– ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు
ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ ఎన్నికల హామీలో జగన్ రెడ్డి ఒంటరి మహిళలకు రెండు వేల నుండి మూడు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు తడిగుడ్డతో గొంతు కోశాడు అన్నారు.ఎన్నికల ముందు అక్కాచెల్లెమ్మల నెత్తిన చేతులు పెట్టి ముద్దులు పెట్టిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల నెత్తిన భస్మాసుర హస్తం పెడుతూ వారిని నిట్టనిలువునా ముంచేశారు అన్నారు.
ఆసరా లేని ఒంటరి మహిళలకు చంద్రబాబు గారి ప్రభుత్వంలో లబ్ధిదారులకు నెలకు రెండు వేలు ఇచ్చి వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ రెడ్డి 50 సంవత్సరాలు దాటిన వారికి ఈ పథకం వర్తిస్తుందని కండిషన్లు పెట్టి మహిళలను మోసం చేశాడు అన్నారు.పేద ముస్లిం మహిళలకు చంద్రబాబు గారి ప్రభుత్వంలో పెళ్లి జరిగితే 50 వేలు ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారని, జగన్ రెడ్డి ఎన్నికల హామీలో 50 వేల నుండి లక్ష ఇస్తానని హామీ ఇచ్చి చేతగాక ఇప్పుడు చేతులెత్తేశాడు అని విమర్శించారు.
విదేశీ విద్యా పథకం ద్వారా చంద్రబాబు ప్రభుత్వంలో పేద విద్యార్థులకు 10 లక్షలు ఇచ్చి వారిని విదేశాలలో చదువుకునే అవకాశం కల్పించారని, ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం విదేశీ విద్య పథకానికి తూట్లు పొడిచి వారి కుటుంబాలను అప్పులు పాలు చేశారన్నారు. జగన్ రెడ్డి గొప్పగా చెప్పుకునే అమ్మ ఒడి పథకం ఎగ కొట్టడానికి పదో తరగతి విద్యార్థినీ, విద్యార్థులను ఫెయిల్ చేయించి వారి భవిష్యత్తు తో ఆటలాడుకున్నాడు అని, కొంతమంది విద్యార్థులు ఆవేదన తో ఆత్మహత్యలు చేసుకున్నారని అవి ప్రభుత్వ హత్యలుగా భావించాలి అన్నారు.
ఒంటరి మహిళలకు చంద్రబాబు గారి హయాంలో ఏ విధంగా ఇచ్చారో అలాగే ఇవ్వాలని, రెండు వేల నుండి మూడు వేలకు పెంచాలని, పేద ముస్లిం మహిళలకు దులహన్ పథకం ద్వారా లక్ష రూపాయలు ఇవ్వాలని లేదంటే రాష్ట్రంలో మహిళా లోకం జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తుంది అని హెచ్చరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, రాష్ట్ర తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి మాదాల రాజ్యలక్ష్మి, పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు ఎరుబోతు శ్రావణి, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి గరిమెళ్ళ రాధిక పాల్గొన్నారు.