– ఆంధ్రాప్రజలపై మీరేమన్నారో గుర్తుంచుకోండి
– వాటిని ఇప్పుడు సోషల్‌మీడియాలో అందరూ చూస్తున్నారు
– ఏపీలో బీజేపీ బలపడుతోంది
– కేంద్ర ప్రాజెక్టులకు నిధులివ్వని జగన్ సర్కారు
– బీజేపీ ఎంపీ జీవీఎల్ ఫైర్
– 50 లక్షల తన ఎంపి లాడ్స్ నిధులతో గుంటూరు, నరసరావు పేట జిల్లాలలో ప్రయాణీకుల సౌకర్యార్థం స్టీల్ బెంచీల ఏర్పాటు
గుంటూరు : గతంలో ఆంధ్రాప్రజలను అవమానించేలా మాట్లాడిన కేసీఆర్ అందుకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఆంధ్రాకు రావాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆంధ్రా ప్రజల భాష, సంస్కృతి, ఆహార అలవాట్లను కించపరుస్తూ మాట్లాడిన వైనం ఇప్పుడు ప్రతి ఆంధ్రుడూ సోషల్‌మీడియా ద్వారా తెలుసుకుంటున్నారని జీవీఎల్ గుర్తు చేశారు.
గుంటూరులో మీడియాతో మాట్లాడిన జీవీఎల్ ఇంకా ఏమి మాట్లాడారంటే… రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైల్వే వంతెనలు పూర్తి కావటం లేదు.రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదు, భూ సేకరణ చేయడం లేదు.కడప జిల్లా, కోనసీమ, నడికుడి, కాళహస్తి రైల్వే లైన్ వ్యవహారంలో పట్టించుకోకుండా చొరవ చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కడప-బెంగళూరు రైల్వే లైన్ కన్నా సిఎం నిధులు ఇవ్వాలి.బస్సు ఛార్జీలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణీకుల నడ్డి విరుస్తుంది. దీంతో రైల్వేపై అదనపు భారం పడుతుంది.
ఏపి ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పి ఏపిలో రాజకీయాలు చేయాలి.ఏపి రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.సోము వీర్రాజు నాయకత్వంలో చేపట్టిన ప్రజా పోరు కార్యక్రమానికి కేంద్ర పెద్దల మద్దతు లభించింది.ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజా పోరు నిర్వహించాలని నిర్ణయించాం.సోము వీర్రాజు నాయకత్వంలో బలమైన శక్తిగా ఏపిలో ఎదుగుతాం. స్థానికంగా అవలంభించాల్సిన విధానాలను రాష్ట్ర కార్యవర్గంలో చర్చించి నిర్ణయిస్తాం.
పన్నెండు రైల్వేస్టేషన్ లో యాభై లక్షల రూపాయల ఎంపి లాడ్స్ తో ప్రయాణీకుల కోసం కుర్చీలు ఏర్పాటు చేశాం.రైల్వే రంగంలో మోడీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు.ఏపీలో 2500 కోట్లతో రైల్వే ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టారు.20 కోట్లతో గుంటూరు రైల్వే స్టేషన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.చిన్న చిన్న రైల్వే స్టేషన్లలో సైతం అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీ నిధులతో చేసాం.రాబోయే రోజుల్లో 12 స్టేషన్లలో 10 కోట్లు, గుంటూరు స్టేషన్లో 20 కోట్లతో అధునాతన హంగులు తో గొప్ప సదుపాయాలు కల్పిస్తాం. గుంటూరు-గుంతకల్ డబ్లింగ్ పనులు 50శాతం పూర్తి స్థాయిలో అభివృధ్ధి జరుగుతుంది.
శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ కు కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేసింది.ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ రైల్వే నిధులు కేంద్రం సహకారంతో విప్లవాత్మక అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.వందే భారత్ రైళ్లు ఏపీకి రావడం ఆనందదాయకం.పెండింగ్ ప్రాజెక్టులపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తాం.అభివృద్ధి కోసం ప్రాంతీయ పార్టీల ఎంపీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.రైల్వే ప్రమాదాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించుతాం.
ప్రయాణీకుల సౌకర్యార్థం 150 స్టీల్ బెంచీల ఏర్పాటు
గుంటూరు మరియు నరసరావు పేట్ పార్లమెంటు నియోజక వర్గాల్లో బీజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన ఎంపీలాడ్స్ నిధులనుంది 50 లక్షల రూపాయల వ్యయంతో పలనాడులోని 12 రైల్వే స్టేషన్ లలో ప్రయాణీకుల సౌకర్యార్థం 150 స్టీల్ బెంచీల ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ రైల్వే శాఖ అధికారులు గుంటూరు రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎల్ పాల్గొన్నారు. దీనిలో ఉన్నతస్థాయి రైల్వే అధికారులతో పాటు పలనాడులోని వివిధ నియోజకవర్గాల మరియు గుంటూరు జిల్లా నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు స్థానికులు పాల్గొనడం జరిగింది…ఈ సందర్బంగా గుంటూరు, పలనాడులోని అనేక రైల్వే స్టేషన్ లలో ప్రస్తుత స్థానిక సమస్యలను కార్యకర్తలు, స్థానికులు, మరియు గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లు యూనియన్ జివీఎల్ దృష్టికి తీసుకురాగా అక్కడే ఉన్న రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి వాటిని అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు…దీనిపై స్థానికులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, నరసరావుపేట జిల్లా అధ్యక్షుడు ఆలోకం సుధాకర్, యశ్వంత్, అనుమోలు వంశీకృష్ణ, కుమార్ గౌడ్, ఈదర శ్రీనివాస రెడ్డి, హరికృష్ణ, అనుమోలు ఏడుకొండలు గౌడ్, ఉయ్యాల శ్యాంవరప్రసాద్, గోరంట్ల సత్యనారాయణ, ఎడమ రాజేష్, తోట శ్రీను, మేరీ సరోజిని, పాండురంగ విట్టల్, లక్ష్మీ సామ్రాజ్యం, బుల్లి బాబు, కొక్కెర శ్రీనివాస్, అనిల్, నరసింహమూర్తి, తూనుగుంట్ల రాజేష్, అంకాల శ్రీను, సురేష్ జైన్ , రాయ నాగేశ్వరావు, స్టాలిన్, దారా అంబేద్కర్, బాబురావు పాల్గొన్నారు.