Suryaa.co.in

Andhra Pradesh

జైలుకెళ్లిన జగన్ అవినీతి గురించి మాట్లాడటమే జోక్

– ముందు కోర్టుకు హాజరయి మీ నిజాయితీ నిరూపించుకోండి
– తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతున్న నల్లధనంపై ఏ నంబర్ కు ఫోన్ చేయాలి? జగన్ రెడ్డి?
– అవినీతి ప్రక్షాళన మఖ్యమంత్రి, మంత్రుల నుంచి మొదలవ్వాలి
– ఏసీబీ యాప్‌పై మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి ఎద్దేవా

నిన్న ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ అవినీతిని అరికడతాము, అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతాము, అవినీతి పై బ్రహ్మాస్త్రాన్ని సంధింస్తాము అని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఏ అధికారి అవినీతికి పాల్పడినా ఏసిబి 14400 యాప్ కి ఫిర్యాదు చేయమని జగన్ చెప్పడం విచిత్రంగా ఉంది. 11కేసులలో ప్రధమ ముద్దాయిగా16 నెలలు జైల్లో ఉండి, లక్షల కోట్ల అక్రమార్జన గడించిన జగన్ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరం.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు అనేక వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ఏ విధంగా లక్షల కోట్లు గడించాలనే ఒకే ఒక్క ఆలోచనతో జగన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల విచారణ జరిపే దమ్ము, ధైర్యం జగన్ కు లేవు.

కొండలు, గుట్టలు, చెరువులు, కట్టలు అన్నింటిని దోచేశారు. ‘యదేచ్ఛగా కంకర, గ్రావెల్, మట్టి తవ్వకాలు’ అని పత్రికల్లో ప్రచురితమవుతున్న వాటిపై ముఖ్యమంత్రి విచారణ జరపగలడా? ‘15 సంవత్సరాలలో 15వేల కోట్లు లాట్రైట్ తవ్వితే వచ్చే అక్రమార్జన- ఓ బినామీ ఫోన్ సంభాషణ లీక్’ అని పత్రికల్లో ప్రచురితమైంది దాని గురించి జ్యుడిషియల్ విచారణ జరిపించగలరా? జగన్ పాలనలో జరుగుతున్న అవినీతి గురించి పత్రికల్లో వస్తున్న వాటిపై విచారణ జరపగలరా? చరిత్ర సృష్టించే విధంగా అవినీతి ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంలోని నాయకులు ఎదుర్కొంటున్నారు.

ఇంకా పలు శీర్షికలతో పత్రికల్లో వార్తలొచ్చాయి అవి : అంబులెన్స్, 104 లలో అవినీతి, రివర్స్ టెండరింగ్ లో అవినీతి, అరబిందో ఫార్మాలో అవినీతి. ఏ విధంగా అక్రమార్జన సంపాదించాలి, ముఖ్యమంత్రి ఆప్తులకు ఎలా కట్టబెట్టాలి ‘ఏడాదికి 180కోట్లు, అధికార ఆయుధంతో బెదిరింపుల బిజినెస్’ ‘తూర్పుగోదావరి జిల్లా వంతాల గనులలో లాట్రైట్ తరలింపు’ అని పత్రికల్లో వచ్చాయి. దాని పై విచారణ జరపగలరా? ‘ఐటి సలహాదారు మందు దందా… నెలకి 40కోట్ల ముడుపులు’ అనే శీర్షికతో వచ్చిన వార్తపై విచారణ జరపగలరా? ‘మంత్రి మేనల్లుడా? మజాకా! మద్యంతో మైనింగ్ మాఫియా జట్టు, కోట్ల రూపాయలు అవినీతి. ‘పేదలకు ఇళ్లు పెద్దలకు కోట్లు’ అనే దానిపై విచారణ చేయాలి.

ఇళ్ల స్థలాలను రాష్ట్ర మంతటా ప్రతి ఒక్క నాయకుడు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మి, వేల కోట్ల రూపాయలు డబ్బుని గడించారు. బద్వేల్ లో వైకాపా నేత భూదందా. నాయకులంతా భూదందా చేస్తే ప్రభుత్వం నిద్రపోతుందా. గుడివాడ గడపలో కడప కబ్జా. పులివెందుల వాళ్లు రాష్ట్రమంతటా కబ్జాకు తయారయ్యారు. విశాఖ ఏజెన్సీలో అధికార గద్దలు. విశాఖని దోచేయడానికి విజయసాయి రెడ్డి ప్రణాళిక. బ్రోచెవారెవరు. 2వేల కోట్ల రూపాయల సర్కార్ భూమికే ఎసరు అని పత్రికల్లో వార్తలొచ్చాయి. వాటిపై విచారణ జరపాలి.

రాష్ట్రమంతటా అవినీతి జరుగుతుంటే ఒక్క అధికారులు మాత్రమే అవినీతి చేస్తున్నట్టు సీసీ కెమెరాలు పెడతాము. అవినీతిని అరికడతాం అని అనడం భావ్యంకాదు. అవినీతి ప్రక్షాళన మఖ్యమంత్రి, మంత్రుల నుంచి మొదలవ్వాలి. దేశంలో 29 రాష్ట్రాలలో లేని అవినీతి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది. జరుగుతున్న భూదందాలు, కుంభకోణాలు మీద విచారణ చేస్తారా. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 1000 రూపాయలకు దొరికే ఇసుక నేడు 5000 రూపాయలకు చేరింది. ఇసుకలోనే దాదాపు 12వేల కోట్లు అక్రమంగా సంపాదించారు.

భారతి సిమెంటు ధర రూ.250/- లు ఉంటే నేడు రూ.450/- లు పెంచారు. దాదాపు 20వేల కోట్ల రూపాయలు పై చిలుకు ముఖ్యమంత్రి సంపాదిస్తున్నారు. రూ.40/-లకు దొరికే మద్యం బ్రాండు నేడు రూ.160/-లకు అమ్ముతున్నారు. 26వేల కోట్ల పైనే మద్యంలో ప్రభుత్వం లూటి చేసింది. మైన్స్ యదేచ్ఛగా అక్రమాలు చేసి నిబంధనలు అతిక్రమించారు. చంద్రబాబు నాయుడు నీతి, నిజాయితీగా ప్రతి సంవత్సరము వారి కుటుంబ ఆస్తుల వివరాలను బహిరంగంగా వివరిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్క సంవత్సరము అయిన దమ్ము, ధైర్యంతో తన ఆస్తుల వివరాలను ప్రకటించారా?

ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన ఆస్తుల వివరాలకు ప్రస్తుతం ఉన్న ఆస్తుల వివరాలకు ఎంతో తేడా ఉంది. 2004 సంవత్సరంలో అప్పులలో ఉన్న కుటుంబం నేడు లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా. ఆవు చేనును మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మేల్యేలు అవినీతి చేస్తూ ఒక్క అధికారుల మీద పడటం ఎంత వరకు సమంజసం. భూములు రిజిష్ట్రేషన్ అయితే ప్రతి ఒక్క లేఅవుట్ లో 40శాతం లేదా 40లక్షలు ఇవ్వాలి అని రేట్లు పెట్టి మరి వసూల్ చేస్తుంటే ముఖ్యమంత్రి కంట పడటం లేదా, లేకపోతే చూసి కూడ చూడనట్టు కళ్ళు మూసుకుపోయాయా?

బిల్డర్ల్ లేఅవుట్ లు వేస్తే డబ్బులు ఇవ్వాలి. ఇసుకలో, మద్యంలో, ట్రన్స్ ఫర్లకు డబ్బులు ఇవ్వాలి. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది అంటే ఎవరెస్ట్ అని చెప్పిన రీతిలో ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు ఎవరు అంటే జగన్ మోహన్ రెడ్డి అని చెబుతారు. ఇటువంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్యపథం.

ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి, అంకిత భావం ఉంటే ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలన్న ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్న జరుగుతున్న కేసులు అన్నింటికి హాజరయి నిజాయితీని రుజువు చేసుకోవాలి. రాష్ట్రంలో అభివృద్ధి సున్నా. రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలకు నరకం అంటే ఏంటో చూపిస్తున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితికి వచ్చారు. మహిళలకు ఎందుకు ఓటు వేశామా అనే పరిస్థితిని తీసుకొచ్చాడు. ఉద్యోగస్థులు ఎందుకు జగన్ రెడ్డిని నమ్ముకున్నామనే పరిస్థితి. సంక్షేమ పథకాలు అన్నింటిలో కోత పెట్టారు. చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ. ప్రజలకు ఇచ్చేది తక్కువ, తీసుకొనేది ఎక్కువ.

గవర్నమెంట్ ఫండ్ లని తీసుకురావడంలో పులిలా వ్యవహరిస్తూ, ఢిల్లీ వెళితే పిల్లి లా వ్యవహరిస్తున్నారు. అభివృద్ది నిల్ల్, ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఫుల్. రాష్ట్రంలో పరిపాలన స్థంబించింది, పరిపాలన సాగడం లేదు. గ్రానైట్ తవ్వకాలు, మట్టి తవ్వకాలు, లీజులు పూర్తి అయిన అక్రమ మైనింగ్ జరుగుతుంది. ఎన్ని దోపిడీలు జరిగిన జుడీషియల్ ఎక్వైరీ జరిపించడం లేదు. ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభద్రత భావం కలిగింది. ఇప్పటికైనా జగన్ రెడ్డి మేల్కొని అవినీతిని అరికట్టే ముందు తన నిజాయితీని నిరూపించుకోవాలి.

LEAVE A RESPONSE