Suryaa.co.in

Andhra Pradesh

‘ఏవో జరిగాయంటా’ అనడం సిగ్గు,శరం,మానవత్వం లేకుండా వ్యవహరించడమే

• ముఖ్యమంత్రి ‘ఏవో జరిగాయంటా’ అనడం, సిగ్గు, శరం, ఇంగితం, మానవత్వం లేకుండా వ్యవహరించడమే
• అత్యాచార ఘటనకు సంబంధించి, తమప్రభుత్వం రూ.120కోట్లు ఖర్చుపెట్టింది.. టీడీపీ కేవలం రూ.50కోట్లే ఖర్చుపెట్టిందని హోంమంత్రిచెప్పడం నిజంగా నీచాతినీచం.

• ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం అత్యాచారబాధితురాలికి రూ.8లక్షల పరిహారమివ్వాలి.
• హోంమంత్రి చెప్పినట్టు రూ.120కోట్లు ఖర్చుపెడితే, ఆలెక్కప్రకారం రాష్ట్రంలో 1500 అత్యాచారాలు జరిగాయని ప్రభుత్వం ఒప్పుకున్నట్లేగా?
• మహిళలకు రక్షణకల్పించాల్సిన ముఖ్యమంత్రి, ఆయన బృందం బాధ్యగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షాన్ని నిందించి తప్పించుకోవాలని చూస్తున్నారు.
• పదోతరగతి పేపర్లను ప్రైవేట్ విద్యాసంస్థలు లీక్ చేస్తే, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎందుకు అరెస్ట్ చేశారో ముఖ్యమంత్రి చెప్పాలి?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు

బాధ్యతారాహిత్యంతోవ్యవహరిస్తూ బరితెగించి మాట్లాడుతున్న అధికారపార్టీనాయకులు, మంత్రులంతా వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డినే ఆదర్శంగా తీసుకొని నోటికి పనిచెబు తున్నట్టుగాఉందని, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో మహిళలపై జరిగిన దారుణాలను చిన్నవిగాచేసిమాట్లాడుతూ, అవేవో జరిగాయంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవ్యక్తి మాట్లాడటం ఆయనలోని సంకుచిత, నిరంకుశస్వభావానికి పరాకాష్టని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కాఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు.

శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, ఇతరదారుణాలను ఎత్తిచూపుతూ, ముఖ్య మంత్రి అసమర్థతను, ప్రభుత్వ వైఫల్యాన్ని తాము ఎత్తిచూపుతుంటే, ఏమీజరగడంలేదన్న ట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలకు బాధ్యతవహించాల్సింది ముఖ్యమత్రికాదా? ప్రతిపక్షాలు మీడియా యాగీచేస్తున్నాయని కల్ల బొల్లిమాటలుచెబుతున్న ముఖ్యమంత్రి, జరుగుతున్న దారుణాలను కట్టడిచేయడానికి తా నేం చేస్తున్నాడో ప్రజలకు చెప్పడా?

దిశాయాప్ కు దిశాచట్టానికి తేడాతెలియకుండా మాట్లా డుతున్న ముఖ్యమంత్రి, తాను తీసుకొచ్చిన యాప్ తో ఎందరుమహిళల్ని రక్షించి, ఎందరు దుర్మార్గుల్ని శిక్షించాడో మీడియాముఖంగా వాస్తవాలు వెల్లడించగలడా? మొన్నటివరకు హోంమంత్రిగా ఉన్న ఆమెతో దిశాచట్టం తీసుకొచ్చామని, దానికింద ఇంతమందిని శిక్షించా మని పచ్చి అబద్ధాలుచెప్పించారు. లేనిచట్టంతో శిక్షలు, ఉరిశిక్షలు వేయించామని స్వయం గా హోంమంత్రిస్థానంలో ఉన్నవారితో అబద్ధాలుచెప్పించే దీనస్థితికి ఈప్రభుత్వం దిగజారింది. కొత్తగా హోంమంత్రిగా వచ్చిన మరోఆమె కూడా పోయినఆమెకు తానేమీ తక్కువకాదన్నట్లు గా మాట్లాడుతున్నారు.

గతంలోహోంమంత్రిగా చేసిన ఆమె, ఇప్పుడు చేస్తున్నఆమె ఇద్దరూ కూడాదళిత సోదరీమణులే. కానీ వారితో ఈ ప్రభుత్వం ఇలా అబద్ధాలు చెప్పించడం ఏమిట న్నదే తమప్రశ్న. వైసీపీప్రభుత్వం రూ.120కోట్లను ఎస్టీఎస్సీ అత్యాచారనిరోధక చట్టానికి, మహిళలపై జరిగిన అత్యాచారాల నిరోధానికి ఖర్చుచేసినట్టుగా హోంమంత్రి చెప్పడం సిగ్గుచే టు. అసలు ఇలాంటివిచెబుతున్నందుకు సిగ్గుపడాలి. వైసీపీప్రభుత్వ మూడేళ్లపాలనలో రూ.120కోట్లుఖర్చుపెడితే, టీడీపీప్రభుత్వం రూ.50కోట్లే ఖర్చుపెట్టిందని మహిళగా ఉన్న ఆమె చెప్పడం,నిజంగా సిగ్గుపడాల్సిన అంశం.

అత్యాచారాలు జరుగుతాయి..తాము డబ్బులిచ్చి చేతులుదులుపుకుంటామని ప్రభుత్వం ఉద్దేశమా….హోంమంత్రి భావనా? ఎస్సీఎస్టీ అత్యాచారాలనిరోధక చట్టంప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలికి రూ.8లక్షలపరిహారం ఇవ్వాలి. ఆ విధంగా హోంమంత్రి చెప్పిన రూ.120కోట్లను లెక్కగడితే రాష్ట్రంలో ఈ మూడేళ్లలో 1500 నుంచి 1600వరకు అత్యాచారాలు జరిగాయని ఆమె ఒప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. నిజంగా అలాజరిగిందని చెప్పడానికి ఈప్రభుత్వానికి సిగ్గులేదా?

నేరస్థులపట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించబ ట్టే కదా.. రాష్ట్రంలో ఆడబిడ్డలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. మాట్లాడితే ఈ చేతగాని మంత్రులు, అసమర్థముఖ్యమంత్రి చంద్రబాబుగారిని, ఆయనపాలనను విమర్శిస్తుంటారు. టీడీపీహాయాంలోగుంటూరుజిల్లాలోని దాచేపల్లి ప్రాంతంలో ఒకయువకుడు బాలికపై అత్యాచా రానికి పాల్పడితే, అతన్ని శిక్షించడానికి ఆనాడు చంద్రబాబుగారు వెంటనే ప్రత్యేకబృందాల ను నియమించారు. దాంతో భయపడిన నిందితుడు చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. తప్పుచేసినవాడు భయంతో చనిపోయే పరిస్థితినిచంద్రబాబుగారు కల్పిస్తే, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు అత్యాచారాలతో పేట్రేగిపోండి అని ప్రోత్సహిస్తున్నారు.

రాష్ట్రంలో వరుసగా ఆడబిడ్డలు, చిన్నారులపై దారుణాలుజరగడానికి, హింసచెలరేగడానికి, సభ్యసమాజం సిగ్గుతో చర్యలకుప్రధాన కారణం తనఖజానా నింపుకోవడానికి జగన్మోహన్ రెడ్డిఅమ్ముతున్న జేబ్రాండ్ మద్యం, ఇతరమాదకద్రవ్యాలే కారణం. వాటిఅమ్మకాలు విచ్చల విడిగా జరగబట్టే, రాష్ట్రంలో మహిళలమానప్రాణాలకు రక్షణలేకుండాపోయింది. పిచ్చిమద్యం తాగిన పిచ్చివాళ్లు, పైశాచికత్వంతోపేట్రేగిపోతుంటే, ముఖ్యమంత్రేమో ఏదోజరిగిందంటా.. ఎవరో చేశారంటా అంటూ సిగ్గులేకుండా ‘ట’ గుణింతం చెబుతున్నాడు.

ముఖ్యమంత్రి వైఖరి అలాఉంటే హోంమంత్రేమో తల్లులపెంపకం సరిగాలేకనే రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయని మాట్లాడారు. మహిళాగాఉన్నఆమె సాటిమహిళల్నికించ పరిచేలా మాట్లాడటం ఆమెచేయాల్సిందికాదు. బాధ్యతవిస్మరించిన ప్రభుత్వం లానే ప్రతిపక్షంకూడా ఉండాలని అధికారపార్టీవారు కోరుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కిందిస్థాయి వైసీపీనేతలు సిగ్గులేకుండా ప్రతిపక్షాన్ని, చంద్రబాబుని నిందించడం.. అత్యాచారం జరిగితే అక్కడకువెళ్లి బాధితురాలికి పరిహారం పేరుతో డబ్బులిచ్చి, ఫోటోలు దిగి చేతులుదులుపుకోవడం. ప్రభుత్వంలోఉన్నవారు ఇదేనా చేయాల్సింది?

బాధ్యత, భక్తి ,భయం అనేవి ప్రభుత్వానికి, మంత్రులకే లేకపోతే అన్నింటికీతెగించి సమాజంపై పడేవారికి ఉంటాయా? అత్యాచారాలు జరక్కుండా చూడాల్సిన వారు మూడేళ్లలో రూ.120కోట్లు ఖర్చు పెట్ట్టామని చెప్పడం ప్రభుత్వ దిగజారుడుతనంకాదా? పదోతరగతి పరీక్షపత్రాల లీకేజీ ఘటనపై కూడా ముఖ్యమంత్రి సిగ్గు, శరం లేకుండా కొన్ని విద్యాసంస్థలనే నిందిస్తున్నాడు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లోనే పదోతరగతి పరీక్ష పత్రాలు లీకైతే ఆయాసంస్థలపై ముఖ్యమంత్రి ఎందుకుచర్యలు తీసుకోవడంలేదు? విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకునేవారిని శిక్షించడకుండా, ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం ఏమిటి?

పరీక్షపత్రాలు లీక్ కాకపోతే మంత్రి బొత్స అంతమందిని అరెస్ట్ చేశాము.. ఇన్నికేసులు పెట్టామని ఎలాచెప్పాడు? పేపర్ లీకేజ్ ఘటనలకు ప్రైవేట్ కాలేజీలను బూచిగా చూపుతున్న ముఖ్యమంత్రి, ప్రభుత్వ టీచర్లను ఎందుకు అరెస్ట్ చేసి జైళ్లకుపంపాడో సమా ధానంచెప్పాలి. కరోనాతో రెండేళ్లపాలు పరీక్షలే నిర్వహించని ప్రభుత్వం, ఈ ఏడాది పరీక్షలు నిర్వహించడానికే చచ్చీచెడి, కిందామీదా పడుతోంది. అధికారంలో ఉండి, ప్రతిపక్షాన్ని నిందిం చడం తప్ప, ఈ ముఖ్యమంత్రి మూడేళ్లలో రాష్ట్రానికి, ప్రజలకు ఏం ఒరగబెట్టాడు?

కాట్ల కు క్కల్లా తనచేతిలోఉన్నవారిని ప్రశ్నించే ప్రతిపక్షంపైకి వదులుతూ, ప్రశ్నించేమీడియాను నిందించడం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏంచేతగాదని తేలిపోయింది. ఈరోజు ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి… అవిముగిసే లోపుఎన్నిచిత్రాలు చూడాల్సివస్తుందో చూడాలి. జగన్మోహన్ రెడ్డి.. ఆయన మంత్రులు రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజల్ని పీల్చిపిప్పిచేస్తూ, వారిని దోచుకుంటూ, ఏపీని నామరూపాలు లేకుండా చేశారు. వారుచేసే దురాగతాలను, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని నిందించి తప్పించుకోవాలని చూస్తున్నారు.

ముఖ్యమంత్రి, ఆయన బృందం ఆటలకు ప్రజ లు చెక్ పెట్టే రోజులు దగ్గరికొచ్చాయి. రాష్ట్రంలో ఆడబిడ్డలపై వరుసగా జరుగుతున్న దారుణా లకు ప్రభుత్వమే బాధ్యతవహించాలి. వైసీపీప్రభుత్వానికి, ఆపార్టీనేతలకు, వారి అడుగులకు మడుగులొత్తే అధికారులకు ప్రజలు దేహశుద్ధిచేసే రోజు దగ్గర్లోనేఉంది.

 

LEAVE A RESPONSE