Suryaa.co.in

Andhra Pradesh

3 రాజధానులు మా విధానం.. 3 పెళ్ళిళ్ళు పవన్ విధానం

– అది జనసేన కాదు.. బాబు సేన
– నీ సేనతో రాళ్ళు, కర్రలతో దాడి చేయించి శాంతిభద్రతలు అంటావా..?
– పవన్ విశాఖలో ఉన్నంతవరకు మహిళలు బయటకు రావొద్దు..!
– బాబు ఇచ్చిన ప్యాకేజీతో ఉత్తరాంధ్రపై గంజాయి ముద్ర
-మంత్రి గుడివాడ అమర్నాథ్

మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
బాబు బాణీనే జనసేన వాణి
మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ చేపట్టిన విశాఖ గర్జన ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకే పవన్ కళ్యాణ్ విశాఖ వస్తున్నారని నాలుగు రోజుల కిందటే చెప్పానని, చెప్పిన విధంగానే పవన్ కల్యాణ్ విశాఖలో దిగగానే ఆ పార్టీకి చెందిన సైకోలు తమ పార్టీ నేతలపై దాడులు దిగారు. చంద్రబాబునాయుడు బాణీ వినిపించడానికే.. జనవాణి పేరుతో పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చాడు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని గడాఫీతో పోల్చడాన్ని అమర్నాథ్ తీవ్రంగా తప్పు పట్టారు, ఖండించారు.

బాబు కోసం ఏర్పడిన పార్టీ జనసేన
ప్యాకేజీ స్టార్‌ అనే పదానికి అర్థం ఏమిటో విశాఖ ప్రజలకు పవన్‌ కల్యాణ్‌ బాగా అర్థం అయ్యేలా చెప్పాడు. నిన్న ఉత్తరాంధ్ర జేయేసీ సభ ఉంది అనగానే, ఆ సభను డైవర్ట్‌ చేయటానికి… ఉదయం సభ అంటే సాయంత్రం నేను డైవర్ట్‌ చేస్తాను అని చంద్రబాబు తరఫున రెడీ అయ్యాడు. ఇది మూడు నెలల క్రితమే నిర్ణయించుకున్నాం అని ఈ రోజు అతను చెప్పటం సిగ్గు చేటు. చంద్రబాబు చేత, చంద్రబాబు వల్ల, చంద్రబాబు కోసం ఏర్పడిన పార్టీ జనసేన. దీనికి బాబు సేన అని పేరు పెడితే బాగుంటుంది.

బాబు ఇచ్చిన ప్యాకేజీతో ఉత్తరాంధ్రపై గంజాయి ముద్ర
ఉత్తరాంధ్రకు చెందిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్ని, మంత్రుల్ని ఈనాడు పత్రిక టార్గెట్‌ చేయటం; ఉత్తరాంధ్రలో ప్రైవేటు వ్యక్తుల భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం మీద నెట్టటానికి టీడీపీ, దాని మీడియా, దానితోపాటు జనసేన, ఇతర పార్టీలు ప్రయత్నం చేయటం… ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది. ప్రత్యేకించి స్పీకర్‌ తమ్మినేని సీతారాం మీద, మంత్రి ధర్మాన మీద, నా మీద, టీడీపీ వ్యక్తిగతంగా దాడి చేసి వ్యక్తిత్వ హననానికి దిగారు. చివరికి ప్రాంతం మీద కూడా చెడు ముద్ర వేసి… దీన్ని ఒక గంజాయి సాగు ప్రాంతంగా మాట్లాడటానికి కూడా పవన్‌ కల్యాణ్‌ రెడీ అయ్యాడు. కారణం ఏమిటి? ప్యాకేజీ.
మూడు రోజుల ప్యాకేజీ! డైవర్ట్‌ చేయటానికి ప్యాకేజీ. చంద్రబాబు నాయుడుతో కుదుర్చుకున్న ప్యాకేజీ!
ఇదంతా ఎందుకు జరుగుతోందంటే… ఇంత ఉద్ధృతంగా ఉత్తరాంధ్ర ఉద్యమం… డీసెంట్రలైజేషన్‌కు మద్దతుగా, వారి ఆత్మాభిమాన పోరాటంగా జరగటం ఎట్టిపరిస్థితిలో చంద్రబాబుకు, రామోజీకి, ఎల్లో మీడియాకు నచ్చటం లేదు. వారు కోరుకున్న, వారు కలలుగన్న ప్రాంతంలో మాత్రమే, వారు కోరుకున్న ప్రాంతంలో మాత్రమే… అది కూడా వారు కోరుకున్న భూముల్లో మాత్రమే ఉండాలన్నది వారి తంత్రం, కుతంత్రం. రాజు మారినప్పుడల్లా రాజధాని మారటాన్ని పవన్‌ కల్యాణ్‌ అనుమతించడట. మరి రాష్ట్ర విభజన జరుగుతుంటే ఎక్కడ దాక్కున్నాడు? ఎవరికి మద్దతు ఇచ్చాడు? తెలంగాణ ఏర్పడాలని ఎందుకు కోరుకున్నాడు?

ఇంతకన్నా ఎప్పుడైనా సామాజిక న్యాయం జరిగిందా..?
కులాల మేలు కోసం… పెట్టిన కార్పొరేషన్ల వల్ల మేలు జరగలేదని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడాడు. కులాలకు ఇంతకంటే ఎక్కువగా ఏ ప్రభుత్వంలో అయినా సామాజిక న్యాయం జరిగిందా? దాదాపు 1.8 లక్షల కోట్లు నేరుగా… వారి ఖాతాల్లో మూడున్నరేళ్ళలోనే వేసి, ఈ సామాజిక వర్గాలకు మేలు చేశాం. ఇలాంటివి పసుపు కళ్ళజోడు పెట్టుకుని, ఎన్టీఆర్‌ భవన్‌ స్క్రిప్టుతో మాట్లాడితే పవన్ కు కనిపించవు. డ్వాక్రా గ్రూపుల్లో దాదాపు 1 కోటి మందికి మేలు చేస్తూ రూ. 25,517 కోట్లు వారికి ఇస్తూ ఇప్పటికే 2 విడతలు చెల్లించిన ప్రభుత్వం గురించి ఒక్క మాట మాట్లాడరు.

13 జిల్లాలు 26 జిల్లాలు కావటం వికేంద్రీకరణ కాదా?
అన్ని కులాలకూ… ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇస్తూ ఆలయ బోర్డుల్లో, నామినేటెడ్‌ పదవుల్లో సగం వారికి… అందులోనూ సగం మహిళలకు కేటాయించటం సామాజిక న్యాయం కాదా? . రెవెన్యూ డివిజన్లు పెరగటం సామాజిక న్యాయం కాదా? . చంద్రబాబు పెరగటం, పవన్‌ కల్యాణ్‌ పెరగటం సామాజిక న్యాయం అవుతుందా? . ఆ నలుగురు, వారి బినామీలు కొందరు… ఇదే బడ్జెట్‌ను తినేయటం సామాజిక న్యాయం అవుతుందా? . పోలీసులు శాంతి భద్రతలు కాపాడటం తప్పా? . రాళ్ళు వేయించి… కర్రలతో దాడి చేయించి… సిగ్గు లేకుండా మాట్లాడటం పీకే మార్కు శాంతి భద్రత అవుతుందా? . తుపాకీ చేతిలో పట్టుకుని రోడ్ల మీదకు వెళ్ళిన అసాంఘిక వ్యక్తికి, శక్తికి రాజకీయ పార్టీ పెట్టే నైతిక అర్హత ఉందా? . జన– సేన అని పేరు పెట్టుకున్నాడు. సేన, సైన్యం… ఏమిటి ఈ భావజాలం?

యాంటీ సోషల్ ఎలిమెంట్
మంత్రులపై రాళ్ళు వేసిన వారిని అరెస్టు చేస్తే తప్పా? పవన్‌ కల్యాణ్‌ మద్దతు మీడియా… ఎల్లో మీడియా…. బాబు మీడియా… ఏం చెప్పింది? జన సేన వారే దాడి చేశారని చెప్పింది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గూండాలు అంటాడు… ఎవరైనా పవన్‌ కల్యాణ్‌పై దాడి చేశారా, లేదే. ఒకపక్క బీజేపీతో కాపురం చేస్తూ… వారు అమ్మేస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌; బాబు తన పార్ట్‌నర్‌గా ఉండి అమ్మేసిన ప్రత్యేక హోదా… విశాఖ రైల్వే జోన్‌… ఇవన్నీ ఈ రోజున పవన్‌ కల్యాణ్‌కు గుర్తుకు వచ్చాయి. క్రిమినల్స్‌ రాజకీయాల్లో ఉండకూడదు అన్నది కరెక్టు. తుపాకితో కాల్చాలన్న కోరిక ఉన్నవాడిని… ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ బెదిరించేవాడిని… సోషల్‌ ఎలిమెంట్‌ అంటారా? యాంటీ సోషల్‌ ఎలిమెంట్‌ అంటారా?
జన సేన కార్యకర్తలు హత్యా యత్నం చేసిన విషయాన్ని ఎల్లో మీడియానే నిన్న వీరగాధ అన్నట్టు చూపింది. అది నిజం అయినప్పుడు… 307 సెక్షన్‌ కింద పోలీసులు కేసులు పెట్టకపోతే… శాలువాలు కప్పి, సన్మానాలు చేస్తారా?

2 నెలలకిందట వాణి మొదలుపెట్టి.. 3 నెలల కిందట టికెట్ బుక్ చేసుకున్నావా..?
పవన్ కళ్యాణ్ విజ్ఞత కలిగిన నాయకుడే అయిఉంటే, శనివారం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘటనకు, తమ కార్యకర్తలు, నాయకులు బాధ్యులు అని హుందాగా ఒప్పుకునే వారు, పవన్ కళ్యాణ్ కు ఆ హుందాతనం లేకకపోగా, ఆ దాడులు తమకు తామే చేయించుకున్నామని మాపై ఆరోపణలు చేయడం శోచనీయం. పవన్ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు కూడా ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనను ఖండించాల్సింది పోయి.. దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టడాన్ని తప్పుపట్టడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. తాను విశాఖ పర్యటన కార్యక్రమాన్ని మూడు నెలల కిందటే ఖరారు చేసుకున్నానని పవన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రెండు నెలల కిందటే జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. మూడు నెలల కిందటే టికెట్ ఎలా బుక్ చేసుకుంటారు?.

పవన్..రాజకీయ ఉగ్రవాది
విశాఖ గర్జన కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించేందుకు, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడిచేందుకే పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన పెట్టుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలపై తమ పార్టీ సైకోలను ఉసిగొలిపిన పవన్ కళ్యాణ్.. ఒక రాజకీయ ఉగ్రవాది. తనవెంట వచ్చే వారంతా తనకు ఓట్లు వేస్తారని భ్రమలో పవన్ కళ్యాణ్ ఉన్నారని, సెలబ్రిటీలను చూసేందుకు వచ్చిన వారంతా ఓట్లేస్తే ఈపాటికి ఎంతోమంది సినిమా నటులు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే వారు.

పవన్ కల్యాణ్ ది మూడు పెళ్లిళ్ల (ఇప్పటికి) విధానం
పెళ్లి చేసుకున్న చోటల్లా రాజధాని పెట్టమంటారా? అని పవన్ మాట్లాడటం సిగ్గు చేటు. మాది మూడు రాజధానుల విధానం.. పవన్ కల్యాణ్ ది మూడు పెళ్లిళ్ల (ఇప్పటికి) విధానం. పవన్ కళ్యాణ్ కు సంస్కృతి, సంప్రదాయాలు తెలియవు. ఆయన విశాఖలో ఉన్నంతవరకు అమ్మాయిలు రోడ్లమీదకు రావద్దు. ఒకవిధంగా ఆలోచిస్తే, పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరినీ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సలహా ఇస్తాడేమో?. పవన్ కళ్యాణ్ వంటి ఉగ్రవాదులకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదు.. అని అమర్ నాథ్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE