Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీలో రోజుకో అత్యాచారం, హత్య : లోకేష్‌

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీలో రోజుకో అత్యాచారం, హత్య జరుగుతుందని లోకేష్‌ మండిపడ్డారు. సీఎం జగన్‌రెడ్డి పాలనలో ఏపీ బీహార్‌గా మారిందని, గుంటూరు రేపల్లె రైల్వేస్టేషన్‌లో అత్యాచార ఘటన దారుణమని లోకేష్ అన్నారు. ఏపీలో పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతో ఉన్మాదులు దారుణ చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి సీఎం బయటకొస్తే ప్రజాసమస్యలు తెలుస్తాయని, ప్రతిపక్షాలపై విమర్శలు మాని నేరాల కట్టడికి చర్యలు చేపట్టాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE