Suryaa.co.in

Andhra Pradesh

అమరావతి రైతుల పాదయాత్రలో బీజేపీ నేత కన్నా

– రెండో రోజు మంగళగిరి టు దుగ్గిరాల సాగిన అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర

ప్రజా రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, రైతు కూలీలు, మహిళలు, ప్రజాసంఘాలు చెప్పట్టిన కఠోర ఉద్యమం అమరావతి టు అరసవెల్లి మహాపాదయాత్ర 2.0 కొనసాగుతుంది. రెండో రోజు మంగళగిరి నుండి దుగ్గిరాల వరకు నిర్వహించిన పాదయాత్ర పాత బస్టాండ్ సెంటర్ నుండి అమరావతి జేఎసి నేతలు, పరిరక్షణ సమితి ఇతర ప్రజాసంఘాలు, రైతు నేతలు ప్రారంభించారు. పాతబస్టాండ్ కూడలి నుండి గౌతమబుద్ద రోడ్, సీతరామ కోవెల, మెయిన్ బజార్, లక్ష్మి నరసింహాస్వామి వారి దేవస్థానం , ద్వారకానగర్ , రాజీవ్ సెంటర్ , ఫ్లైఓవర్, పెదవడ్లపూడి , రేవేంద్రపాడు ప్రాంతాల మీదుగా దుగ్గిరాల చేరుకుంది. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం యాత్రలో మార్మోగింది.

ముఖ్యంగా రైతులు, మహిళలు చేస్తున్న ఈ పాదయాత్రకు దారిపోడవునా విశేష స్పందన లభించింది. ఎక్కడిక్కడ ప్రజలు పూలవర్షంతో పాదయాత్రకు స్వాగతంతో బ్రహ్మరధం పట్టారు. ఆంధ్రుల రాజధానిగాk అమరావతినే కొనసాగించాలని మొక్కవోని దీక్షతో రైతులు, మహిళలు చేస్తున్న ఈ పాదయాత్రకు తమ మద్దతు ఉంటుందని ఈ పోరాటంలో అమరావతి ప్రాంత ప్రజలు విజయకేతనం ఎగరవేసేలా ఆ భగవంతులు ఆశీర్వదించాలనే సద్దుద్దేశ్యంతో కొనసాగుతున్న ఈ పాదయాత్ర రానున్న రోజుల్లో దిగ్విజయంగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

ఆంద్రప్రదేశ్ కి ఏకైకై రాజధానికిగా అమరావతిని కొనసాగించాలి. ప్రభుత్వం ఆ విధంగా ప్రకటన చేసే వరకు పోరాటం కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు తెలిపారు. ప్రభుత్వ పెద్దలు రెచ్చగోట్టే విధంగా కామెంట్స్ చేస్తున్న తాము శాంతియుతంగా పాదయాత్రను కొనసాగిస్తున్నామని నేతలు చెబుతున్నారు. రెండోరోజు పాదయాత్రలో భాగంగా పలువురు రాజకీయ ప్రముఖులు అమరావతి ప్రాంతవాసులు చెప్పట్టిన ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సత్తెనపల్లి మాజీ ఎమ్మేల్యే మోహనరావు, ఎపిసిసి అధ్యక్షులు శైలజానాధ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, మహిళ మండలి రాష్ట్ర అధ్యక్షులు మాధవి ఇతర ప్రజాసంఘాల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE