– 53 మంది డీయస్పీలకు పోస్టింగ్ వేయగా, అందులో 25% మంది రెడ్లేనా?
– ప్రముఖ పట్టణాల్లో ఒక్క బీసీకి, ఎస్సీకి గానీ డీఎస్పీ పోస్టింగ్ లేదు
– ప్రతి ప్రాంతంలోను సొంత సామాజికవర్గానికే పోస్టింగ్‌లు
– జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరం
– డీఎస్పీ ప్రమోషన్లలో చంద్రబాబు అన్యాయం చేయలేదని సుచరిత 10.03.2022న 12637 నెంబర్ ప్రశ్నకు సమాధానమిచ్చారు
– టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఒకే కులానికి పదవులు ఇవ్వలేదని, డీఎస్పీల ప్రమోషన్లలో చంద్రబాబు ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదని హోంమంత్రి సుచరిత స్వయంగా చట్టసభల్లో 10.03.2022న 12637 నెంబర్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ జగన్ రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరిరు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబుపై నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా తేలింది. బడుగు, బలహీనవర్గాలను జేసీబీతో అణగదొక్కుతున్నారు. జగన్‌రెడ్డి వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. డీఎస్పీ ప్రమోషన్లలో 37మందిలో 35 మందికి ఒకే సామజిక వర్గానికి చంద్రబాబు ప్రమోషన్లు ఇచ్చారనడం అసత్యం. చంద్రబాబుపై నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా తేలింది. 36 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్ లలో 17 మంది ఓసీ, 12 మంది బీసీ, ఆరుగురు ఎస్సీ, ఒక ఎస్టీ ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో సొంత సామాజికవర్గానికి పోస్టింగ్ వేయించుకున్నారు. నిన్న 53 మంది డీయస్పీలకు పోస్టింగ్ వేయగా, అందులో 25% మంది సొంత సామాజికవర్గం వారే. 29 సబ్ డివిజన్లలో 19 మంది సొంత కులం వారే. ఒక్క కాపుకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రముఖ పట్టణాల్లో ఒక్క బీసీకి, ఎస్సీకి గానీ పోస్టింగ్ లేదు. ప్రతి ప్రాంతంలోను సొంత సామాజికవర్గానికే పోస్టింగ్‌లు వేయించారు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా ఫరవాలేదు అన్న విధంగా జగన్‌రెడ్డి తన సొంత సామాజికవర్గాన్ని పెంచి పోషిస్తూ బడుగు బలహీనవర్గాలను జేసీబీలతో, రోడ్డు రోలర్లతో అణగదొక్కుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో, సలహాదారుల్లో, పార్లమెంటు పదవుల్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి శాఖలో అంతా సొంత సామాజికవర్గమే.
డీయస్పీ అంటే అత్యంత కీలకమైన బాధ్యత. డిప్యూటీ సూపరింటెండెంట్‌గా వ్యవహరించే అధికారులకు పోస్టింగ్ వేయడంలో నిన్న 53 మంది డీయస్పీలకు పోస్టింగ్ వేయగా, అందులో 25% మంది సొంత సామాజికవర్గం వారే. 29 సబ్ డివిజన్లలో 19 మంది సొంత కులం వారే. ఒక్క కాపుకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు.ప్రముఖ పట్టణాల్లో ఒక్క బీసీకి, ఎస్సీకి గానీ పోస్టింగ్ లేదు. ఇప్పుడు ఇచ్చింది 19 మందికే. కానీ ఇప్పటికే ప్రతి ప్రాంతంలోను సొంత సామాజికవర్గానికే పోస్టింగ్‌లు వేయించారు. ఉత్తరాంధ్రలో కూడా సొంత సామాజికవర్గాన్ని తీసుకెళ్లి పోస్టింగ్ వేయించుకున్నారు.
2017లో ఏసీబీకి అడ్డంగా దొరికి అరెస్టయిన డీయస్పీ వై.హరనాథ్‌రెడ్డిని టెక్కలి డీయస్పీగా నియమించారు. ఇతని మీద అనేక అభియోగాలున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం, బెంగుళూరులో పెద్ద ఎత్తున ఆస్తులు కూడా కూడబెట్టారు. నిజాయితీగా పనిచేసే బీసీ, ఎస్సీ అధికారులకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఎన్నికల్లో అనుకూలంగా పనిచేసేందుకే ఈ పోస్టింగ్‌లు ఇచ్చారు. ప్రభుత్వ చర్యలతో పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర అనిశ్చితి, అసంతృప్తి నెలకొంది.
రాత్రింబవళ్లు శాంతిభద్రతలు కాపాడే పోలీసు అధికారులకు ఇచ్చే గౌరవం ఇదేనా?మీ సామాజికవర్గం కాకపోతే పోస్టింగ్ ఇవ్వరా?డీఎస్పీ ప్రమోషన్లలో 37 మందికి గాను 35 మందికి ఒకే సామజిక వర్గం వారికి చంద్రబాబు నాయుడు ప్రమోషన్లు కల్పించారు అంటూ జగన్ రెడ్డి నుంచి వైసీపీ నేతలంతా ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై ఢల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సైతం తప్పుడు ఫిర్యాదు చేశారు. 36 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్ వచ్చింది. అందులో 17 మంది ఓసీలు, 12 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ ఉన్నారు.17 మంది ఓసీ అధికారుల్లో ఐదుగురు కమ్మ, ముగ్గురు కాపు, ముగ్గురు రెడ్డి, ముగ్గురు బ్రాహ్మణ ఉన్నారు. ఇద్దరు రాజు, మరొకరు ఇతర ఓసీ కులానికి చెందిన వారు ఉన్నారు.
ఒకే కులానికి పదవులు ఇవ్వలేదని, డీఎస్పీల ప్రమోషన్లలో చంద్రబాబుపై నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా తేలింది. తనకున్న కులపిచ్చితో 800 నామినేటెడ్ పోస్టులను తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.