– వంగలపూడి అనిత
వైసీపీ పాలనలో మహిళల ప్రాణ, మాణాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత ద్వజమెత్తారు. శనివారం నాడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలో జరిగిన బాలిక ఆత్మహత్యపై టీడీపీకి ఆపాదించి రాజకీయాలు మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్షన్ వాసిరెడ్డి పద్మ వీటికి ఏం సమాధానం చెబుతారు? గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వివాహితపై 6 గురు గ్యాంగ్ రేప్ చేశారు, దీనిపై బాధిత మహిళ ఫిర్యాదు చేసేందుకు వెళ్తే స్ధానిక సీఐ ఫిర్యాదు తీసుకోకపోగా ఆ మహిళను బూతులు తిట్టి మానసిక క్షోభకు గురి చేయటంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నిందితుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళా మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండగానే కాకినాడలో ప్రేమోన్మాది మరో యువతిని గొంతు కోసి చంపాడు. రాష్ర్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుంది? మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి, డీజీపీ, హోంమంత్రి, మహిళా కమిషన్ ఎందుకు? అని నిలదీశారు.