Suryaa.co.in

Telangana

గేటుకు తాళాలు వేసి.. బోసిపోయిన మహాత్మాగాంధీ

-క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి ప్రధాత కనీసం దండకు కూడా నోచుకోలేదు
-తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన

సనత్ నగర్ నియోజకవర్గంలోని మహాత్మా గాంధీ రోడ్ లో, మహాత్మా గాంధీ 80 సంవత్సరాల కిందట ఆగస్ట్ 8నాడు జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకోవాటానికి ( క్విట్ ఇండియా ఉద్యమ రూపకర్త ) మహాత్మాగాంధీ గారికి నివాళి అర్పించటానికి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆధ్వర్యంలో కదలి వెళ్లారు.
ఆరోజు హైదరాబాద్ లో నెలకొల్పిన మొట్ట మొదటి విగ్రహం ఇదే, అక్కడి వెళ్లినప్పటికీ గేటుకు తాళాలు వేసి సాక్షత్కరించాయి. మహాత్మా బోసిపోయి ఎదురుగా కనబడ్డారు.

తెలంగాణ ప్రభుత్వ పెద్దలు అజాది కా అమృత్ మహోత్సవం లో భాగంగా పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. మంచిదే మనం అందరం భాగస్వామ్యులవుదాం, అయ్యాం కూడా, కానీ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఈ రోజు కనీసం దండకు కూడా నోచుకోలేదు. మేము తీసుకునివెళ్ళిన పూల ను మట్టి పెళ్లలతో అలంకరించాము. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వాన్ని ,లౌకిక తత్వాన్ని , అందించిన మహనీయులు, బ్రిటిష్ వారి నుంచి, దోపిడీ నుంచి రక్షించిన మహానీయులను నిడంబరాటాలతో సత్కరించుకుందాం. ఇంతటి నిర్లక్ష్యం తగదు.

ముఖ్యమంత్రి గారు .. నాదొక విన్నపం … మహాత్మా గాంధీ తో పాటు క్విట్ ఇండియా రూపశిల్పి మన తెలుగింటి ఆడపడుచు, తెలంగాణ కోడలు సరోజినీ నాయుడు, స్వామి రామానంద తీర్థ, వందేమాతరం రామచంద్ర రావు, పి.వి నరసింహారావు, బూర్గుల రామకృష్ణ రావు, ఆలనాటి సాయుధ పోరాట వీరులు మన తెలంగాణ ఇంటి అల్లుడు అయిన విజయ్ కుమార్ సిన్హా , మొహమాద్ మొయినుద్దీన్, జమలాపురం కేశవ రావు, సురవరం ప్రతాప్ రెడ్డి, వారి సేవలను స్మరించుకుందాం.

స్వాతంత్ర్య కాంక్షకు ముందే అగ్నిని రగిల్చిన కొమరం భీం, అల్లూరి సీతారామరాజు లకు శిరస్సువంచి నమస్కారించుకుందాం. ఈ రోజు మనం మన రాష్ట్రం తరపున సరోజిని నాయుడు, సంఘం లక్ష్మీబాయి లను తలచుకుందాం..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి సూర్య దేవర లత, రాంగోపాల్ పేట్ డివిజన్ అధ్యక్షుడు ఎం. రాజు, గోపాల్ , వాహీద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE