Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కారానికే ఉద్యమానికి సిద్దం పడుతున్నాం

-ఈనెల 27 నుండే ఇతర ఉద్యోగసంఘాలు/ట్రేడ్ -యూనియన్లు/ప్రజాసంఘాలు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నాం
-మార్చి 9 నుండి ఉద్యమ కార్యచరణ ప్రారంబించి దశలవారిగా ఏఫ్రిల్ 4 వరకు కొనసాగిస్తాం
-ఏఫ్రిల్ 5 న రాష్ట్రకార్యవర్గసమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం యొక్క స్పందనను బట్టి భవిష్యత్ లో -ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు కీలకనిర్ణలు తీసుకుంటాం
బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు

ఏపి లో పనిచేస్తున్న ఉద్యోగ,ఉపాధ్యయ,కార్మిక,రిటైర్డు,కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగు ఉద్యోగుల పరిస్దితి రోజు రోజు కు చాలా దయనీయమైన పరిస్దితికీ నెట్టబడుతుంది.అది చివరీకి ఏస్దాయికి వచ్చిందంటే ఉద్యోగులు పనిచేసిన కాలనికి 1 వ తేదీన జీతాలు/పెన్సన్లు చెల్లించండి మహాప్రభో అని అడుక్కొవల్సి పరిస్దితి గతంలో ఏప్రభుత్వం హయాంలో లోను ఇలాంటి పరిస్దితులు దాపురించంచలేదు, ఈ పరిస్దితులన్నింటిని ప్రభుత్వ పెద్దలకు, ప్రభుత్వ ఉన్నతాధికార్లుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నాసరే ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎటువంటి చొరచూపడంలేదు సరికదా నిర్ణక్ష్యదోరణితో వ్యవహరిస్తున్నందున తప్పని సరి పరిస్దితులలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారి పోరాటాలతో ప్రారంబించి చివరకు ఉద్యోగుల సమస్యపరిష్కరించుకొనేందుకు ఎటువంటి పోరాటాలకు ఉద్యోగులను సిద్దం చేసేందుకు పక్కప్రణాళాకతో ముందుకుపోతూ ఆంధోళణా కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ఏపి జెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళీకృష్టం నాయుడు తెలిపారు.

ఆదివారం విజయవాడ రెవిన్యూభవన్ లో జరిగిన ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకార్యవర్గసమావేశం జరిగింది.ఈసమావేశంలో జెఏసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు లు మాట్లాడుతూ ఏపి ఉద్యోగుల మంతా ఎంతో ఆశగా ఎదురు చూసిన 11 వ పిఆర్శీ లో కూడా ఉద్యోగులుకు చాలా అన్యాయం జరిగింది.ఈపిఆర్శీలో ఎంతో కొంత ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి అనుకుంటే ఉన్న జీతాలు కోతలు పెట్టి పిఆర్శీసి జరిపించారు. ఆందులో ఉన్న లోపాలను,ఇబ్బందులను అప్పుడే జెఏసి తరుపున ప్రశ్నంచడం జరిగింది.కాని ఆనాడు చర్చలలో పాల్గొన్న ముఖ్యమంత్రిగారే స్వయంగా స్పందించి ఆర్దిక,ఆర్దికేతర సమస్యలు పరిష్కారికి ఒక షెడ్యూల్ ప్రకటించి మమ్మలను నమ్మండి అని, మాప్రభుత్వం లో ఉద్యోగులు కూడా బాగస్వామ్యూలే మీ ఇబ్బందులు మాఇబ్బందులు అనుకొని అన్ని చేస్తామని మమ్మలని నమ్మబలికి, నాడు ఇచ్చిన హామిలు అమలు చేయమని ప్రభుత్వపెద్దలను అడుగుతున్నా,ఉన్నతాధికార్లును అడుగుతున్నా సరే అందరు మౌనంగానే ఉంటున్నారు.

ఇలాంటి పరిస్దితులలో సమస్యలు పరిస్కారాని ఎవరు చొరవ చూపని కారణంగా నేడు ఉద్యోగులు పరిస్దితీ ఏస్దాయికి దిగజారింది అంటే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్దితి ఒకవైపు ఉంటే, మరోవైపు ఉద్యోగులు వారి కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు కూడా చెల్లించడంలేదు సరికదా,ఉద్యోగులకు సమాచారం ఇవ్వకుండానే ఉద్యోగులు దాచున్న డబ్దులను కూడా ప్రభుత్వం దోచుకుంటుంది. ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోగాని,విభజనతరువాత గాని ఏ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏఉద్యోగి ఎన్నడూ చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్దితులలో ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా అవసరాలకు ఇవ్వని కారణంగా ఉద్యోగులు ఆడపిల్లలు పెళ్లిళ్లు వాయిదాలు వేసుకోవల్సిన పరిస్దులు వస్తున్నాయి.

కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురైనా సందర్బాలలో కూడా మెరుగైన చికిత్సచేయించుకోలేని,ఇలాంటి దుర్బరమైన పరిస్దితులలో ఉద్యోగులు పరిస్ది ఉంది. సకాలంలో పిల్లల చదువుల ఫీజులు కట్టలేక స్కూలు/కాలేజ్ యాజమాన్యాలతో అవమానాలు పడాల్సిన పరిస్దితులు వస్తున్నాయి. ఈ పరీస్దితులన్నింటికీ అన్నిడిపార్టుమెంటు ఉద్యోగులు,కేడర్ వారిగా పడుతున్న ఇబ్బందులు,సమస్యలు,ఆర్దిక,ఆర్దికేతర సమస్యలు అన్ని తేదిః 13-02-2023 న ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా రికి 50 పేజీల మెమోరాండం ఏపిజెఏసి అమరావతి రాష్ఠ్రకమిటి తరుపున ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇంకా సమస్యలు పరిష్కారంలో చొరవ చూపని కారణంగా తప్పని పరిస్దితులలో ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కానికి ఉద్యమానికే సిద్దపడాల్సిపరిస్దితులు వచ్చిందని ఏపి జెఏసి అమరావతి నాయకత్వం తెలిపారు.

ఉద్యోగులు ప్రధాన సమస్యలు
11 వ పిఆర్సీ లో క్యాడర్ వారి స్కేల్స్ ను నేటికీ సంబందిత అధికారులకు పంపనందున, 2018 తర్వాత ఉద్యోగంలో చేరే ఉద్యోగులకు వారి కొత్త పే స్కేల్ ఎంతోతెలియని పరిస్దితులలో ప్రస్తుతం 2015-PRC స్కేలును 2022-prc స్కేలుతో పోల్చుకుని జీతాలు డ్రా చేస్తున్నాపరిస్దితి ఉంది. 11వ PRC లో, చాలా శాఖలలో ఉద్యోగులకు స్పెషల్ పే లు, అలవెన్సులు పై కమిటీ వేస్తామని చెప్పినప్పటికీ, నేటికీ ఉత్తర్వులు ఇవ్వనందున చాలా శాఖలలో కొన్ని cadre ఉద్యోగులకు ఆర్ధిక నష్టం జరుగుతుంది.

11వ పీఆర్సి (అమలు తేదీ 1.4.2020 నుండి 31.12.2021 మద్య కాలానికి) అరియర్స్ ఎప్పుడూ చెల్లిస్తారో తెలియని పరిస్దితి ఉంది. పెండింగు డిఏ లు పై ప్రభుత్వం ఇచ్చిన GO లు (1.7.2018, 1.1.2019 & 1.7.2019 కాలాలకు) నేటికీ ఇది అమలుకు నోచుకోనందున ఉద్యోగులకు పెన్సనర్ల కు తీవ్ర నష్టం జరుగుంది. కొత్త DA లు (అంటే ధరలకు అనుగణంగా పెంచే భత్యం)దరలు పెరుగు తున్నాయిగాని 2022 జనవరి నుండి నేటివరకు ఇవ్వాల్సిన DA ఊసే లేదు.ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్దితి.
పదవీ విరమణ లేదా మరణించిన ఉద్యోగులు ఎవరికి ఎలాంటి ఆర్థికపమైన బెనిఫిట్స్ నేటికీ అందలేదు. ఎర్నెడ్ లీవులు, సరెండర్ లేవులు, గ్రూప్ ఇన్సూరెన్స్ లోనులు/విత్ డ్రాలు, లీవ్ సాలరీలు, సిక్కులపై జీతాలు/సప్లిమెంట్ బిల్లులు, టి ఏ బిల్లులు గత రెండు సంవత్సరాలుగా రావడం లేదు. ముఖ్యమంత్రి గారే CPS రద్దు చేసి, పాత పింఛను విధానం తెస్తామని ఇచ్చిన హామిని అమలు చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని ఇచ్చి హామి అమలు చేయాలి. ఔట్ సోర్శీంగు ఉద్యోగులకు 11వ PRC లో కనీసం 30% జీతాలు పెంచమని పీఆర్సీ కమిషనర్ & సిఎస్ కమిటీ లు రికమెండ్ చేసిన విదంగా 30% జీతాలు పెంచాలి.

అన్ని విభాగాలలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు జరిపి ఆకుటుంబాలను ఆదుకోవాలి. EHS ద్వారా మెరుగైన కార్పురేట్ ఆసుపత్రులద్వారా వైద్యం అందించాలి. పెండింగు మెడికిల్ బిల్లులు చెల్లించాలి. ప్రభుత్వ రంగంలో ఉన్న వైధ్యశాఖతోపాటు అన్నివిభాగాలలో ఉన్న ఖాళీలను బర్తీచేయాలి. ప్రభుత్వశాఖలలో అన్నివిభాగాలలోను అద్దెవాహనాలు కట్టడిచేసి ప్రభుత్వవాహనాలు కొనుగోలుచేయాలి. విధ్య, వైధ్యరంగాలు, ఆర్టీసి, మున్సిపల్, యూనివర్శిటీ, గ్రామసచివాలయ ఉద్యోగులసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.

ఈ సమస్యలే కాకుండా ఇంకా అనేక డిపార్టుమెంట్లులలో,వివిద కేటగిరుల సమస్యలు పైన ఇప్పటికే లిఖితపూర్వకంగా ప్రభుత్వం దృష్టికి వాటన్నింటి పరిష్కరించుకొనేందుకు,మనజీతాలు,పెన్సన్లు సకాలంలో పొందేందుకు,మనకురావల్సిన బకాలు సాదించుకొనేందుకు, ప్రభుత్వం ఇచ్చిన హామిలు అమలు చేసుకొనేందుకు,11 వ పిఆర్శీసి నష్టాలను సరిచేసుకొనేందుకు మనమంతా ఒక్కటై పోరాటం చేయకపోతే మనభవిష్యత్ అంతా అందకారమే అవుతుంది.

ఇప్పటికేప్రభుత్వం జీతాలు 20 తేదీలోగా ఇస్తున్నాం కదా అంటున్నారు.భవిష్యత్ లో జీతం కూడా మనకు రావల్ని బకాయిలు మాదిరిగానే ఎప్పుకోఒకప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాం అనే పరీస్దితి వచ్చినా ఆశ్చర్యపొనవసరంలేదు.ఇలాంటి పరిస్దుతులు రాకముందే మందే మనమంతా ఒక్కటై మనమద్యఉన్న విభేదాలు మరచి ఒక్కటి కావాలని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు సాధనకోసం చేపట్టబోతున్న ఈఉద్యమానికి అందరి మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వమే బాద్యవహించాలి,ఉద్యోగుల డిమాండ్లు అన్ని ప్రభుత్వం ఇచ్చిన హామిలే ఇవేమి మా గొంతమ్మకొర్కేలు కాదు,సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం ఇంకా జాప్యం జరిగితే ఈఉద్యమం ద్వారా ప్రజలకు జరిగే అసౌకర్యానికి ప్రభుత్వమే బాద్యతవహించాల్సివస్తుందని మనవి చేస్తున్నాం.ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు సాదనకోసం చేపడుతున్న ఈఉద్యమానికి ప్రజలు మద్దతుఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.అలాగే ఈఉద్యమానికి అన్నిట్రేడ్ యూనిన్లు,ప్రజాసంఘాలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్
మార్చి 9,10 తేదీలలో ఉద్యోగులమంతా నల్లబ్యాడ్జిలు దరించి విధులకు హాజరై నిరసన తెలియజేస్తాం.
మార్చి 13,14 తేదిలలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ /ఆర్.డి.ఓ కార్యాలయాలవద్ద బోజనవిరామం సమయంలో నిరసన సమావేశాలు.
మార్చి 15,17,20 తేదీలలో జిల్లాకలెక్టర్లు కార్యాలయాలవద్ద భారీ మహాధర్నాలు నిర్వహిస్తాం.
మార్చి 21 న రోజంతా ఉద్యోగులు సెల్ ఉపయోగించకుండా సెల్ డౌన్ చేపడతాం.
మార్చి 24 న రాష్ట్రస్దాయిలో అన్ని కమీషనర్ కార్యాలయాలవద్ద ధర్నాలు చేపడతాం.
మార్చి 27 న కారుణ్యనియామాకాలలో చనిపోయిన కుటుంబసబ్యులను జిల్లాలలో సందర్సన చేస్తాం.
ఏఫ్రిల్ 1 న 1.రాష్ట్రవ్యాప్తంగా పదవి విరమణ చేసిన కుటుంబాలను,
అతి తక్కువ పెన్సన్ పొందుతున్న ఉద్యోగుల కుటుంబాలను,
సిపియస్ ఉద్యోగులను కలిసి వారి బాదలు తెలుసుకుంటాం.
ఆర్జిత సెలవు,సరండర్ లీవ్ లు,జిపియఫ్,ఏ.పి.జి.యల్ రానివారి ఆర్దికఇబ్బందులు పడుతున్ణవారిని కలుస్తాం.
ఏఫ్రీల్ 3 న చలో కలెక్టరేట్ గా వెళ్లి ఉద్యోగుల సమస్యలతో గ్రీవెన్సు డే ను నిర్వహించి సమస్యలు మెమోరాండాన్ని కలెక్టర్లకు అందజేస్తాం.
ఏఫ్రిల్ 5 న రాష్ట్ర కార్యవర్గం నిర్వహించి భవిష్యత్ కార్యచరణపై కీలకనిర్ణయాలు ప్రకటిస్తాం.
unnamed

LEAVE A RESPONSE