•కేంద్రం విడుదల చేసిన స్టార్టప్ ర్యాంకింగ్స్ లో జగన్ రెడ్డి ప్రభుత్వ డొల్లతనం మరోసారి బట్టబయలైంది
• రివర్స్ గేర్ లో నడుస్తున్న జగన్ రెడ్డి అన్ని రంగాల్లో రాష్ట్రస్థాయిని దిగజార్చాడు
• స్టార్టప్ లలో ఏపీని చివరి స్థానంలో నిలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే
• చంద్రబాబుగారి పాలనలో ఏ ర్యాంకింగ్స్ లో చూసినా ఏపీ టాప్ ప్లేస్ లో ఉంది
• 2018లో విడుదల చేసిన స్టార్టప్ ర్యాంకింగ్స్ లో రాష్ట్రం లీడర్ స్థానంలో నిలిస్తే వైసీపీ పాలనలో అట్టడుగుకు దిగజారిపోయింది
• నాడు స్టార్టప్ కంపెనీల వ్యవస్థలో ఇతర రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్ గా నిలిస్తే నేడు స్టార్టప్ కంపెనీల జాబితా నుంచి కనుమరుగయ్యే పరిస్థితికి కారణం జగన్ రెడ్డే
• నాడు చంద్రబాబు గారు విశాఖలో అంకురార్పణ చేసిన ఫిన్ టెక్ వ్యాలీ నేడు ఎందుకు కనుమరుగైంది?
• నేటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ ర్యాంకింగ్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సంస్కరణల వల్లే
• పరిశ్రమల పెట్టుబడుల్లో చంద్రబాబుగారి పాలనకు జగన్ రివర్స్ గేర్ పాలనకు పోలికే లేదు
• నేడు రాష్ట్ర ఎగుమతుల ర్యాంకింగ్ మెరుగవడానికి కారణం చంద్రబాబుగారి చొరవతో ఏర్పాటైన కియా పరిశ్రమే
-కొమ్మారెడ్డి పట్టాభిరామ్
కేంద్రం విడుదల చేసిన స్టార్టప్ ర్యాంకింగ్స్ లో ఏపీని దిగజార్సిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..కేంద్రం విడుదల చేసిన స్టార్టప్ ర్యాంకింగ్స్ లో జగన్ రెడ్డి ప్రభుత్వ డొల్లతనం మరోసారి బట్టబయలైంది. రివర్స్ గేరులో నడుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో దిగజార్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్టమెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) వారు విడుదల చేసిన స్టార్టప్ ర్యాంకింగ్స్ లో జగన్ రెడ్డి మన రాష్ట్రానికి అద్భుతమైన ర్యాంకు సాధించి గొప్ప కీర్తిని తెచ్చిపెట్టారు. ర్యాంకింగ్స్ లో దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే మన రాష్ట్రాన్ని మనందం సిగ్గు పడే విధంగా అధమస్థానంలో నిలిపిన ఘనత జగన్ రెడ్డిదే.
స్టార్టప్ ర్యాకింగ్స్ లో మెగాస్టార్ కేటగిరిలో గుజరాత్, కర్ణాటక, సూపర్ స్టార్స్ గా తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, స్టార్స్ గా తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు, రైజింగ్ స్టార్స్ గా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్ ఘడ్, చిన్న రాష్ట్రాలు అయిన హిమచల్ ప్రదేశ్, ఛండీఘర్, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, పుదిచ్చేరి వంటి రాష్ట్రాలున్నాయి. కానీ మనందరం తలదించుకునే విధంగా స్టార్టప్ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉంది. తన పాలన అద్భుతమని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి తాజా ర్యాంకింగ్స్ పై ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబుగారి పాలనలో ఏ ర్యాంకింగ్స్ లో చూసినా ఏపీ టాప్ ప్లేస్ లో ఉంది. 2018లో విడుదల చేసిన స్టార్టప్ ర్యాంకింగ్స్ లో రాష్ట్రం లీడర్ స్థానంలో నిలిస్తే నేడు వైసీపీ పాలనలో దిగజారిపోయింది. 2014లో కేంద్రప్రభుత్వం కంటే ముందుగా దేశంలోనే మొదటిసారి చంద్రబాబు గారు ఏపీ స్టార్టప్ పాలసీ తీసుకొచ్చారు. నాడు స్టారప్ కంపెనీల ఏర్పాటులో దేశానికే ఆదర్శంగా ఏపీని నిలిపారు. ఏపీలో 259 స్టార్టప్ లు పనిచేస్తున్నట్టు 2018-19లో విడుదలైన స్టార్టప్ ర్యాంకింగ్స్ నివేదికలో స్పష్టంగా ఉంది. ఆ రోజున విడుదల చేసిన నివేదిక పరిశీలిస్తే అవాల్యూషన్ లో 70శాతం పైగా సాధించి ఆంధ్రప్రదేశ్ లీడర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ నేడు మనమందరం సిగ్గుపడే విధంగా అట్టడుగు స్థానానికి ఏపీని దిగజార్చారు. 2014 లో కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ పాలసీ తీసుకొచ్చిందని నివేదికలో స్పష్టంగా ఉంది. ఏ రంగంలో చూసిన స్టార్టప్ కంపెనీల ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. స్టార్టప్ కంపెనీలు మిలియన్లు, బిలియన్లు డాలర్లు టర్నోవర్ సాధిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇంజనీరింగ్, పీజీ, మేనేజ్ మెంట్ కోర్స్ లు పూర్తి చేసిన తరువాత స్టార్టప్ ల వల్ల ఎంతోమంది విద్యార్థులు ఉపాధి పొందుతున్నారు.
స్టార్టప్ ల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి పెడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు అందరి కంటే ముందుగా 2014 లోనే ఒక స్టార్టప్ పాలసీని తీసుకొచ్చారు. 2021 స్టార్టప్ ర్యాంకింగ్స్ లో ఏడు ఏరియాల్లో 26 యాక్షన్ పాయింట్స్ ఉండగా వాటిలో కేవలం 7 యాక్షన్ పాయింట్స్ లో మాత్రమే ఏపీ అడ్రస్ చేసిందంటే అంతకంటే అవమానం ఏముంది జగన్ రెడ్డీ? 2018 ర్యాంకింగ్స్ లో 38కి 38 యాక్షన్ ప్లాయింట్స్ సాధించిన చంద్రబాబు గారెక్కడ? 2021 ర్యాకింగ్స్ లో 26 యాక్షన్ పాయింట్స్ లో 7 పాయింట్స్ తో సరిపెట్టిన జగన్ రెడ్డి ఎక్కడ? నాడు ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ కంపెనీల ఇన్క్ బేషన్ సెంటర్ల ఏర్పాటులో కూడా అగ్రగామిగా ఉంది. రెగ్యులేటరీ ఛాంపియన్ జాబితాలో కూడ ఏపి ముందు వరుసలో ఉంది. కమ్యూనికేషన్ ఛాంపియన్ పారామీటరులో కూడ ఆంథ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. 2018లో స్టార్టప్ పాలసీలు అమలు చేయడంలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. రాష్ట్ర పని తీరుని చూసిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను ఇతర రాష్ట్రాలకు ఒక మెంటార్ గా నియమించింది. ఛత్తీసఘడ్, వెస్ట్ బెంగాల్ కు ఏపీ మెంటార్ గా వ్యవహరించింది. మిగతా రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ ఉంది. స్టార్టప్ కు సంబంధించిన వర్క్ షాప్స్ దేశ వ్యాప్తంగా కేవలం మూడు ప్రాంతాలలో మాత్రమే 2018లో జరిగాయి. తెలంగాణ, గుజరాత్, మరియు ఏపీలోని విశాఖపట్నంలో మాత్రమే స్టార్టప్ వర్క్ షాప్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. టీడీపీ పాలనలో విశాఖలో నిర్వహించిన స్టార్టప్ సదస్సులో 13 రాష్ట్రాలు పాల్గొన్నాయి. సన్ రైజ్ ఇంకుబేషన్ హబ్ ను 37,951 అడుగుల విస్తీర్ణంలో విశాఖలో ఏర్పాటు చేసి 50 స్టార్టప్ లకు కేంద్రంగా నిలపడం ఒక్క చంద్రబాబుగారికే సాధ్యమైంది.
ఫిన్ టెక్ వ్యాలీని విశాఖలో ఏర్పాటు చేసి 50 వేల ఉద్యోగ కల్పనకు చంద్రబాబు గారు చొరవ తీసుకోగా నేడు జగన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టారు. నాడు ఫిన్ టెక్ ద్వారా విశాఖలో ఒక్క ఏడాదిలోనే 500 కోట్లతో 75 కంపెనీలను ఏర్పాటు చేసి 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి చంద్రబాబు గారు కంకణం కట్టుకున్నారు. కానీ దురదృష్టం నేడు ఫిన్ టెక్ అనే పదాన్నే జగన్ రెడ్డి మర్చిపోయి వేలమంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లాడు. చంద్రబాబు నాయుడు స్టార్టప్ ల ఏర్పాటుకై ప్రతి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తే ఈ మూడేళ్లలో నువ్వు విద్యార్దుల జీవితాల్ని అంధకారం చేయటం తప్ప ఏం చేశావ్ ?
ఈజ్ డూయింగ్ లో నెంబర్ 1 సాధించామని మంత్రులు బుగ్గన, గుడివాడ్ అమర్ నాధ్ లు ఏదో గొప్పలు మాట్లాడుతున్నారు. కానీ నాడు చంద్రబాబు తెచ్చిన సంస్కరణల వల్ల ఈజ్ ఆప్ డూయింగ్ లో ఏపీ ప్రతి ఏడాది నెం. 1 స్ధానంలో నిలుస్తోంది. 2015లో మొదటిసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన సందర్భంలో ఏపీ 2వ స్థానంలో నిలవగా ఆ తర్వాత 2016-17, 2017-18, 2018-19ల్లోనూ చంద్రబాబుగారు చేపట్టిన సంస్కరణల వల్ల వరుసగా మూడేళ్లూ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఏపీ నిలిచింది. 2018-19 నివేదిక చూసినట్టయితే నాడు చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా 368 సంస్కరణలు అమలు చేయటం వల్లే ఏపీకి పస్ట్ ర్యాంక్ వచ్చింది. యాక్సెస్ టూ ఇన్మరమేషన్ అండ్ ట్రాన్పరెన్సీ, అవైలబులిటీ ఆప్ ల్యాండ్ , ఎలక్ర్టిసిటి కనెక్షన్, ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్సెస్ ఇలా అనేక విషయాల్లో చంద్రబాబుగారు సంస్కరణలు ఆనాడే పూర్తి చేశారు. మీరు నేడు కొత్తగా చేసిందేంటి? ఆనాడు చంద్రబాబు కృషి వల్లే నేటికీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రానికి నెంబర్ వన్ స్థానం దక్కుతోంది. అంతే తప్ప జగన్ రెడ్డి చేసింది శూన్యం. పకోడి పేపర్ లో హెడ్ లైన్లు రాసి ఘనత తమదేనని కాలర్ ఎగరేసినంత మాత్రాన వాస్తవాలు చెరిగిపోవు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ప్టస్ ప్లేస్ సాధిస్తే నేడు రాష్ట్రానికి దానికి తగ్గట్టు పెట్టుబడులు రావాలి కదా. కేంద్ర పరిశ్రమల శాఖ ప్రతి సంవత్సరం పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించి విడుదల చేసే సెక్రటేరియట్ ఫర్ ఇండస్ట్రియల్ అసిస్టెన్స్(SIA) నివేదిక ప్రకారం పరిశీలిస్తే జగన్ రెడ్డి చేతకానితనం ఏంటో బయటడపడుతోంది.
SIA (Secretariat For Industrial Assistance) STATISTICS-AP
TDP GOVERNMENT INDUSTRIAL INVESTMENTS (NON FDI)
s.no Year Investments in (Cr) % Of total Investments in Country
1 2014 21,526 5.31
2 2015 21,300 6.85
3 2016 34,464 8.40
4 2017 29,537 7.47
5 2018 19,804 4.32
Total 1,26,630
Average per Year 25,326 Cr.
YSRCP GOVERNMENT INDUSTRIAL INVESTMENTS (NON FDI)
s.no Year Investments in (Cr) % Of total Investments in Country
1 2019 18,823 2.77
2 2020 9,727 2.34
3 2021 9,373 1.22
Total 37,923
Average per Year 12,641 Cr.
పైన ఉదహరించిన గణాంకాలను పరిశీలిస్తు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014 నుండి ఐదేళ్లపాటు లక్షా 26 వేల 630 కోట్ల పెట్టుబడులు అంటే ప్రతి సంవత్సరం సగటున రూ. 25,325 కోట్లు పరిశ్రమల పెట్టుబడులు దేశీయంగా మన రాష్ట్రానికి రాగా గత మూడేళ్లలో జగన్ రెడ్డి హయాంలో రూ. 37, 923 కోట్ల పెట్టుబడులు మాత్రమే అంటే ప్రతి సంవత్సరం సగటున కేవలం రూ. 12,641 కోట్లు మాత్రమే పరిశ్రమల పెట్టుబడులు వచ్చాయి. దీన్నిబట్టి జగన్ రెడ్డి హయాంలో పరిశ్రమల పెట్టుబడులు టీడీపీ హయాంతో పోల్చి చూస్తే సగం కూడా రానట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. మీ జే ట్యాక్స్ , కమీషన్లు , మీ అరాచకాలు చూసి పెట్టుబుడులు పెట్టేందుకు రాష్ట్రానికి ఎవరొస్తారు? దీనిద్వారా మీ ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ లో ఉన్న డొల్లతనం ఏంటో స్పష్టంగా అర్ధమవుతోంది.
చంద్రబాబు హయాంలో విదేశీ పెట్టుబడులు 2014-19 మధ్య రూ. 65,327 కోట్లు అనగా సగటున సంవత్సరానికి రూ. 13,065 కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి చేరుకోగా గత మూడేళ్ల కాలంలో జగన్ హయాంలో మనందరం సిగ్గుతో తలదించుకునే విధంగా కేవలం 3,796 కోట్లు మాత్రమే అనగా సగటున సంవత్సరానికి రూ. 1265 కోట్లు మాత్రమే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. ఇది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు తీసుకొచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 10 శాతం కూడా కాదు.
2014-19 (5 Years) FDI (FOREIGN DIRECT INVESTMENT) IN AP
s.no Year FDI in Cr.
1 2014-15 8,326
2 2015-16 10,315
3 2016-17 14,767
4 2017-18 8,037
5 2018-19 23,882
Total 65,327
Average per Year 13,065 cr.
2019-22 (3 Years) FDI (FOREIGN DIRECT INVESTMENT) IN AP
s.no Year FDI in Cr.
1 2019-20 1,476
2 2020-21 638
3 2021-22 1,682
Total 3,796
Average per Year 1,265 cr.
ఈ గణాంకాలు చూసి జగన్ రెడ్డి సిగ్గుపడాలి. నీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ ర్యాంకింగ్ ఎందుకని రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించలేకపోతోందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. మొన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ ర్యాంకుల్లో ఉన్న ఏడు రాష్ట్రాల్లో గుజరాత్, తమిళనాడు, కర్నాటక, హర్యానా, తెలంగాణ వంటి రాష్ట్రాలున్నాయి. ఈ రాష్ట్రాల విదేశీ పెట్టుబడుల అంకెలతో మన రాష్ట్ర అంకెలు పోల్చిచూస్తే జగన్ రెడ్డి సాధించిన ప్రగతి ఏంటో అర్ధమవుతుంది. 2019- 22 మధ్య మూడు సంవత్సరాల కాలానికి విదేశీ పెట్టుబడులు కర్నాటకలో 2లక్షల 51 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. గుజరాత్ లో 2లక్షల 20 వేల కోట్లు, తమిళనాడులో 46వేల 840 కోట్లు, హర్యానాలో38వేల737 కోట్లు, తెలంగాణలో 25 వేల 447 కోట్లు వస్తే , మన ఏపీలో మాత్రం జగన్ రెడ్డి రివర్స్ పాలన వల్ల కేవలం 3,796 కోట్ల విదేశీ పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. మూడు సంవత్సరాల్లో తెచ్చింది రూ. 3,796 కోట్లా ?నువ్వు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ అని కాలర్ ఎగరేస్తావా? ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరొస్తారు? జే ట్యాక్సు, నీ అవినీతి, నీ దుర్మార్గాలు చూసిన తరువాత పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రారు. దేశీయంగా చూసినా విదేశీ పెట్టుబడుల పరంగా చూసినా రాష్ట్రాన్ని పాతానికి నెట్టావు. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఇతర రాష్ట్రాలు ఎక్కడ ? కేవలం రూ.3,796 కోట్లతో సరిపెట్టిన నీవెక్కడ?
ఎగుమతుల్లో దేశంలోనే 4వ స్థానం సాధించినట్లుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ అసలు వాస్తవం ఏంటో, ఎగుమతుల ర్యాంకింగ్ పెరగడానికి కారకులు ఎవరో ఇప్పుడు చూద్దాం:
గత ఐదు సంవత్సరాల కాలంలో ఏపీ నుండి ఏఏ రంగం నుంచి ఎంత విలువైన ఎగుమతులు వెళుతున్నాయని జైలు పక్షి విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు (Q.NO. 688, DATED 3-12-2021 ) సమాధానంగా ఇచ్చిన సమాచారంలో రాష్ట్రంలో ఎగుమతులు పెరగడానికి కారణం 2019, సెప్టెంబర్ 20 నుంచి అనంతపురం జిల్లాలో నాడు చంద్రబాబుగారి చొరవతో ఏర్పాటైన కియా మోటర్స్ సంస్థ ఎగుమతులు ప్రారంభించడమేనని స్పష్టంగా అర్ధమవుతోంది. కియా మోటార్స్ సంస్థ నేడు దేశంలోనే అత్యధికంగా ఆటోమొబైల్స్ ఎగుమతులు చేసే సంస్థల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా 91 దేశాలకు నేడు కియా మోటర్స్ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం 2021-22లో కియా మోటార్స్ అత్యధికంగా 50,864 వాహనాలను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. 2018-19లో ఏపీ నుంచి ఆటోమొబైల్ తదితర అనుబంధ రంగాలకు సంబంధించిన ఇంజనీరింగ్ గూడ్స్ కేటగిరీలో ఎగుమతుల విలువ 4024 మిలియన్ డాలర్లు ఉండగా కియా మోటర్స్ నుంచి ఎగుమతలు ప్రారంభమయ్యాక రాష్ట్ర ఆటోమొబైల్/ అనుబంధ విభాగాల ఎగుమతుల విలువ 2020-21 సంవత్సరానికి 5,208 మిలియన్ డాలర్లకు ఎగబాకింది. దీని ద్వారా చాలా స్పష్టంగా నేడు మన రాష్ట్ర ఎగుమతుల ర్యాంకింగ్ మెరుగు పడటానికి కారణం ఆనాడు చంద్రబాబు గారు కృషితో వెనకబడిన అనంతపురం జిల్లాలో నెలకొల్పబడిన కియా మోటార్స్ సంస్థ అని స్పష్టంగా అర్ధమవుతోంది. దీనిలో జగన్ రెడ్డి యొక్క పాత్ర ఏమాత్రం లేదన్న విషయం కూడా బోధపడుతోంది.
నేడు నా మీడియా సమావేశం ద్వారా పెట్టుబడుల విషయంలో మీ డొల్లతనం ఏంటో బయటపెట్టాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఘనత ఎవరిదో బయట పెట్టాను. స్టార్టప్ ర్యాంకింగ్ కు సంబంధించి కూడా గతంలో ఒక లీడర్ గా ఉన్న రాష్ట్రాన్ని నేడు ఒక అట్టడుగు స్థానానికి ఏ రకంగా తెచ్చావో గణాంకాలతో సహా సవివరంగా వివరించాను. ఈ వాస్తవాలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు నా ప్రెస్ మీట్ ని ఫాలో అవుతున్నారు. వారంతా ఆన్ లోకి వెళ్లి డేటా చెక్ చేసుకోవచ్చు. మినిష్టరీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కు వెళ్లండి. నేడు SIA స్టాటస్టిక్స్ ని చూడండి. గతంలో చంద్రబాబునాయుడు హయాంలో ఎంతెంత పెట్టుబడులు వచ్చాయి? నేడు పెట్టుబడులు సగానికి సగం ఏ విధంగా తగ్గిపోయాయో రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాలి. . రాష్ట్ర హీన పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంత దారుణంగా రాష్ట్రం దిగజారిందో తెలుసుకోవాలి. చంద్రబాబునాయుడు హయాంలో ఏవిధంగా రాష్ట్రంకు పెట్టుబడులు వచ్చాయో తెలుసుకోవాలి. రాష్ట్ర ఎగుమతులు దేనికి పెరిగాయో అర్థం చేసుకోవాలి. కియా పరిశ్రమను ఏర్పాటు చేయడంవల్ల ఎన్ని మిలియన్ డాలర్ల ఎగుమతుల విలువ రాష్ట్రం నుంచి పెరిగిందో అర్థం చేసుకోవాలి. నేడు స్టార్టప్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎన్నో ఆశలతో ఉన్న యువత భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేశారు. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గానో, ఒక మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ గానో ఒక ఫైనాన్సియల్ సబ్జెక్టు గ్రాడ్యుయేట్ గానో బయటికి వచ్చి ఇవాళ ఏదైనా స్టర్టప్ పెట్టుకోవాలంటే ఇంక్విబేషన్ సెంటర్ లు కూడా అందుబాటులో లేవు. జగన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారో ఒకసారి ప్రజలు తెలుసుకోవాలి. మూడేళ్లుగా ఏపీ అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిపోయింది. 2014-19 మద్య సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ఒక స్వర్థాంధ్రప్రదేశ్ గా వెలుగొందిన రాష్ట్రం జగన్ రెడ్డి పాలనలో సన్ సెట్ ఆంధ్రప్రదేశ్ గా ఏ విధంగా మారిపోయిందో ప్రజలు ఆలోచన చేయాలని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.