– ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వ నిర్బంధకాండకు ప్రత్యక్ష సాక్ష్యం
– ఖండించిన తెలంగాణ టిడిపి నేతలు బక్కని, రావుల
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చింతకాయల విజయ్ నివాసంలో ఏపి సిఐడి పోలీసుల దౌర్జన్యకాండను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బక్కని నర్సింహులు, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు.
ఆంధ్రప్రదేశ్ లో గత3ఏళ్లుగా వైసిపి ప్రభుత్వ నిర్బంధకాండకు ఇది పరాకాష్టగా పేర్కొన్నారు. ప్రత్యర్ధులపై వైసిపి రాజకీయ కక్ష సాధింపు శ్రుతిమించింది.చివరికి పసిపిల్లలను కూడా భయభ్రాంతులకు గురిచేయడం హేయం. ప్రశ్నలతో పసిబిడ్డలను వేధించడం జగన్ మార్క్ పోలీసింగా..?
కుటుంబ సభ్యులను దారుణంగా వేధిస్తున్నారు, మానసికంగా హింసిస్తున్నారు, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన సాగిస్తున్నారు, హిట్లర్ ను మించిపోయారు.
ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వానికి తావులేదు. చరిత్రలో నియంతలంతా చివరికి కాలగర్భంలో కలిసిపోయారు, అదే గతి జగన్మోహన్ రెడ్డికి కూడా పడుతుందని హెచ్చరించారు.