Suryaa.co.in

Telangana

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగు పెట్టి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం NTR స్టేడియంలో 17 వ తేదీన నిర్వహించే సభ ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, MLC సురభి వాణిదేవి, MLA లు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రోత్సవాలలో భాగంగా 16 వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని, 17 వ తేదీ సాయంత్రం NTR స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరవుతురని తెలిపారు. 17 వ తేదీన మధ్యాహ్నం 1.00 గంటలకు PV మార్గ్ లోని పీపుల్స్ ప్లాజా నుండి సెక్రెటరియేట్ మీదుగా NTR స్టేడియం వరకు చేరుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ సభకు రాష్ట్రంలో ని వివిధ జిల్లాల నుండి గిరిజన సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున వస్తారని చెప్పారు. గిరిజన సంప్రదాయాలను తెలియజెప్పే విధంగా కళాకారుల చే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సుమారు 5 వేల మంది కళాకారులు వివిధ వేష ధారణలతో కళా ప్రదర్శనలు నిర్వహిస్తారని చెప్పారు.

ముఖ్యమంత్రి KCR చిత్రపటానికి పాలాభిషేకం
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సెక్రెటరియేట్ కు1 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబెడ్కర్ పేరు ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి KCR కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్, MLC సురభి వాణిదేవి, MLA లు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత లతో కలిసి ముఖ్యమంత్రి KCR చిత్ర పటానికి పాలాభిషేకంtsy1 చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి KCR 8 సంవత్సరాల నుండి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. విద్య, ఉద్యోగం అనేక రంగాలలో సమన్యాయం జరగాలనే ఆలోచన తో అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం తో ఎంతో మంది ప్రయోజనం పొందారని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి పేరును తెలంగాణ సెక్రెటరియేట్ కు పెట్టడం నిజంగా హర్షణీయం అన్నారు. అంబెడ్కర్ సేవలు, కృషికి గౌరవంగా ప్రభుత్వం 125 అడుగుల విగ్రహం నిర్మాణాన్ని చేపట్టిందని, ముమ్మరంగా పనులు సాగుతున్నాయని చెప్పారు. నూతనంగా పార్లమెంట్ భవనానికి కూడా అంబెడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE