Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి అండతోనే శివప్రసాద్ రెడ్డి బరితెగించి వ్యవహరిస్తున్నారు

-ఉక్కు ప్రవీణ్ రెడ్డి ఇంటిపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గం
-నిందితుల్ని వదలి బాధితుల్ని జైలుకు పంపాలని ఏ సెక్షన్ లో ఉందో పోలీసులు చెప్పాలి
– కింజరాపు అచ్చెన్నాయుడు

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండతోనే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బరితెగించి వ్యవహరిస్తున్నారు. దోపిడి చేయటం, దాన్ని ప్రశ్నించివారిపై దాడులు చేయటం శివప్రసాద్ రెడ్డికి దినచర్యగా మారింది. టీడీపీ ఇన్ చార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపటం దుర్మార్గం. ఎగ్జిబిషన్ పేరుతో ఎమ్మెల్యే పేద ప్రజల డబ్బులు దోపిడి చేశారు. దీన్ని బయటపెట్టినందుకే రౌడీ మూకల్ని పంపి ప్రవీణ్ రెడ్డి ఇంటిపై దాడి చేయించారు. దాడి చేసిన నిందితుల్ని వదలి బాధితుల్ని జైలుకి పంపాలని ఏ సెక్షన్ లో ఉందో పోలీసులు చెప్పాలి. పోలీసులు చట్టం చెప్పినట్టు పనిచేస్తారా? లేక వైసీపీ నేతలు చెప్పినట్టు పనిచేస్తారా? చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్న వారు ఎంతటోళ్లైనా సరే చట్టం ముందు దోషులుగా నిలబెడతాం. నియోజవర్గ ప్రజల్ని పీడిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే సంగతి తేలుస్తాం. అక్రమ కేసులకు భయపడేవారెవరూ టీడీపీలో లేరు. ప్రవీణ్ కుమార్ రెడ్డి, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది.

LEAVE A RESPONSE