– క్యాసినో రచ్చపై మాజీ మంత్రి కొడాలి నాని సవాల్
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టిస్తున్న క్యాసినో డాన్ చికోటి వ్యవహారంలో తన ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న టీడీపీకి దమ్ముంటే తనను ఈడీతో అరెస్టు చేయించాలని మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు. ‘గడపగడపకూ ప్రభుత్వం’ కార్యక్రమానికి హాజరయిన కొడాలి తనపై జరుగుతున్న క్యాసినో రచ్చపై స్పందించారు.
కొడాలి నాని ఏమన్నారంటే… టిడిపి నేతలకు దమ్ముంటే క్యాసినో వ్యవహారంలో ఈ.డి ద్వారా తనను అరెస్టు చేయించాలి. నీ కొడాలి నాని సవాల్. బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టేలా , చికోటి పై ఈడి తనిఖీలను టిడిపి బ్యాచ్ తమకు ఆపాదిస్తుంది. గుడివాడలో క్యాసినో అంటూ వచ్చిన టిడిపి నిజ నిర్ధారణ కమిటీ నివేదికలు ఈ.డి కు అందించాలి. దేశంలో ఏం జరిగినా చంద్రబాబు భజన బృందం, జగన్ కు మాకు ముడి పెడుతున్నారు. పలావ ప్యాకెట్లకు ఆశపడే వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి పిచ్చికుక్కల మాదిరి మొరుగుతున్నారు. గుడివాడలో క్యాసినో అంటూ ఉదరగొట్టిన చంద్రబాబు అండ్ కో ఏం సాధించారో ప్రకటించాలి.