Suryaa.co.in

Andhra Pradesh

జగన్ క్రూరుడు, సైకో.. ఇతని బొమ్మను రోజూ చూడాలా?

– మీ పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ ఫొటో పెట్టడమేంటి.? ఆ భూమి జగన్ తాతిచ్చాడా?
బొబ్బిలి లో ఇదేం ఖర్మ మన రైతులకు సదస్సులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం

ఇదేం ఖర్మ మన రైతులకు కార్యక్రమంలో బొబ్బిలి రైతాంగం భారీగా పాల్గొంది. ఈ ప్రభుత్వం వచ్చాక రైతాంగం పడుతున్న ఇబ్బందులు నా దృష్టికి తెచ్చారు.ప్రభుత్వ నిర్ణయాల ప్రభావితం వల్ల రైతాంగం బాగా నష్టపోయింది. వ్యవసాయం కొత్తకాదు.. జగన్ తోనే వ్యవసాయం రాలేదు. జగన్ కు అసలు వ్యవసాయమే తెలీదు.ముందు వ్యవసాయం చేసిన తరువాత మనం రాజకీయాల్లో పైకొచ్చాం. ఎన్టీఆర్, నేను వ్యవసాయమంటే ఏంటి, రైతుల ఇబ్బందులేంటని ఆలోచించాం. రైతుల ఇబ్బందులు, సమస్యలు తెలిసిన పార్టీ తెలుగుదేశం.అందుకే తెలుగుదేశం పార్టీ జెండాలో నాగలి గుర్తును పెట్టాం. నిత్యం రైతుల గురించి ఆలోచించే ఏకైక పార్టీ తెలుగుదేశం.

రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడమేంటి? యూనిట్ విద్యుత్ ధర ఇంత అధికంగా ఉండడం ఏమిటి? పట్టా కోసం గతంలో కరణం వద్దకు వెళ్లి కాళ్లా వేళ్లా పడే పరిస్థితి. కానీ ఎన్టీఆర్ వచ్చాక కరణం వ్యవస్థను రద్దు చేశారు. మీ పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ ఫొటో పెట్టడమేంటి.? ఆ భూమి జగన్ తాతిచ్చాడా? మీ తాత..ముత్తాతలిచ్చారు తప్ప మీ భూములు జగన్ జాగీరు కాదు. జగన్ క్రూరుడు, సైకో.. ఇతని బొమ్మనుbobbili1 రోజూ చూడాలా? జగన్ ఓ సైకో.. సైకో పాలన వద్దు.. సైకిల్ పాలన రావాలి. గతంలో అసెంబ్లీలో వైఎస్ తన కొడుకు అమెరికా వెళ్లాడన్నారు. కానీ వెంటనే తిరిగి వచ్చాడు.రైతులు చెప్పిన సమస్యలన్నీ రాసుకున్నాను.రైతాంగానికి న్యాయం చేస్తాం. బ్రిటీష్ పాలన పోయి ప్రజా పాలన వచ్చింది. రాజ్యంగబద్దంగా ముందుకు పోయాం. అనేక వ్యవస్థల్ని ప్రక్షాళన చేసుకుంటూ వచ్చాం.ఏ ముఖ్యమంత్రి అయినా పాత వ్యవస్థల్ని అభివృద్ధి పరిచారేగానీ రద్దు చేయలేదు.జగన్ అతనితోనే పరిపాలన ప్రారంభమైనట్లు ప్రార్థిస్తున్నాడు.ఈయనే మొదటి ముఖ్యమంత్రి అయినట్లు అనుకుంటున్నారు.ఈయనే చివరి ముఖ్యమంత్రిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు.

ఆర్బీకేలు పెట్టమని ఎవరూ కోరలేదు.వాలంటీరు వ్యవస్థను పెట్టి రైతులపై పెత్తనం చలాయించేలా చేశారు.ఈ అధికారం ఎవరిచ్చారు? ఎన్టీఆర్, నేను ఆర్బీకేలపై ఎక్సర్ సైజులు చేశాం.రైతులకు గిట్టుబాటు ధర ఎట్లివ్వాలి? వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా తయారుచేయాలని ఆలోచించాం. వ్యవసాయదారులు ఏమేం పంటలు వేయాలి? పంటల మార్పిడి ఏ విధంగా చేయాలి? అనేవాటిపై ఆలోచించాం. ఎన్టీరామారావు సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చారు.ఎరువులు, విత్తనాల కోసం వేరేవేరే వారి వద్దకు వెళ్లకుండా వీటన్నింటిని ఇంటిగ్రేటెడ్ చేసి జవాబుదారీ తనాన్ని తీసుకొచ్చాం.ప్రస్తుత ఆర్బీకేల్లో అన్నీ సమస్యలే. మేం పర్చెసింగ్ సెంటర్ లు పెట్టాం. రైస్ మిల్లర్లు ఎంతకు కొనాలి అనేదానిపై ప్రయోగాలు చేసి చివరకు నేను ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాలను పంపి రైతుల కళ్ళం దగ్గరే పారదర్శకంగా డబ్బులిచ్చేలా చేశాం.

అలాంటి వ్యవస్థల్ని ఈ ముఖ్యమంత్రి నాశనం చేశారు.భారతదేశానికే తిండి పెట్టిన రాష్ట్రం అంధ్రప్రదేశ్.అందుకే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయింది.బ్రిటీష్ వారు పోతూ పోతూ కాటన్ ధవళేళ్వరం బ్యారేజ్ కట్టారు.కృష్ణా నదిపై ఆనకట్ట కట్టడంతో ఆ జిల్లాల్లో అభివృద్ధి జరిగింది.విజయనగరం జిల్లాలో పది అడుగుల్లోనే నీళ్లు ఉంటాయి. విజయనగరం జిల్లాలో పంపు సెట్లు పెట్టలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కరీంనగర్, చిత్తూరులో ఎక్కువ పంపు సెట్లు ఉండేవి. ఈ జిల్లాలో ఎక్కువ పంపు సెట్లు పెట్టాలి. వేదవతి, జంఝావతి, వెంగళరావు సాగర్, మద్దివలస, వంశధార, నాగావళి అనుసంధానం చేయడం వంటి వాటికి రూపకల్పన చేశాం. తోటపల్లి ప్రాజెక్టు నేనే పని ప్రారంభించి పూర్తి చేశారు.వెంగళరావు ప్రాజెక్టుకు ఎప్పుడో వేసిన ఫౌండేషన్ ను నేను పూర్తి చేశాను.

రూ.1,550 కోట్లను ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టిన పార్టీ టీడీపీ.ఇరిగేషన్ కు నాలుగేళ్లో రూ.400 కోట్లు కూడా పెట్టకుండా ఈ జగన్ రెడ్డి, ఉత్తరాంధ్ర మంత్రులు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారు.రైతాంగాన్ని నాశనం చేశారు. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేసి చిన్న నదులన్నింటినీ అనుసంధానం చేశాం. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీరివ్వాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా శాశ్వతంగా మంచిచేసే విధంగా చేయాలని ముందుకు పోతే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. వైసీపీ చేసిన పనులకు బాధ, కోపం, ఆవేశం వస్తోంది. నేడు నిబ్బరం చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మొట్టమొదటిసారిగా పామాయిల్ మలేషియాలో ఉండేది. భారతదేశానికి పామాయిల్ తీసుకొచ్చిన ఘనత ఎన్టీరామారావుకే దక్కుతుంది.

రాయలసీమకు నీరిచ్చి హార్టికల్చర్ హబ్ గా తయారు చేయొచ్చు.ఉత్తరాంధ్రలో అంతర్ పంటలు వేసుకోవచ్చు.సమస్య వచ్చినప్పుడు రైతాంగం ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే పరిస్థితి ఉండాలి. 2014-19 తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులకు స్వర్ణయుగం. వ్యవసాయంలో 11శాతం వృద్ధి సాధించాం.స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వ్యవసాయ రంగంలో 11 శాతం వృద్ధి ఏ రాష్ట్రమూ సాధించలేదుఅలా సాధించిన పార్టీ ఒక్క తెలుగుదేశమే.

నేడు రైతు సంక్షేమం ఎక్కడా లేదు. అంతా సంక్షోభమే.పామాయిల్, శనగలకు ధర లేకపోత ఎంఎస్పీ ఇచ్చాం. పత్తి, పొగాకుకు ధర లేకపోతే తక్షణమే ఆదుకున్నాం.కూరగాయల కోసం రైతు బజార్లు ప్రవేశపెట్టాం.పండించిన పంటల సరఫరా కు వాహన సౌకర్యం కల్పించాం. రోడ్డుపైకి పంట తెచ్చి అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి పోయేలా వాహనాలు ఏర్పాటు చేసాం.రైతు పండించే పంట నేరుగా వినియోగదారుడికి చేరిస్తే ఆ డబ్బు మీకొస్తుంది.ఆ విధంగా వినియోగదారుడికి లాభం చేకూరేలా చేశాం.విజయనగరం జిల్లాలో వరి, చెరుకు, పత్తి, పామాయిల్, మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు.

పామాయిల్ ధర రూ.22 వేల నుంచి రూ.11 వేలకు పడిపోవడం బాధాకరం. ఎన్నికలకు ముందు జగన్ షుగర్ ఫ్యాక్టరీపై పెద్ద పెద్ద మాటలు చెప్పి షుగర్ ఫ్యాక్టరీని ముంచేసే పరిస్థితికి వచ్చారు.జగన్ వచ్చాక 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.దేశంలో రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది.కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉందిదేశంలో రైతుల అప్పుల్లో నెంబర్ వన్ లో ఉన్నాం. సగటున రూ.2 లక్షల 45 వేలు ప్రతి ఒక రైతుపైన అప్పు ఉంది.ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన విజయం.

ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో రైతులున్నారు. సాగునీటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.64 వేల కోట్లు ఖర్చు పెట్టాము.దేశంలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టింది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే.సాగు ఖర్చు తగ్గించేందుకు సబ్సిడీతో డ్రిప్ ఇచ్చాం. మైక్రో ఇరిగేషన్, యాంత్రీకరణ పరికరాలకు 90 శాతం సబ్సిడీ ఇచ్చాం. రైతు రథం పథకం కింద 13వేల ట్రాక్టర్లు ఇచ్చాం. మైక్రో ఇరిగేషన్ పై గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రిపోర్టు ఇచ్చి దేశంలో కూడా మైక్రో ఇరిగేషన్ రావాలని అప్పుడే హార్టికల్చర్ అభివృద్ధి చెందుతుందని చెప్పి ముందుకు పోయాం.

జగన్ రెడ్డి వచ్చి మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నాడు. శ్రీకాకుళంలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదనీ..విజయవంతమైందని గొప్పలు చెప్పుకుంటున్నాడు.గతంలో విజయనగరం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సోలార్ పంపుసెట్లు పెట్టుకోండి..100 శాతం సబ్సిడీతో సహాయం చేస్తామని చెప్పాం. జలసిరి కింద ఉచితంగా బోర్లు వేయించాం.నేడు అన్నీ లేకుండా చేశారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారభించి.. ప్రోత్సాహం అందించాం.రాష్ట్రంలో రైతులకు మిగిలింది అప్పులు తప్ప ఏమీ లేదు. రైతులు వేధింపులకు గురవుతున్నారు.టీడీపీ హయంలో గోనె సంచులు ఇవ్వలేదంటే రోడ్లపైకి వచ్చి.. సాధించుకునే వారు.కానీ ఇప్పడు రైతులందరికీ కేసుల భయం పట్టుకుంది.రైతులను వేధించి భయపెడుతున్నారు. రైతులు చైతన్యవంతులు కావాలి.రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

అమరావతి కి 33 వేల ఎకరాలను 29వేల మంది రైతులు ఇచ్చారు.ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా మేం ఇస్తాం రాజధాని కట్టండి అని ముందుకు వచ్చారు.ఈ రాజధాని వల్ల మేము కూడా బాగుపడతాం రాష్ట్రం బాగుపడుతుందని భూములు ఇచ్చారు.ఈ ఉన్మాది ముఖ్యమంత్రి వారందరినీ సర్వనాశనం చేశారు.ఆడవారిని హింసించి దారుణంగా వ్యవహరించారు.ఇక ఏ రైతు కూడా భూమి ఇవ్వాలంటే ముందుకు రాడు. రాష్ట్రం లో రైతులు కోరిన వాటన్నింటినీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా వేరవేరుస్తా.

LEAVE A RESPONSE