– తిరుపతి ఎంపి గురుమూర్తి కృషి
వెంకటగిరి కేంద్రీయ విద్యాలయలో ఇంటర్ విద్య ప్రవేశ పెట్టమని గతంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి వెంకటగిరి కేంద్రీయ విద్యాలయంలో పదవ తరగతి చదివే విద్యార్థులు తరువాత ఇంటర్ విద్య అందుబాటులో లేనందువలన వారి చదువులు కొనసాగించడము కష్టంగా ఉందని వెంకటగిరిలో సి.బి.ఎస్.సి సిలబస్ కి సంబంధించిన కళాశాలలు లేనందువలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విద్యా సంవత్సరంలోనే ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని గురుమూర్తి కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అభ్యర్దించగా సానూకూలంగా విన్న మంత్రి సాద్యా సాధ్యాలను పరిశీలించి తగు చర్యలు తీసుకొంటామని అప్పట్లో హామీ ఇచ్చారని తదుపరి పలు పర్యాయాలు ఢిల్లీ లోని తన కార్యాలయం ద్వారా పర్యవేక్షించి ఇంటర్ విద్య ప్రవేశ పెట్టేందుకు కృషి చేశామని తిరుపతి ఎంపి గురుమూర్తి తెలియజేసారు. ఈ సందర్బంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి కి ఎంపి ధన్యవాదాలు తెలియజేశారు.