లండన్ లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆర్కియాలజీ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయం కు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంలో సీఎం కేసీఆర్ ముఖ్య పాత్ర పోషించారన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ పథకాల వల్ల ప్రపంచంలోనే బెస్ట్ టూరిజం విలేజ్ గా పోచంపల్లి ఎన్నిక కావడం రాష్ట్ర పర్యాటక రంగంలో చారిత్రాత్మకమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
కేసీఆర్ అదేశాల మేరకు తెలంగాణ పర్యాటక వైభవాన్ని లండన్ వేడుకగా ప్రపంచ దేశాలకు, పర్యాటకులకు, ట్రావెల్ ఏజెంట్ లకు తెలిసేలా, రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని, కాఫీ టేబుల్ పుస్తకాలను, ట్రావెల్డర్స్ కి , టూర్ ఆపరేటర్స్ కు , పర్యాటకులకు ఉచితంగా అందించమన్నారు. తెలంగాణ టూరిజం రోడ్డు షో ను ఘనంగా నిర్వహించామన్నారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ యవనికపై చిరస్థాయిగా నిలిచిపోయేలా వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో ఘనంగా నిర్వహించామన్నారు. పర్యాటకుల స్వర్గధామం తెలంగాణ టూరిజం ను ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు దర్శించే విధంగా పూర్తి సమగ్ర సమాచారాన్ని ఈ ట్రావెల్ మార్ట్ లో ట్రావెల్ ఎజెంట్స్ కు అందించామన్నారు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యటకాభివృద్ధి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, MD మనోహర్, టూరిజం అధికారులు మహేష్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ కమలాకర్, అధ్యక్షుడు శ్రావణ్ గౌడ్, తెలంగాణ జాగృతి, ట్రావెల్ ఏజెంట్స్ ఆఫ్ తెలంగాణ, టూరిజం శాఖ అధికారులు, ఇండియా టూరిజం అధికారులు రోడ్ షో లో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.