– టీడీపీ బిక్షతో రాజికీయాల్లోకి వచ్చిన వాళ్లు చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడటం సిగ్గుచేటు
– వీధి కుక్కల్ని ఊరి బయట వదలినట్లు.. జగన్ తరపున మొరిగే ఊర కుక్కలని ఈ సమాజం నుంచి వెలివేయాలి
-మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
ప్రజావేదికను కూల్చారు, కేసులు పెట్టించారు, వ్యవస్థల్ని నాశనం చేశారు, పరిశ్రమల్ని రానివ్వకుండా చేశారు, రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు, నీచ సంస్కృతికి తెరలేపారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….
జగన్ రెడ్డి పెంచి పోషించిన కుక్కలు, ఊర కుక్కలుగా వారి నోటికొచ్చిట్టు మోరుగుతున్నాయి. వాటిలో నీతి, జాతి లేని ఊరకుక్క కొడాలి నాని. 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన అన్న నందమూరి తారక రామారావు కుటుంబం గురించి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబంలోని రాజకీయాలతో సంబంధం లేని మహిళల మీద కొడాలి నాని మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. తాడేపల్లి నుంచి వచ్చిన స్ర్కిప్ట్ ని తూచ తప్పకుండా మాట్లాడారని అర్ధమవుతుంది. జగన్ రెడ్డి వ్యవస్ధలన్ని వాడుకొని నీచ రాజకీయాలకి ఎందుకు తెర లేపుతున్నారని ప్రశ్నించారు? ఊర కుక్కుల్ని మున్సిపాలిటీ వాళ్లు పట్టి అడవులలో వదిలనట్లు తాడేపల్లి స్క్రిప్ట్ చదివే జగన్ రెడ్డి ఊరకుక్కలను ప్రజలే ఈ సమాజం నుంచి వెలివేయాలి.
అదే విధంగా సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఖర్మ. జగన్ రెడ్డి వ్యవస్థలన్నింటిని నాశనం చేశారు. పరిశ్రమలు లేకుండా చేశారు. ఆర్థిక పరిస్ధితిని కుప్ప కూల్చారు. ప్రజా వేదికని, రాజధానిని నేల మట్టం చేశారు. ప్రజలపై, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అస్థవ్యస్ధం చేశారు. రాజకీయాలలో ఏ ముఖ్యమంత్రి చేయని ఒరవడి జగన్ రెడ్డి చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కుటుంబంలోని రాజికీయాలతో సంబంధం లేని మహిళలు గురించి మాట్లాడించి సైకోలా పైశాచిక ఆనందం పొందుతున్నారు జగన్ రెడ్డి. కొడాలి నాని, గోరంట్ల మాధవ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జోగి రమేష్, పోతుల సునీత ఎవరు మాట్లాడిన మూలం జగన్ రెడ్డి. జగన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడి ఈడి, సిబిఐ కేసులలో ఇరుకున్నారు. అదే రీతిలో ఎదుటివారి కుటుంబాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నందున ఏం చేసిన చెల్లుతుందనుకుంటున్నారు. కాని ఏం చేయాలేరని గుర్తుపెట్టుకోవాలి.
బాబాయి హత్య కేసులో జగన్ రెడ్డి కుటంబ సభ్యుల పాత్ర బయటికొచ్చినప్పుడు, సిబిఐ బయట పెట్టిన రోజు మీ పరిస్ధితి ఏంటో ఆలోచించుకోండి. పదే పదే ఢిల్లీకి ఏం ఉద్దరించడానికి వెళుతున్నారు? వివేకా హత్యకు సంబంధించి సుపారీ ఎవరిచ్చారు? ఆ సమయంలో ఎవరి నుంచి ఎవరికి ఫోన్లు వెళ్లాయి? ఎవరి పాత్ర ఉందని సిబిఐ తేల్చింది ఇవన్ని బయటకొస్తే మీ పరిస్ధితి అగమ్యగోచరం అవుతుందని ఢిల్లీ వెళ్లి కాళ్ళు , గడ్డం పట్టుకుంటున్నారు. అవన్ని బయటపడినప్పుడు ప్రజలకి సమాధానం చెప్తారా లేక హిట్లర్ లా ప్రవర్తిస్తారా అనేది కాలమే సమాధానం చెపుతుంది. సొంత తల్లిని, చెల్లిని రోడ్డున వేసిన జగన్ రెడ్డికి తల్లి లాంటి భువనేశ్వరిని రోడ్డున వేయడంలో లెక్కేముందిలే అనుకుంటున్నారా?
సొంత కుటుంబాన్ని రోడ్డున వేసి, బంధువులని హత్యలు చేయించిన జగన్ రెడ్డికి సంస్కృతి ఎక్కడ నుంచి వచ్చింది. ఊరకుక్కలా రెచ్చిపోతున్న కొడాలి నాని మంత్రి పదవిని వైసీపీ వర్గమే తీసేసిందని గుర్తు చేసుకోవాలి. మంత్రి పదవి నుంచి తొలగించిన వర్గం నుంచి కొడాలి నానికి ప్రమాదం పొంచి ఉందని ప్రచారం జరుగుతుంది. టీడీపీ ఎప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటుంది. ఎవరు ఏ విధంగా ప్రవర్తించిన, ఎన్ని అక్రమాలకు పాల్పడిన ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నిస్తాం. మేం కూడ మీ కుటుంబంలోని మహిళల గురించి మాట్లాడితే వాళ్ళు ఎంత బాధ పడతారు. 70 ఏళ్ల రాజకీయ చరిత్ర చూసుకుంటే స్వాతంత్ర్యం కోసం పోరాడిన కుటుంబాలు, ఉన్నత చదువులు చదువుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. జగన్ రెడ్డి ప్రవేశ పెట్టిన విష సంస్కృతిని సమర్ధిస్తారా?
గోరంట్ల మాధవ్ న్యూడ్ విడియో కాల్ మాట్లాడి దొరికిపోయి కులాన్ని ఆపాదించి మాట్లాడటం. ఒరిజినల్ వీడియోని మీ ఇళ్ళ కొచ్చి చూపిస్తానని మాట్లాడారు. తెలుగుదేశం కార్యకర్తలంతా మీ ఇళ్ళకొచ్చి ఒరిజినల్ చూపిస్తే మీ పరిస్థితి ఏంటి? మీరు పతనం అంచున ఉన్నారు. ఎట్టి పరిస్ధితులలో అధికారంలోకి రారని గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లా నుంచి జెడ్పీ చైర్మెన్ గా పోతుల సునీతకి అవకాశం కల్పించారు. 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.
ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు కొనసాగించడం కోసం ఎమ్మెల్సీ కట్టబెట్టారు. రాజకీయ బిక్ష పెట్టిన అధినేత కుటుంబం గురించి మాట్లాడే తీరు ఇదేనా? వల్లభనేని వంశీ, కొడాలి నాని టీడీపీ బిక్ష పెడితే రాజకీయాలలోకి వచ్చారని గుర్తు చేసుకోవాలి. గాంధీ మీద జరిగిన ఘటన గురించి ఆవేశంలో చేశారని విజయవాడ సిపి మాట్లాడటం దుర్మార్గం. నెల్లూరు ఎస్పీకి ఎన్నో ఉన్నత పోస్టింగ్ లు ఇవ్వడం జరిగింది. నేరస్థులని కాపాడాల్సిన మీరు తాడేపల్లి స్ర్కిప్ట్ చదివి ప్రజానీకానికి ఏం సందేశాన్ని ఇస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి దగ్గర పని చేసే ప్యూన్ పోస్టుకు కూడ పనికి రారు.
ప్రధాని మంత్రి పదవికి అవకాశం వచ్చిన వద్దనుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఉమ్మడి రాష్ట్రాలని అభివృద్ధి క్రమంలో నడిపించిన వ్యక్తి. 2014-19 మధ్య అమరావతి రాజధానిగా పెట్టాడాన్ని ఆమోదిస్తున్నామని జగన్ రెడ్డి మాట్లాడారు. మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన రాజధాని అమరావతిగా కొనసాగిస్తామన్నారు. గెలిచిన తరువాత మూడు రాజధానులు అని ఎందుకు మాట మార్చారు. తల్లి, తండ్రి ఒకరే ఉన్నట్టు రాజధాని కూడ ఒకటే ఉంటుంది. ఉత్తారంధ్రాని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు. వైసీపీ వాళ్లు రూ. 15వేల కోట్ల విలువ చేసే భూముల్ని కొట్టేశారు.
సూట్ కేసు కంపెనీలు సృష్టించి లక్షల కోట్లు దోచుకున్న అవినీతిపరుడు జగన్ ను ఉరితీయాలని ధర్మాన ప్రసాద్ మాట్లాడిన మాటలు ఇప్పటికి రికార్డులో ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక జగన్ పాత్ర ఉందని అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పీసీసీ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ మాట్లాడాడు. ఇలాంటి వారిని జగన్ కేబినెట్ లో పెట్టుకున్నారు. టీడీపీ నాయకులకన్నా నీ గురించి నీచంగా మాట్లాడిన వారిని కేబినెట్ లో ఉంచుకున్నారు. టీడీపీని ఏదో చేయాలనుకున్న చాలా మంది కాల గర్భంలో కలిసిపోయారు. మీరు అధికారంలో ఉన్నా టీడీపీ కార్యకర్త వెంట్రుక కూడ పీకలేరని గుర్తు పెట్టుకోవాలి.