– బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
అసెంబ్లీ వేదికగా కేసీఆర్ అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారు. ప్రపంచంలో నే ఝూట అవార్డ్ ఇవ్వాలంటే అది కేసీఆర్ కే ఇవ్వాలి. బీజేపీ పేరు తలవనిదే కేసీఆర్ కు నిద్ర రాని పరిస్థితి. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గొంతు చించుకుంటున్నాడు.
మా ఎమ్మెల్యేలను 3 తోకలు అంటావా?నీకు దమ్ము, ధైర్యం ఉంటే… మా ముగ్గురు ఎమ్మెల్యేలను ఎందుకు అసెంబ్లీ నుంచి బయటికి పంపించావ్? కేసీఆర్ చెప్పేవన్ని ఝూటా మాటలే. కేసీఆర్ వి అన్నీ పచ్చి అబద్దాలే.ఎక్కడ ఎలక్షన్ వస్తే… అక్కడ కరెంట్ మీటర్లు అంటాడు.
దుబ్బాక, హుజురాబాద్ ఎలక్షన్స్ లో ప్రజలు బుద్ది చెప్పినా.. కేసీఆర్ కు సిగ్గు రాలేదు.ప్రజలు బీజేపీ కి ఓటు వేసి, కేసీఆర్ కే మీటర్లు పెట్టారు.రైతులకు ఉచిత కరెంట్ అంటూ… ఫ్రీ కరెంట్ దొబ్బుతున్నాడు.ప్రజలను మోసం చేస్తూ… కేసీఆర్ పబ్బం గడుపుతున్నాడు.
తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే, జాతీయ పార్టీ అంటూ… ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు.రియల్ ఎస్టేట్ పేరుతో దండుకుంటున్నారు.కాళేశ్వరం పేరుతో కోట్ల అవినీతికి పాల్పడ్డారు.ధనిక రాష్ట్రం అంటున్న కేసీఆర్… తెలంగాణ ఆస్తులను ఎందుకు అమ్ముతున్నారు?
నియంత పాలనను బీజేపీ అంతం చేస్తుంది.తెలంగాణ ప్రజల ఆకాంక్షను బీజేపీ నెరవేరుస్తుంది. కేంద్ర మంత్రులు నూకలు తినమన్నారని, ధగాకోరు మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్, కేటీఆర్.