Suryaa.co.in

Andhra Pradesh

3,38,792 మంది లబ్ధిదారుల లిస్ట్ ఎందుకు బయట పెట్టడం లేదు?

-కాపు నేస్తం పథకంతో జగన్‌ బురిడీ
-పబ్లిసిటీ కోసం మీ పత్రికకు నిధులు దోచిపెడుతున్నారు
-ఏడాదికి రూ.100 కోట్లు సాక్షి పత్రికకు దోచిపెడుతున్నారు
-ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు

నేడు జగన్ బటన్ నొక్కి కాపు నేస్తం పథకాన్ని 3లక్షల30 వేల మంది కాపు, బలిజ, ఒంటరి తెలగ కులాలకు చెందిన మహిళలకు రూ.15 వేలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ అయ్యేట్లుగా బటన్ నొక్కారు. మొత్తం 508 కోట్లు కాపు, బలిజ, ఒంటరి, తెలగ మహిళలకు ఇస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లాలో ప్రకటించారు. జగన్ బటన్ నొక్కిన ప్రతిసారి పేపర్ లో పెద్ద అడ్వర్ టైజ్ మెంట్ ఇస్తారు.

కాపులకు ఒకసారి, మైనార్టీలకు ఒకసారి, ఎస్సీ మహిళలకు ఒకసారి, చేయూత పథకాన్ని నాలుగైదు విడతలు గా చేసి దానికి ప్రతిసారి బటన్ నొక్కడం చూస్తే దానికో పెద్ద పండుగ. పెద్ద అడ్వర్ టైజ్ మెంట్. ఈయన ఏం చేశాడు అని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఊరికే వస్తోంది, తీసుకుందాం అనే భ్రమ జగన్ కలిగిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పెన్షన్ 3 వేలు ఇస్తానని హామీ ఇచ్చాడు.

కృష్ణా, గుంటూరు జిల్లాలకు వచ్చేటప్పటికి మాట మార్చి సంవత్సరానికి 15 వేలు ఇస్తానన్నాడు. నేడు సంవత్సరానికి 15 వేలు చొప్పున 5 సంవత్సరాలకి 75 వేలిస్తాను అది కూడా 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి మైనార్టీలకు, ఎస్సీ, బీసీ, కాపులకు. విడివిడిగా ఇస్తున్నాడు. ఏ పథకం కింద ఎంత ఇస్తున్నాడు? చేయూత పథకమనేది నవరత్నాల్లో ఒక భాగం. మైనార్టీలకు, ఎస్సీ, బీసీ, ఎస్టీలున్నారు. నెలకు మూడు వేలు పెన్షన్ ఇస్తానన్నాడు. సంవత్సరానికి 15వేలు ఇస్తున్నాడు. ఇదొక మోసం. కాపు కమ్యునిటీకి నేను చాలా చేశాను అని అంటున్నాడు. కాపు కులానికి ఏం చేశాడు?

టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా 5 సంవత్సరాల్లో 3,100 కోట్లు కాపుల అభివృద్ధికి, రుణాలకు, భవనాలు నిర్మించడానికి, విదేశీవిద్యకు, రకరకాలవాటికి 3 సంవత్సరాల్లో 3,100 కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా కేవలం కాపులకు మాత్రమే చంద్రబాబు ఇచ్చారు. మిగతా స్కీములు కలపలేదు. నవరత్నాలన్నింటిని కలిపి కాపుకెంత వచ్చింది? బడ్జెట్ అంచనాల్లో చాలా స్పష్టంగా 2020-21లో ఏపీ కాపు వెల్ఫేర్ కు 3,125 కోట్లు ఖర్చుపెట్టారు. 2021-22లో 2,561, 2022-23లో 3,531 కోట్లు, వైఎస్ ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ ఆర్ నేస్తం, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ జగనన్న చేదోడు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడిలను కలిపి 2022-23 ఆర్థిక సంవత్సరానికి కాపు వెల్ఫేర్ కు 3,531 కోట్లు ఇచ్చామని బడ్జెట్ అంచనాల్లో ఇచ్చారు.

నవరత్నాల ద్వారా కాపులకు, బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు ఎంత వచ్చింది? ఇవన్నీ కలిపితే ఆ కులానికి బడ్జెట్ ఎస్టీమేషన్ తయారవుతోంది. ఇంతకంటే మోసం మరొకటి లేదు. నవరాత్నాలు కులాలవారీగా విడగొట్టి ఈ కులానికి ఇంత ఖర్చు పెట్టానని చెబితే కులంలో ఉన్న ప్రజలు మా కులానికి కొత్తగా ఏమొచ్చిందని ఇవాళ ప్రతి చోట నిలదీసి అడుగుతున్నారు. నవరత్నాలు రాష్ట్రంలో అందరికీ ఇస్తున్నావు, కాపు కులానికి ప్రత్యేకంగా చేయూత ఏమీ ఇవ్వడంలేదు. ఎన్ని స్కీములు తీసేశారు?

ఐదు సంవత్సరాలుగా 3,100 కోట్లు ఖర్చు పెట్టాం అంటే ఏ ప్రభుత్వం కాపుల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టిందనేది లెక్కలు అర్థమైందా సామాన్య మానవుడికి కూడా ఇవ్వాళ క్వశ్చన్ చేసే స్థాయికి రావడం జరిగింది. ఇంతకుముందు కాపు కార్పొరేషన్ లో విదేశీ విద్య కానీ స్కాలర్షిప్లు గాని లేదంటే ఏదైనా వాళ్ళు ఉపాధికి గాని మహిళలకు గాని నిరుద్యోగులు అందరికి అందుట్లో ఒక ఆధార్ దొరికేదివ్ ఎవరికి భవిస్తున్నావు చివరికి ఇవాళ ఎండోమెంట్స్ లో ఉన్న ఫండ్స్ కూడా తీసిపారేసి నువ్వు నీ బతకాక రెస్పెక్ట్ చేసింది. ప్రభుత్వం కేవలం కులాల వారీగా విభజించి ఈ కులానికి ఎంత చేశాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మీరు రాష్ట్రాలు మీకు అనుకూలంగా మీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన విధంగా చేసుకోవాలా జీవ రద్దు చేశారు. కోట్లు చూపించాం ఇది 2021 22 బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ కాపు వెల్ఫేర్ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి 2022 ఇక్కడ కార్పొరేషన్ కి ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ ఆ తొమ్మిది రత్నాలు కలిపితే 305 కోట్లు కులాల వారిగా విడదీసి దాన్ని బడ్జెట్లో చూపించారు.

ఆర్థిక అభివృద్ధి ఉండాలి వాళ్ళ సామాజిక స్థితిగతులు పెరగాలి.కార్పొరేషన్ లను నువ్వు జీరో చేసావ్. మేము ఇచ్చిన లోన్స్ తో విదేశీ చదువులు కోసం పిల్లలకి రెండో ఇన్స్టాల్మెంట్లు మీరు సాంక్షన్ చేయలేదు వాళ్లంతా ఎంతో ఇబ్బంది పడ్డారు గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువగా పడి గోదావరి జిల్లాలో ఈ నాటకాలు ఆడితే నమ్మే పరిస్థితి కూడా లేదు అక్కడ మాకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి మోసం చేశాడని గోదావరి జిల్ల ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం బూటకపు ప్రచారం చేస్తోంది.

అసత్య ప్రచారంతో ప్రజలను మోసగిస్తున్నారు. కాపు నేస్తం పథకంతో లబ్ధి పొందారంటున్న 3,38,792 మంది లబ్ధిదారుల లిస్ట్ ను ఎందుకు బయట పెట్టడం లేదు? చాలా మంది లబ్ధిదారులకు డబ్బులు జమ కావడం లేదు. డబ్బులు జమ కాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఆర్థం కాని స్కీంలు పెడుతూ పబ్లిసిటీ కోసం మీ పత్రికకు నిధులు దోచిపెడుతున్నారు. వాలంటీర్లు సాక్షి పత్రిక మాత్రమే కొనేందుకు జీవో ఇచ్చారు. తద్వారా ఏడాదికి రూ.100 కోట్లు సాక్షి పత్రికకు దోచిపెడుతున్నారు. ఈ విధంగా ప్రజలను దోపిడీ చేయడం చరిత్రలో లేదు. ఇలాంటి అక్రమాలు ఎన్ని చేసినా.. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుకు తెల్లవారుజామున మూడు గంటలకు సైతం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇలానే వ్యవహరిస్తే మీరు నొక్కిన బటన్ ఫెయిల్ అవుతుంది. మీరు చేసినా విధానాల్లో ఇంతా మోసం జరుగుతోందని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు ప్రారంభమైంది. ఖచ్చితంగా ప్రజల తిరుగుబాటుతో వైసీపీ ప్రభుత్వానికి తగిన శాస్తి జగుతుందని ఆశిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఇప్పటివరకు బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల లిస్ట్ ను పబ్లిక్ డొమైన్‍లో పెట్టాలి. లిస్ట్ బయటపెట్టకపోతే ప్రజలను మోసగిస్తున్నట్లే. ప్రజల తిరుగుబాటుకు మీరు సమాధానం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు కాపులకు రూ.32,296 కోట్లు లబ్ధిదారులకు జమ చేశామని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా కులాల వారి విభజన, కులాల వారిగా బటన్ నొక్కుడు విధానాలకు స్వస్తి పలికి కమ్యూనిటీలకు లాభం చేయాలి. నిజంగా కమ్యూనిటీలకు లాభం చేకూర్చితే టీడీపీ హయాంలో చేసినంటువంటి బెనిఫిసరిటీ విధానం అమలు చేయాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE