నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆద్వర్యంలోని తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజిని తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో శుక్రవారం అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటి రూపాయల నిధులతో ఈ ఆస్పత్రిని నిర్మించినట్లు చెప్పారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే మొత్తం 8 పీహెచ్సీలను నిర్మిస్తున్నామని, వీటిలో 5 పీహెచ్సీల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.