Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు లక్షల కోట్లు అవినీతి చేశారని ఆరోపించి నిరూపించలేక పోయారు

– తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నారా చంద్రబాబునాయుడుగారు లక్షల కోట్లు అవినీతి చేశారని ఆరోపించి నిరూపించలేకపోయారని తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… లోకేశ్ గారు ఫైబర్ గ్రిడ్ లో 2వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని ఆరోపించి నిరూపించలేకపోయారు. మేం అధికారంలోకి వచ్చాక వీళ్ళపై కేసులు పెడతాం, అరెస్టు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక ఒక్క పైసా అవినీతి కూడా నిరూపించలేకపోయారు.

ట్రాక్టర్ సరిగా నడపలేదు అని నారా లోకేశ్ పై, గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగ్ చేశారని ఇలా చెత్త కేసులు పెట్టి నారా లోకేశ్ ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ మొదలైన దగ్గర నుండి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, నన్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం ఆదినుండి మొదలుపెట్టారు, అదే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టమైన ఆధారాలున్నాయి. వీడియో మార్ఫింగ్ చేశారని సీఐడీకి కేసు ఇచ్చారంట. మార్ఫింగ్ చేయాల్సిన అవసరం మాకు ఏమొచ్చింది? చింతకాయల విజయ్ అమెరికాలో డబుల్ మాష్టర్ చేశారు. లోకేశ్ అమెరికాలో ఎంబీఏ చేశారు. నేను లండన్ లో ఎంఎస్ చేశాను.

ఇంతటి ఉన్నత చదువులు చదివిన మేము ఇలాంటి చిల్లర పనులు చేయము. నీతి, నిజాయితీ గల నాయకుడు చంద్రాబాబునాయుడు నాయకత్వంలో నడుస్తున్నవారం ఇలాంటి చిప్ ట్రిక్ లు మాకు తెలియవు. విలువైన రాజకీయాలతో బతుకుతున్నాం. ఇలాంటి చిల్లర పనులు చేయం. మీరు చేసే అరాచకాలు మితిమీరిపోతున్నాయి. మీ దరిద్రాలు మాకు అంటగడ్డవద్దు. మీ దరిద్రాలు మా నెత్తిమీద రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది కళంకిత పోలీసు అధికారులు వైసీపీకి తొత్తులుగా మారారు. వారు వైసీపీకోసమే పనిచేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు పడక తప్పదని కేసులు నమోదు చేసే వారికి చెబుతున్నాము.

శారీరక అరాచకాలు, హింసలు మానసికంగా ఇబ్బందులు పెట్టడం మానుకోవాలి. విజయవాడలో ఓ వైసీపీ కార్యకర్త పోలీసు కాలర్ పట్టుకున్నా చర్యలు లేవు. శ్రీకాళహస్తిలో అధికార పార్టీ నాయకుడి భార్య కానిస్టేబుల్ ను చీపురుతో కొడితే అప్పుడు పోలీసుల ఆత్మాభిమానం ఏమైంది? గుంటూరులో ఓ మహిళా ఎస్ ఐ ఇంటికెళ్లి ఆవిడ కారు ధ్వంసం చేసినా స్పందించరా?

ఈ మూడు సంఘటనలు ఒక్కరోజు జరిగినవే. వెలుగులోకి వచ్చినవి ఈ మూడైతే ఇంకా ఎన్ని ఉన్నాయో? పోలీసులపై తెగబడుతున్న నిందితులు వైసీపీ కార్యకర్తలే. అయినా పోలీసులు ఎందుకు స్పందించడంలేదు? టీడీపీ అధికారంలోకి వచ్చాక కళంకిత పోలీసు ఆఫీసర్స్ ను నిజాయితీగా పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. సంతోష్, బొబ్బిలి వెంగళరావు లపై మనీ ఎక్సాటర్షన్ యాక్టు పెట్టి కోర్టుతో మొట్టికాయలు తిన్నారు, మళ్లీ మా కేసు విషయంలో మొట్టికాయలు తినడం ఖాయమని తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE