అన్నమయ ప్రాజెక్టు బాధితులతో నేరుగా చర్చించి తమ సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం న్యాయవాది గోపాలకృష్ణ మాట్లాడుతూ.. మీ సమస్యల కోసం బి. జె. పి. నాయకుడు నాగోతు రమేశ్ వేసిన వ్యాజ్యం హైకోర్టు స్వీకరించిందని, ప్రభుత్వం ప్రమాణ పత్రం వేసిందని దానిమీద వాదనలు జరుగుతున్నవని, మీ తరపున వాదనలు బలంగా వినిపించడంలో భాగంగా నేరుగా సమస్యలు చూసి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది! పభుత్వం చేప్పుతున్నదానికి, వాస్తవ పరిస్తితికి భిన్నంగా వున్నాయని, సమస్యలు చూస్తుంటే హృదయం కలిచివేశాయని, రైతు మాత్రమే అడుక్కోలేడని, వ్యవస్థలే స్వచ్చంధంగా సహకరించి ఆదుకోవాలన్నారు!
హైకోర్టు ద్వారా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.…
నాగోతు రమేశ్ మాట్లాడుతూ తప్పుకు కారకులైన వారికి శిక్ష , రైతులకు, ప్రజలకు న్యాయం జరిగే వరకు మీ తరపున అన్ని విధాల పోరాడుతూ వుంటా అన్నారు. ఈ కార్యక్రమంలో పోతుగుంట రమేశ్ నాయుడు, నాగేశ్వరరావు , ఆదినారాయణ వెంకట్రామరాజు, సుబ్బరాజు , రాము, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.