Suryaa.co.in

Telangana

ఎమ్మెల్యే శంకర్ నాయక్ , వైఎస్ షర్మిల క్షమాపణ చెప్పాలి

ట్రాన్స్ జెండర్ ల కోసం కొత్త చట్టం తీసుకు రావాలి
– ట్రాన్స్ మార్చ్ కలెక్టివ్ ప్రతినిధుల సమావేశం

తమను అవమానిస్తూ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, వైఎస్సార్‌టీపీ షర్మిల తక్షణం క్షమాపణ చెప్పాలని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో : కల్పిస్తూ చట్టం తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో, ట్రాన్స్‌జండర్లు తమ అభిప్రాయం ఈవిధంగా వ్యక్తం చేశారు.

కృష్ణ . ట్రాన్స్ జెండర్
ట్రాన్స్ జెండర్ పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.కొజ్జా అనే పదాన్ని వాడటం ఎంత వరకు సమంజసం, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటు, షర్మిల క్షమాపణ చెప్పాలి.పదే పదే ఆ పదాన్ని వాడుతూ మా ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా ఉంది.మా ఓట్లు కావాలి, ఓట్లు వేయించుకొని మమ్మల్ని ఇలా ఎలా తిడుతారు.తమకు అన్ని చట్టాలు ఉన్నాయి. పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న మమ్మల్ని ఇలా మాట్లాడుతున్నారు.రాజకీయ నాయకులు సిగ్గులేకుండా తిడుతున్నారు.సమాజాన్ని ఇలా తిడుతున్న మీరు, ప్రజల్ని ఎలా పాలిస్తారు.చరిత్రలో ఎవరూ కూడా ఇలాంటి వాఖ్యలు చేసిన వాళ్ళు బ్రతికి బట్ట కట్టిన దాఖలాలు లేవు.బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

అవంతిక.. ట్రాన్స్ జెండర్
రాజకీయ నాయకుల మాటల వల్ల మా మనోభావాలు దెబ్బ తింటున్నాయి.ఇప్పుడిప్పుడే మేము కాస్త సమాజం లో హుందాగా బ్రతుకుతున్నం.ఇలాంటి వాఖ్యలు చేయొద్దు.ఇక పై కొజ్జా లాంటి పదాలు వాడి మమల్ని తిడితే రాష్ట్రంలో మేము తిరగనివ్వం.ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారో చూస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ ల కోసం కొత్త చట్టం తీసుకు రావాలి.

LEAVE A RESPONSE