తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్)కు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు. మీపై ఎల్లప్పుడూ భగవంతుని దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.