– పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న ఉద్యోగుల్ని సీఎం జగన్ రెడ్డి, వైసీపీ నేతలు చులకన భావంతో చూడటం బాధాకరం. ఉద్యోగులంటే కనీసం గౌరవం ఇవ్వకపోగా వైసీపీ నేతలు అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీఆర్వో, వీఏవోలను తొలగిస్తే గ్రామాలకు పట్టిన పీడ పోతుందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడటం దుర్మార్గం. ఉద్యోగుల్ని కించపరిచేలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులపై కక్ష్యసాధింపు దోరణి ప్రదర్శిస్తోంది. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ రెడ్డి మాట తప్పి మోసం చేశారు. ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలివ్వలేని దుస్దితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఉద్యోగుల సమస్యలపై శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఉద్యోగుల్ని అక్రమ కేసులు, బెదిరింపులతో వేధిస్తున్నారు.ఉద్యోగుల్ని కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి.