Suryaa.co.in

Telangana

ఉమ్మడి జాబితాలోని అంశం విద్యుత్ పై కేంద్రం పెత్తనమేంటి?

-మోడీ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించిన మొదటి వ్యక్తిని నేనే
-మరుగుజ్జులు మరో పార్టీ ని ఉండనీయమని బెదరిస్తున్నారు
-బీజేపీ ని దేవుడు కూడా కాపాడలేడు
-సభలో బీజేపీపై నిప్పులు కురిపించిన సీఎం కేసీఆర్‌

కేంద్ర విద్యుత్ సవరణ చట్టం వల్ల రాష్ట్రంలో 98 లక్షల కుటుంబాల మీద ప్రభావం పడుతుంది. అన్ని అమ్మినారు..మిగిలిన విద్యుత్ ,వ్యవసాయాన్ని రంగాన్ని సావుకారులకు అప్పజెప్పాలని మోడీ చూస్తున్నారు. మేము. వరి వేయోద్దు అంటే..బీజేపీ అధ్యక్షుడు వరి వేయాలని రైతు లను రెచ్చగొట్టారు. చివరకు రైతు లను బీజేపీ ముంచితే..మళ్ళీ మేము ధర్నా లు చేసి..మేమే ఓడ్లుకొన్నం.

బీజేపీ ఒకటి చెప్తుంది.. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరోటి చెప్తుంది. బీజేపీ కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందా..దీనికి రఘనంధన్ రావు సమాధానం చెప్పాలి.ప్రభుత్వ రంగ సంస్థ లు అమ్మే రాష్ట్ర ప్రభుత్వాలకు నజరానా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా విద్యుత్ సవరణ చట్టాన్ని తెచ్చారు. కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుంది. ఉమ్మడి జాబితాలోని అంశం విద్యుత్ పై కేంద్రం పెత్తనమేంటి.?క్రిటిసైజ్ ప్రైమినిస్టర్ నరేంద్రమోదీ.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బాన్సువాడ లో కరెంటు లేక పంటలు ఎండిపోయాయి. మోడీ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించిన మొదటి వ్యక్తి ని నేనే. పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీ ల సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన భట్టి కి ధన్యవాదాలు. జాతీయ జెండాను మారుస్తామంటుంన్నారు.

మరుగుజ్జులు మరో పార్టీ ని ఉండనీయమని బెదరిస్తున్నారు.కేంద్ర హోంమంత్రి ఏక పార్టీ ఉంటుందని ఎలా మాట్లాడుతారు.బీజేపీ కేవలం 36 శాతం ఓట్లతో రాజ్యం ఏలుతుంది.కాలం అన్నింటికీ సమాధానం చెప్తుంది.

బీజేపీ ని దేవుడు కూడా కాపాడలేడు.11 రాష్ట్రాల్లో బీజేపీ అనైతికంగా ప్రభుత్వాలను కూలగొట్టింది.తెలంగాణ లో ముగ్గురు ఎమ్మెల్యే లు ఉన్న బీజేపీ.. ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొడుతామంటున్నారు..

LEAVE A RESPONSE