– ట్విట్టర్ లో మంత్రి అంబటి రాంబాబు కి బుద్ధా వెంకన్న కౌంటర్
జగన్ రెడ్డి ధనయజ్ఞం వలనే డయాఫ్రం వాల్ దెబ్బతింది. పైసల కక్కుర్తి తో రివర్స్ టెండరింగ్ కి వెళ్తుంటే కేంద్రం వద్దని మొత్తుకుంది. ప్రాజెక్ట్ దెబ్బతింటుంది అని హెచ్చరించినా వెనక్కి తగ్గకపోగా తక్కువ రేటుకే ప్రాజెక్టు నిర్మాణం ఆగమేఘాల మీద పూర్తి చేస్తాం అని రాతపూర్వకంగా తెలిపింది వైసిపి ప్రభుత్వం. హెడ్ వర్క్స్ పూర్తి చెయ్యడానికి రూ.1771 కోట్లు అవసరమైతే రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.1548 కోట్లకే పనులు 24 నెలల్లో పూర్తి చేస్తామని, రూ.223 కోట్లు ప్రజాధనం మిగిలిపోయిందని హడావిడి చేసారు. ఆఖరికి ఇప్పుడు వ్యయం రూ.1917 కోట్లకు పెరిగింది.
వాస్తవ అంచనా కంటే రూ.146 కోట్లు ప్రజా ధనం రివర్స్ టెండరింగ్ ద్వారా వృధా అయ్యింది. 2019 నవంబర్ లోనే కొత్త కంపెనీకి పనులు అప్పజెప్పారు నవంబర్ లో వరద లేనప్పుడే పనులు పూర్తి చేసి ఉంటే కాఫర్ డ్యామ్ పూర్తి అయ్యేది ఈసిఆర్ఎఫ్ కట్టి ఉంటే అసలు డయాఫ్రామ్ వాల్ దెబ్బతినేదీ కాదు. 2019లో 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది అప్పుడు కూడా డయాఫ్రామ్ వాల్ నిలబడింది. 2020 లో 23 లక్షల క్యూసెక్కుల వరద రావడంతోనే డయాఫ్రామ్ దెబ్బతింది. జగన్ రెడ్డి ధనయజ్ఞం పోలవరానికి శాపంగా మారింది.