– మంత్రి నాగార్జునను అనర్హుడిగా ప్రకటించండి
– స్పీకర్ తమ్మినేనికి ఎమ్మీల్యే డోలా లేఖ
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకి కొండెపి ఎమ్మెల్యే, టీడీపీ శాసనసభ పక్ష విప్, డాక్టర్ డోల బాల వీరంజనేయస్వామి లేఖ…
విషయం: సభలో మంత్రి మేరుగ నాగార్జున నన్ను వ్యక్తిగతంగా పుట్టిక గురించి – దూషించడం సభలో ప్రస్తావించే అవకాశం గురించి..
అధ్యక్షా.. నేడు శాసనసభలో యువత గురించి మేము సభలో మీ దృష్టికి తీసుకువస్తున్న సమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి శ్రీ మేరుగ నాగార్జున మాట్లాడుతూ నన్ను గురించి వ్యక్తిగతంగా “నువ్వు దళితుడివి అయితే, దళితులకు పుడితే, చంద్రబాబు బంధనాల నుండి బయటకు రా” అంటూ నన్ను దూషించడం నివ్వెరపరిచినది, నా హృదయం గాయపడింది.
శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రమాణం చేసే సమయంలో కులాతీత, మతాతీత భారత లౌకిక రాజ్యాంగం పై ప్రమాణం చేసిన మంత్రి ఈ విధంగా జుగుప్సకరంగా ప్రవర్తించడం అత్యంత హేయం.
తెలుగుదేశం పార్టీ భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగిని, శాసనసభ స్పీకర్ గా ప్రతిభా భారతి నియమించి దళితులను గౌరవించింది.
మంత్రి శ్రీ మేరుగ నాగార్జున గారు నర్సీపట్నంలో డా.సుధాకర్‌ని మాస్క్ అడిగినందుకు సస్పెండ్ చేసి రోడ్డు మీద చేతులు వెనక్కి విరిచి కట్టి అతని చనిపోయిన సమయంలోగాని, తూర్పుగోదావరి జిల్లాలో వరప్రసాద్ అనే దళితుడికి శిరోముండనం కేసులోగాని, చిత్తూరు జిల్లాలో డా. వనితారాణి దళితురాలుని గాని ఒంగోలులో మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని పోలీసులు చంపిన సమయంలోకాని స్పందించకుండా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా మంత్రిపదవిని పట్టుకుని వేలాడటం, దళిత వ్యతిరేకి జగన్ మోహన్‌రెడ్డిని సమర్దించడం అత్యంత జుగుప్సాకరం.
ఇలాంటి బాషను వుపయోగించే వ్యక్తి మంత్రిగానే కాదు, శాసనసభ సభ్యుడిగా కూడా అనర్హుడు. కావున సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చి మంత్రి నాగార్జునను మంత్రివర్గం నుండి తప్పించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను.