భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తో కలిసి పార్టీ రాష్ట్ర కార్యాలయం లో రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప విన్నారు. ప్రతి నెల దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని వివిధ సామాజిక అంశాలపై రేడియో లో మన్ కీ బాత్ పేరుతో మాట్లాడే విషయం తెలిసిందే. తాజా మన్ కీ బాత్ లో తెలంగాణ కు చెందిన పేరిణి నృత్య కళాకారుడు శ్రీ రాజశేఖర్ కళా ప్రదర్శన గురించి ప్రస్తావించడం ప్రధానమంత్రి సునిశిత దృష్టికి ఒక ఉదాహరణ అని సంగప్ప చెప్పారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, కార్యదర్శి కొల్లి మాధవి, విక్రమ్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరిణి రాజశేఖర్ 101 రోజులు నిరంతరంగా 31 జిల్లాలో ఇచ్చిన ప్రదర్శనను ప్రధాని గుర్తించడమే కాకుండా దేశ ప్రజలకు చెప్పారని సంగప్ప అన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, కార్యదర్శి కొల్లి మాధవి, విక్రమ్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.