– న్యాయ వ్యవస్ద లేకుంటే ఈ పాటికి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అమ్మేసేవారు
-ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న వైసీపీ గొంతు నొక్కేందుకు ప్రజలు సిద్దం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రతిపక్షాలపై కక్ష్యసాధించేందుకు ప్రజాధనం వృధా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వైసీపీ అరాచక పాలనలపై ప్రజల్లో తిరుగు బాటు మొదలైంది. దీన్ని గమనించే ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు నిర్వహించకుండా రాజ్యాంగ విరుద్దంగా జీవో నెం. 1 తెచ్చి ప్రజా స్వామ్యం గొంతు నొక్కేందుకు జగన్ రెడ్డి ప్రయత్నించి విఫలమయ్యారు. జీవో నెం.1పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టు.
హైకోర్టులో విచారణ ఉండగా, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారు? చట్ట విరుద్దమైన జీవోలు తెచ్చి ప్రజాధనాన్ని జగన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారు. జగన్ రెడ్డి లాంటి వ్యక్తులు ముఖ్యమంత్ర అయితే పరిస్తితి ఎలాంటుందో ఊహించే నాడు రాజ్యాంగ పెద్దలు శాసన, కార్యనిర్వాహక వ్యవస్ధలతో పాటు న్యాయ వ్యవస్ధను కూడా ఏర్పాటు చేశారు. జగన్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల్ని న్యాయ వ్యవస్ధలు అడ్డుకుంటున్నాయి కాబట్టి సరిపోయింది, లేదంటే జగన్ రెడ్డి ఈ పాటికి రాష్ట్రాన్ని అమ్మేసేవారు.
అధికార బలంతో మమ్మల్ని అడ్డుకోవాలనుకోవటం పగటి కల. ఎన్ని నిర్బందాలు విధించినా చేధించి జగన్ రెడ్డి దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడతాం. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతల గొంతును ప్రజలు ఓటు అనే ఆయుధంతో శాశ్వతంగా నొక్కేందుకు సిద్దంగా ఉన్నారు. అనైతిక, అప్రజాస్వామిక నిర్ణయాలతో ప్రజాగ్రహాన్ని అణగ ద్రొక్కలేరు.