– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
అందరి సహకారంతోనే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, విజయవంతంగా జరిగాయని పశుసంవర్ధక, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ నిమజ్జనం శోభాయాత్ర కు దేశంలోనే ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. నెల రోజులకు పైగా ఏర్పాట్ల కోసం శ్రమించిన GHMC, ఎలెక్ట్రికల్, పోలీసు, ట్రాఫిక్ పోలీసు, R&B, వాటర్ వర్క్స్, హెల్త్, I&PR, టూరిజం, పారిశుధ్య సిబ్బంది తదితర అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి, ప్రభుత్వానికి సహకరించిన భాగ్యనగర్, ఖైరతాబాద్, బాలాపూర్, సికింద్రాబాద్ తదితర గణేష్ ఉత్సవాల నిర్వహకులకు ప్రతి ఒక్కరికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు.