Suryaa.co.in

Andhra Pradesh

సిఎస్ పై తొందరపాటుగా నిందలు వేయడం భావ్యం కాదు

– బొప్పరాజు , పలిశెట్టి దామోదర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి గారు, తేదీ 3.2.2023 న వై.యస్.ఆర్.జిల్లాలో కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా OSD క్రిష్ణ మోహన్ రెడ్డని తీసికొని వెళ్లారని వార్తలు రాయడం, దానిని నేడు సిఎస్ ఖండిస్తూ పత్రికల్లో వార్త రావడం చూసిన మా ఉద్యోగులందరికీ చాలా బాధ కలిగింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డా. కె.యస్.జవహర్ రెడ్డి ఇంతవరకు ఏ విభాగం ఉన్నతాధికారిగా పని చేసినా, ఏ ప్రభుత్వంలో పనిచేసినా సరే మంచి పేరు తెచ్చుకుంటూ వచ్చారు. అలాంటి ఉన్నతమైన భావాలతో పని చేస్తూ, మంచి నీతిమంతుడుగా, నిత్యకృషీవళుడుగా పనిచేస్తున్న వ్యక్తి, ప్రభుత్వయంత్రాంగానికి, మా ప్రభుత్వ ఉద్యోగులుకు దళపతి గా ఉన్న ఒక అత్యున్నత ఉన్నస్దాయి అధికారిపై వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపాటుగా నిందలువేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మనోభావాలు దెబ్బతినేలా వార్తలు రాయడం పట్ల ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర కమిటీ తరుపున ఖండిస్తున్నామని ఏపిజెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావులు, అసోసియేట్ చైర్మన్ టి.వి. ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళికృష్ట నాయుడు సోమవారం ఒక ప్రకటద్వారా ఖండిస్తూ, భవిష్యత్ లో ఒక ఉన్నత స్థాయి వ్యవస్థను నడిపిస్తున్న వ్యక్తులపై ఆరోపణలు చేసేటప్పుడు నిరూపణ చేసుకున్న తర్వాత వార్తలు రాస్తే బాగుంటుందని AP JAC అమరావతి పక్షాన తెలియచేస్తున్నాము.

LEAVE A RESPONSE