస్థాపితం అయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీకి 30 నుంచి 40 స్థానాలకు మించి రావని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన కోఆర్డినేటర్లు సమావేశంలో 175 కు 175 స్థానాలు ఎందుకు రావని ప్రశ్నిస్తూనే, 151 స్థానాలు వస్తాయని అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలకు ఏం చేశామని 151 స్థానాలు వస్తాయన్న ఆయన, ఎత్తివేసిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. ఇలాగే అబద్ధాలతో నే కాలం గడిపితే మాత్రం గతంలో ప్రతిపక్షనేత చెప్పినట్లు సింగిల్ డిజిట్ కే మాత్రమే పరిమితం కావాల్సి వస్తుందని చెప్పారు.

గత మూడేళ్లుగా 100 శాతం, 99 శాతం పూర్తయిన ఇళ్లను ప్రజలకు అందకుండా కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వ పెద్దల పై రఘురామ విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలో లక్ష యాభై వేల ఇల్లంటూ ఆర్భాటం చేశారని విమర్శించారు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కేంద్ర ప్రభుత్వం నోటీసుల జారీ నేపథ్యంలో తనపై అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యుడు రాంబాబు చేసిన విమర్శలను రఘు రామ తిప్పికొట్టారు.

LEAVE A RESPONSE