జగన్ రెడ్డి గంజాయి వ్యాపారంలో నెం.1 చేశారు

-విశాఖను భూ కబ్జాలకు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ చేసి ఉత్తరాంధ్ర మంత్రం పఠించే అర్హత ఉందా?
-రాజధానిని మూడు ముక్కలు చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనడం అవివేకం
-విశాఖ ప్రజల ఆత్మాభిమానమైన విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయడం విశాఖకు మేలు చేయడమా?
-వైసీపీకి ఓటు వేస్తే చెరుకు యంత్రంలో చెయ్యిపెట్టినట్లేనని ప్రజలు ఈసడించుకుంటున్నారు
-విజయనగరం పార్లమెంటు అధ్యక్షులు కిమిడి నాగార్జున

దశాబ్దాల తరబడి పోరాడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేసి.. విశాఖను ఉద్దరిస్తున్నామని, విశాఖను అభివృద్ధి చేస్తామని వైసీపీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటు అధ్యక్షులు కిమిడి నాగార్జున పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు? స్టీల్ ప్లాంటు గురించి ప్రభుత్వం అసలు పట్టించుకోట్లేదు. టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు రైల్వేజోన్ ని విశాఖపట్నంకు తీసుకొచ్చాం. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ళలో రైల్వేజోన్ గురించి ఏనాడైనా కేంద్రంతో పోరాడారా. నేటికి ఎందుకు రైల్వేజోన్ ఎందుకు సాధించలేదు. విజయసాయి రెడ్డి రైల్వేజోన్ రేపొచ్చిద్ది, మాపొచ్చుద్ది అంటూ కాలం గడిపేస్తున్నారు.

విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు విజన్ తో అభివృద్ధి చేశారు. కాస్మోపాలిటన్ సిటీగా మార్చి, ఐటీ, ఫైనాన్స్ ఇండస్ట్రీలను తీసుకువావలనే విజన్ తో ముందుకు సాగారు. చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖను ఫిన్ టెక్ వ్యాలీగా మార్చేందుకు కృషి చేశారు. మిలీనియం టవర్స్ ఏర్పాటు చేసి వేలాది మందికి ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించి సాఫ్ట్ వేర్ రంగానికి హబ్ గా మార్చారు. జగన్ రెడ్డి పరిపాలన విధానం చూసి ఆ కంపెనీలన్ని మూసుకొని వెనక్కి వెళిపోయే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశారా, వెనక్కి నెట్టారా అనేదే వైకాపా నేతలే సమాధానం చెప్పాలి.

మూడున్నరేళ్ళ జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేయలేదు. ఒక పరిశ్రమని తీసుకురాలేదు. ఒక ఉద్యోగం ఇవ్వలేదు. రైతులని ఆదుకున్నది లేదు. వీటిపై ప్రజల్లో తిరుగుబాటు మొదలవ్వడంతో వైసీపీ నాయకులు మూడు రాజధానులనే అంశాన్ని తీసుకొచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. ఉత్తారాంధ్ర నాయకులు రాజధానిని మూడు ముక్కలు కింద విడతీసి అందులో ఒక ముక్కని విశాఖపట్నానికి ఇస్తే ఉత్తారాంధ్రకి ఏదో జరిగిపోతుందని ప్రజలకు చెబుతున్నారు. జగన్ రెడ్డి మూడున్నేరళ్ల పాలనలో రాష్ట్రాన్ని గానీ, ఉత్తరాంధ్రని గానీ ఏమైనా అభివృద్ధి చేశారా? ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదు. మూడున్నరేళ్లలో విశాఖపట్నానికి, విజయనగరానికి, శ్రీకాకుళానికి చేసిందెంటో ప్రజల ముందుకొచ్చి చెప్పగలరా?

విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే ఉత్తారాంధ్ర ప్రజల జీవితాలు మారిపోతున్నాయని చెబుతున్నారు. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే ఆలోచన చేయకుండా.. అభివృద్ధి అనడాన్ని మించిన బూతు ఇంకోటి లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్క ఇటుకైనా పేర్చిన పాపాన పోలేదు. విశాఖపట్నాన్ని టూరిజం ఇండస్ట్రీ, హాస్పిటల్ జోన్ కింద డెవలప్ చేయోచ్చు.

శ్రీకాకుళం నుంచి భీమిలి ఉండే తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది. అరకు ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేయోచ్చు. ఆ ఆలోచనలతో ఏన్నడూ చేసింది లేదు. మూడున్నరేళ్లుగా విశాఖపట్నానికి కనీస అభివృద్ధి చేయకుండా, ఆర్దిక వనరులని పెంచకుండా, మౌళిక సదుపాయాల్ని కల్పించకుండా ఉత్తారాంధ్రకు ఏదో చేస్తామని చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.

చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ, ఏవేవో ప్రగల్భాలు పలుకుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ… విశాఖపట్నం అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలి. విశాఖపట్నం 2019లో టిడిపి చేసిన అభివృద్ధి దగ్గరే ఆగిపోయింది. విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టు ఎందుకు ముందుకు సాగడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎయిర్ పోర్టు అభివృద్ధి ఎందుకు ఆగిపోయింది.

విజయనగరంలో తోటపల్లి కాల్వ చాలా ముఖ్యమైనది. రైతులని ఆదుకునే ప్రాజెక్ట్. 2015లో చంద్రబాబు నాయుడు దాన్ని ప్రారంభించడం జరిగింది. టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు మంత్రులందరూ రివ్యూస్ పెట్టుకొని అన్ని కాలవలకు నీళ్ళు చేరుతున్నాయా లేదా, చెరువులు నిండుతున్నాయా లేదా అని, ప్రాజెక్ట్ మెయింటెన్స్ ఎలా ఉందని పర్యవేక్షించే వారు. నిరంతరం రైతాంగం అందరికి నీరు అందిలే చేశాం. మూడున్నరేళ్లలో బొత్స సత్యనారాయణ తోటపల్లి కాల్వ గురించి ఏనాడైనా సమీక్షించారా.?

వర్షాలు బాగా కురుస్తున్నా కాల్వ సరిగా ప్రవహించని దుస్థితి. కాల్వలో పిచ్చిమొక్కలు పెరగడంతో నీరు చివరి వరకు పారడం లేదు. బొత్స సత్యనారాయణ ప్రాతినిత్యం వహిస్తున్న చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల్లోని పొలాలకు నీరందని పరిస్థితి నెలకొందని రైతాంగం కనీళ్లు పెట్టుకుంటుంటే బొత్స ఏం చేస్తున్నారు. వాటర్ రెగ్యూలేషన్ కు కావాల్సిన లష్కర్ లని రూ.8,000/- లు ఇచ్చి నియమించ లేకపోతున్నారు. జిల్లానే పట్టించుకేలేని బొత్స రాష్ట్రం గురించి మాట్లాడుతుండడం సిగ్గుచేటు.

ఒకప్పుడు విశాఖపట్నం, ఉత్తారాంధ్ర అంటే ప్రశాంత వాతావరణం ప్రజలందరికి గుర్తొచ్చేది. వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగిపోయాయి. విశాఖపట్నం నుంచి దేశం మొత్తానికి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెం.1 గా ఉంచాలనుకుంటే జగన్ రెడ్డి గంజాయి అక్రమ రవాణాలో నెం.1 గా మార్చారు. మీకు వైసీపీకి ఓటు వేస్తే చెరుకు రసం మిషన్ లో చేయి పెట్టినట్టే అని ప్రజలు అనుకుంటున్న పరిస్ధితి.

Leave a Reply